S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాళేశ్వరం తరహాలో జూరాలను రీడిజైన్ చేయాలి

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22: కాళేశ్వరం తరహాలోనే జిల్లాలోని జూరాల ప్రాజెక్టును రీడిజైన్ చేయాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం జరిగే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని అందుకు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం కూడా ఇస్తూ ఆయనను కూడా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. జిల్లా ప్రయోజనాలను జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి అసలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. జిల్లా ప్రజయోజనాలు దెబ్బతింటుంటే మంత్రులు అసమర్థులా మాదిరి నోరు మూసుకుని కూర్చుంటే నష్టం జరుగుతుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను తెలంగాణ తెలుగుదేశం ఎప్పుడు వ్యతిరేకించలేదని అన్నారు. కానీ ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలతో పాటు డిపిఆర్‌ను మాత్రం ప్రజల ముందు ఉంచాలని ఎప్పటినుండే తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అసలు జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు ఎత్తిపోతల శ్రీకారం చుట్టిఉంటే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేవని కానీ సమస్యలు పరిష్కరం కాకూడదనే దుర్బుద్దితో తెరాస నాయకులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతి నిత్యం ఎదో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని విమర్శించారు. తాను పదేపదే చెబుతున్నానని పాలమూరు ఎత్తిపోతలకు జూరాల నుండి ఓ భాగం, శ్రీశైలం నుండి మరి కొంత నీటిని తీసుకుంటే సమస్యలు ఉండేవికావని ఇతర రాష్ట్రాలకు కొన్ని అవకాశాలు ఇవ్వడానికి కూడా వీలు ఉండేదికాదన్నారు. కానీ ఎప్పుడు ప్రజల మధ్య తగాదాలు పెట్టడమే టిఆర్‌ఎస్ నాయకుల ఎజెండా అని మండిపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుంటే వాటిపై ప్రజలను అప్రమత్తం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఎత్తిపోతలకు రూపకల్పన చేసింది దివంగత ఎన్టీఆర్ అని అన్నారు. జిల్లాలో ప్రాజక్టులకు సైతం శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్, టిడిపి హయాంలో జరిగిన ప్రాజెక్టుల పనులు తాము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసలు జిల్లాలో ప్రాజెక్టుల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతఖర్చు పెట్టిందో శే్వత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాకు జూరాల ప్రాజెక్టు ఓ పెద్ద వరం లాంటిదని ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే చాలా సమస్యలు తీరుతాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన సూచనలను తాము స్వాగతిస్తున్నామని ఇలాంటి తీర్పులు ఇక్కడే కాకుండా దేవమంతటా రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. తెరాస చేస్తున్న తప్పులు హైకోర్టు ఎన్నో సార్లు మొట్టిక్కాయలు వేసిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి నీచ్చమైన రాజకీయాలకు దిగకుంటే తెలంగాణ రాష్ట్రం పరువు దేశంలో పెరుగుతుందని లేకుంటే ప్రజలు పోరాటం చేసిన తెచ్చుకున్న తెలంగాణకు చెడ్డపేరు వస్తుందని దయాకర్‌రెడ్డి అన్నారు. విలేఖరుల సమావేశంలో తెదేపా నేతలు సమ్మద్‌ఖాన్, బాలప్ప, శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.