S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు ఇవ్వడమే లక్ష్యం

కొత్తకోట, సెప్టెంబర్22: దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించడమే ద్యేయంగా పెట్టుకున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని శంకరసముద్రం రిజర్వాయర్ నుండి 19వ ప్యాకెజ్‌కు మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తిపోసేందుకు వారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భీమా ఎత్తిపోతల ద్వారా 27వ ప్యాకెజికి రబీలో నీళ్లు అందించామని, ఎడమ కాల్వ 19వ ప్యాకెజ్ నుండి 20వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీని ద్వారా పెద్దమందడి, దేవరకద్ర, కొత్తకోట, అడ్డాకుల మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. శంకరసముద్రం రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో శంకరసముద్రం వద్ద 10 మోటార్లను భిగించి ఎత్తిపోతల ద్వారా 19వ ప్యాకెజికి నీరందించి 8వేల ఎకరాలకు సాగులోకి తెస్తున్నామన్నారు. నీటి సామార్య్థం నింపుకోకపోవడంతో ఇక్కడ పనులు నత్తనడకన సాగుతుందని బండ్ షెటర్లను భిగించకపోవడం ఇబ్బందులు తలెత్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమం కోసం పాటుపడుతుందని, చెరువులు, కుంటలు నింపుకొని సాగునీరు అందించడమే ప్రభుత్వం ద్యేయంగా పెట్టుకుందన్నారు. దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో 15 గ్రామాలకు రాబోయె కాలంలో తాగునీరు అందుతుందన్నారు. శంకరసముద్రం రిజర్వాయర్ పనులను వారు పరిశీలించారు. ఈ సమావేశంలో ఇ ఇ ఉమాపతి రావు, డిప్యూటి డి ఇ మోహన్ రెడ్డి, ఎంపిపిలు శంకర్ నాయక్, గుంత వౌనిక, దయాకర్, సింగిల్‌విండో ఛైర్మన్ రావుల సురేంద్రనాథ్ రెడ్డి, సర్పంచులు చెన్నకేశవ రెడ్డి, రాజేశ్వరమ్మ, సుమిత్రమ్మ, నాగేష్, బాలరాజు, రాములు, నాయకులు వాకిటి శ్రీ్ధర్, లోక్‌నాథ్ రెడ్డి, భీంరెడ్డి, వామన్‌గౌడ్, ప్రశాంత్, జగన్, జగదీశ్వర్ రెడ్డి, మెగారెడ్డి, కటికె శ్రీను, వెంకటన్నగౌడ్, వెంకటేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.