S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 23:36

భూత్పూర్, సెప్టెంబర్ 22: దేవాలయం నిర్మాణంలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మండలంలోని అమిస్తాపూర్‌లో జరిగింది. గ్రామస్ధుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ వెళ్లే రహదారి పక్కన శ్రీ సీతారాముల దేవాలయం నూతనంగా నిర్మాణం చేపడుతున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు విగ్రహాల చేతులు, గదలను ధ్వంసం చేశారు.

09/22/2016 - 23:36

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: చేనేత రంగాన్ని పరిశ్రమల శాఖలో కలపొద్దంటూ జిల్లా చేనేత అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్‌లో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో తెలంగాణ చేనేతల అఖిల పక్ష ఐక్యవేదిక కన్వీనర్ వీరన్న, గౌరవ అధ్యక్షులు వెంకటేష్‌లు మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయ వారసత్వ సంపదలో భాగమైన చేనేత వృత్తిపై లక్షల కుటుంబాలు ఆదారపడి బతుకుతున్నారని తెలిపారు.

09/22/2016 - 23:35

భూత్పూర్, సెప్టెంబర్ 22: పాలమూరును అభివృద్ధిని అడ్డుకుంటున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని , ఆయన పాలమూరు జిల్లాను దత్త తీసుకుని చేసింది శూన్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

09/22/2016 - 23:35

గద్వాల, సెప్టెంబర్ 22: చేనేతరంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జౌళిశాఖ డైరెక్టర్ ప్రీతిమీనన్ అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేనేతన్నల స్థితిగతులు, సమస్యల పరిష్కారం కోసం నడిగడ్డ ప్రాంతంలో మూడు రోజుల పాటు వారి సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చేందుకు పర్యటన చేపట్టినట్లు ఆమె తెలిపారు.

09/22/2016 - 23:34

కల్వకుర్తి, సెప్టెంబర్ 22: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అచారి, టిడిపి తాలుకా అధ్యక్షుడు బాలస్వామిగౌడ్ లు అన్నారు.పట్టణంలోని తహాశీల్దార్ కార్యాలయం ముందు గత 27 రోజులుగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు కడ్తాల, చారకొండలను మండల కేంద్రాలుగా

09/22/2016 - 23:34

మల్దకల్, సెప్టెంబర్ 22: క్రీడలతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని, మానసిక ఉల్లాసానికి, శారీరక దృడత్వానికి ఎంతో దోహదపడుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతిగృహం వద్ద మండల క్రీడా ప్రాంగణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

09/22/2016 - 23:33

కొత్తకోట, సెప్టెంబర్22: ఇటీవల కురుస్తున్నా వర్షాలకు కరువు పరిస్థితులు పంటలు ఏ విధంగా ఉన్నాయో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి కెసి ఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుఆ నిరంజన్ రెడ్డికి ఫోన్‌లో సమాచారం అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి వద్ద శంకరసముద్రం రిజర్వాయర్ పనులను పరిశీలిస్తుండగా ముఖ్యమంత్రి కెసి ఆర్ వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో వర్షపాతం ఏ విధంగా ఉంది ఎన్ని చెరువులు నిండాయో తెలుసుకున్నారు.

09/22/2016 - 23:32

కొత్తకోట, సెప్టెంబర్22: దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించడమే ద్యేయంగా పెట్టుకున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్ నుండి 19వ ప్యాకెజ్‌కు మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తిపోసేందుకు వారు భూమి పూజ నిర్వహించారు.

09/22/2016 - 23:32

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: కాళేశ్వరం తరహాలోనే జిల్లాలోని జూరాల ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిపోయిందని ఆరోపించారు.

09/22/2016 - 23:31

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహబూబ్‌నగర్ జిల్లా రాయలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉన్న గట్టు మండలం ఆలూరు గ్రామంలో ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం, పునరావాస బెనిఫిట్లను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Pages