S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/26/2016 - 22:06

భూమికోసం చిత్రం 1974లో వచ్చింది. అందులో ‘ఎవరో వస్తారని/ ఏదో చేస్తారని/ ఎదురుచూసి మోసపోకుమా’ అన్న మేల్కొలుపు పాట చాలా చాలా ఇష్టం. ‘నిజం మరచి నిదురపోకుమా’ అన్న సందేశంతో సాగే పాటలో కాచి వడబోసిన జీవితం కనిపిస్తుంది. రచయిత శ్రీశ్రీ ఐదు చరణాల్లో పాటకు పదును పెట్టారు. తన కలం బలంతో సామాజిక సమస్యలను స్పృశించారు.

09/26/2016 - 22:05

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.

09/26/2016 - 21:24

వేల కొద్ది మార్లు జోకొట్టి
వేన వేల సార్లు జోల పాడిన
అమ్మ గురించి
ఒక మాట
అమ్మకోసం
జాలి పాట పాడం

గోరుముద్దలు తినిపించి
గోముతనం చూపించి
గారాం చేసిన
అమ్మ గురించి
గొప్పమాట
అది తప్ప
ఏమి చెప్పం

09/26/2016 - 21:20

కీ.శే. అద్దేపల్లి రామమోహనరావు ఆరు దశాబ్దాల సాహితీ ప్రస్థానం ఎందరికో మార్గదర్శనం అయ్యింది. ఒక వ్యక్తిగా సాహితీ వ్యవస్థలో జరిగిన అన పరిణామాలకు తన సొంత ముద్రను కలిగి ఉన్న అగ్రేసర కవులలో అద్దేపల్లిది విలక్షణమైన, విశిష్టమైనదనే చెప్పవచ్చును.

09/26/2016 - 21:20

అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన సోమనాథం తన భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ సోఫాలో కూర్చున్నాడు. సోమనాథం ఒక ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఎంతో ఆనందంగా తన రోజులను గడుపుతున్న సోమనాథం ఆనాడు ఎందుకో విచారంగా కనిపించాడు. భర్త మొహంలో ఉన్న విచారమును కనిపెట్టిన సీత మీరు కూడా నేను ఆలోచిస్తున్నదే ఆలోచిస్తున్నారా అని అడిగింది. అవును అన్నట్టుగా తల ఊపాడు సోమనాథం.

09/26/2016 - 21:09

వినతి చేస్తుందే గాని
వీరోచిత పోరాటాలు చెయ్యదు
ఇబ్బందులెన్నైనా భరిస్తుంది గాని
విద్యుక్త్ధర్మాన్ని వీడదు...
ఇంటి పోషణ భారాన్ని
భుజాలపై మోస్తూ
కాలాన్ని గడుపుతున్న
ఓ... ఇల్లాలు ఆమె!
పట్నంలో విధులు
రోజూ ప్రయాణం..
రెండు మైళ్ల దూరమైనా
నరక లోగిళ్లు దాటుతున్నట్లు
కలవరపడని రోజు లేదు!
ఇల్లు వదిలి
రోడ్డుపై అడుగిడగానే

09/26/2016 - 21:05

‘‘అబ్బ! ఆపరా బాబు నీ సుత్తి!’’
నాకేసి నమిలి మింగేసేలా చూస్తూ కృష్ణమూర్తి అలా అంటుంటే ఒళ్లు మండిపోయింది నాకు.
మండదామరి?!
పోనీలే స్నేహితుడు కదాని, వాడి బాగుకోరి బోల్డంత ఎనర్జీ వేస్ట్ చేసుకుని నోరు నొప్పెట్లేలా హితబోధ చేస్తే.. వెధవకది సుత్తిలా అనిపించిందంటే - ఒళ్లు మండకుండా ఎలా ఉంటుంది?

09/26/2016 - 21:02

జత లేదు..
మతి లేదు
గతి లేదు
క్రుంగెను హృదయం
చెదిరెను మనసు
రాలెను ఆశ
బాంధవ్యం కనుమరుగై
సంఘజీవనం వగరై
చాంచల్యం మెరుగయ్యెను
సంతాన స్పర్శకై చెయి చాపెను
ఒంటరియై వెక్కి వెక్కి ఏడ్చెను
ఆశ్రమాల దారి పట్టెను
కరుణ లేని బిడ్డలు
కఠినమైన మనసులు
కాటికెళ్లు కాయములు
మేను ఆవిరైనా
ఆత్మలో అవే అవే తలపులు

09/26/2016 - 20:56

ఒక పెద్ద నీటి పంపు గంటా 40 నిమిషాల్లో ట్యాంక్‌ను నింపుతుంది. ఇక చిన్న నీటి పంపు 5 గంటలకు ట్యాంక్‌ను నింపగలదు. పెద్ద నీటి పంపు ఆన్ చేయగానే వెంటనే పాడైపోయి ఆగిపోయింది. వాచ్‌మేన్ చిన్ననీటి పంపుని ఆన్ చేశాడు. ఓ గంటలో పెద్ద నీటి పంపు రిపేర్ చేసి ఆన్ చేశాడు. అయితే ఆ రెండు నీటి పంపులు ట్యాంక్‌ను ఎంత టైమ్‌లో నింపుతాయి?

ఒక గంట

09/26/2016 - 20:53

దేవతలకు ఇష్టమైనదిగా చెప్పుకునే కదంబ పుష్పం భారత ఉపఖండంలో కనిపిస్తుంది. సుమధురమైన వాసనతో, కాషాయవర్ణంతో గుండ్రంగా, ఆకర్షణీయంగా కన్పించే ఈ పుష్పం తేనెటీగలకు ప్రీతిపాత్రమైనది. వీటిలో ఉండే మకరందం వాటికి ఇష్టం. ఐదున్నర సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ పుష్పంలో ఫలదీకరణం తరువాత ఎనిమిదివేల విత్తనాలు ఏర్పడతాయి. రంగులు, అత్తరుల తయారీలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

Pages