S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:58

తిరుపతి, జూలై 21: నగర పాలక సంస్థ పరిధిలోని 37,39 వార్డులలో తాగునీటి పైప్‌లైన్‌ను, యుడిఎస్ లైను, శ్మశానవాటికలో కర్మక్రియల భవననిర్మాణం అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. సుమారు రూ.26 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు బి.

07/22/2016 - 06:58

చిత్తూరు, జూలై 21: ప్రజాసాధికారత సర్వేని అంకితభావంతో నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సర్వేపై జిల్లా అధికార యంత్రాగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వేవల్ల ప్రజల్లో అనేక అపోహలు ఉన్నట్లు సమాచారం వస్తున్నదని, ఈఅపోహలు తొలగించాలని అన్నారు.

07/22/2016 - 06:56

నందలూరు, జూలై 21:నందలూరు సౌమ్యనాథాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మోత్సవాలు ముగిశాయనేందుకు చిహ్నంగా ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ఉభయదారులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకీపై కూర్చుండబెట్టి భక్తులు పాల్గొనగా వసంతోత్సవానికి బయలుదేరారు.

07/22/2016 - 06:55

కడప, జూలై 21:తెలుగుదేశంపార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) జిల్లా వ్యాప్తంగా పార్టీ కేడర్‌ను పటిష్టం చేసేందుకు సమన్వయ కమిటీలను సమన్వయ పరుస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలకు ఉన్న త్వరలో వాటిని విభేధించి పార్టీ బలోపేతం దిశగా చర్యలు చేపట్టారు.

07/22/2016 - 06:55

కడప, జూలై 21:ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను జప్తుచేసేందుకు ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్దం కావ డం, ఇప్పటికే డిజిపి డా.కాంతారావు ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తులను ప్రాథమికంగా గుర్తించడంతో స్మగ్లర్ల గుండె ల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

07/22/2016 - 06:54

రాజంపేట, జూలై 21: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలను తనకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాజీ కేంద్రమంత్రి ఎ.సాయిప్రతాప్ అన్నా రు.

07/22/2016 - 06:54

రాయచోటి, జూలై 21:ప్రపంచం జీవకోటికి మొక్కలే ప్రాణాధారం అని రాయచోటి నియోజకవర్గం ఇన్‌చార్జి రమేష్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మాసాపేటలోని పాలటెక్నిక్ కళాశాలలో టిడిపి మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్‌రాజు, జిల్లా కార్యదర్శి ముస్తాక్‌ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

07/22/2016 - 06:53

పెండ్లిమర్రి, జూలై 21:రైతులు చామంతి పూలు సాగుచేసే సమయంలో అధికారుల సూచనల మేర కు యాజమాన్య పద్ధతుల ద్వారా సాగుచేయాలని అప్పుడే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చునని ఏపిఎంఐ పిడి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎంపిడిఓ సభాభవనం కార్యాలయం ఆవరణంలో చామంతి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు.

07/22/2016 - 06:53

గాలివీడు, జూలై 21:రాయలసీమ జిల్లాలోని ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

07/22/2016 - 06:52

రాయచోటి, జూలై 21:కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమం ఉద్ధృతం చేస్తామని, ఫ్యాక్టరీని సాధించే వరకు ఉద్యమం ఆగదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్మద్ది ఈశ్వరయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాలలో ఏఐవైఎఫ్ ఏరియా నాయకుడు వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

Pages