S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 07:25

సీలేరు, జూలై 21: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయంలోని నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల అధికారులు గురువారం బలిమెలలో సమావేశమై నీటి వాడకంపై లెక్కలు కట్టారు. దీని ప్రకారం బలిమెల జలాశయంలో ప్రస్తుతం 54 టిఎంసిలు నీటి నిల్వలున్నట్లు లెక్కలు తేల్చారు.

07/22/2016 - 07:25

గూడెంకొత్తవీధి, జూలై 21: అమరులైన మావోయిస్టుల త్యాగాలు వృథాగా పోవని ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంత మావోయిస్టు నాయకులు పేర్కొన్నారు. ఎ. ఓ.బి. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 40 అడుగుల భారీ స్థూపాన్ని అవిష్కరించారు. అమరులైన మావోయిస్టు నేతలైన రవి, ఆజాద్, శరత్, ఆనంద్, గణపతి, కమలల జ్ఞాపకార్ధం భారీ స్మారక స్థూపాన్ని నిర్మించారు.

07/22/2016 - 07:24

అచ్యుతాపురం, జూలై 21: ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా అచ్యుతాపురం వస్తున్న నారా చంద్రబాబునాయుడుకు అఖండ ఘన స్వాగతం పలకాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పిలుపునిచ్చారు.

07/22/2016 - 07:24

జగదాంబ, జూలై 21: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ మోడలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఏయూ ఫార్మశీ కళాశాలలో ‘ప్రిన్సిపాల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ మాలిక్యులర్ మోడలింగ్ ఇన్ టీచింగ్ అండ్ రీసెర్చ్’ జాతీయ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు.

07/22/2016 - 07:23

నర్సీపట్నం,జూలై 21: గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. గురువారం మండలంలోని ధర్మసాగరం గ్రామంలో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్ళి పార్టీ ఇచ్చిన 100 ప్రశ్నల కరపత్రాలను పంచిపెట్టారు.

07/22/2016 - 07:21

శ్రీకాకుళం(రూరల్), జూలై 21: నెరవేరని హామీలతో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకొన్న చంద్రబాబు ప్రజలను అవస్తలు పాలు చేసేలా పాలన సాగిస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రిధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. గురువారం రూరల్ మండలంలోని బట్టేరులో గడపగడపకు వైసిపి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతితో కలిసి ఆయన నిర్వహించారు.

07/22/2016 - 07:20

శ్రీకాకుళం: బ్రిటిష్ దొరల పాలన పోయింది...వారి వ్యూహాలు మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో సజీవంగా కన్పిస్తుంటాయి.. రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాల్లో బి.సి.లదే హవా.. పేరుకు బలహీనవర్గాలైనా వారి ఆధిపత్యమే సాగుతోంది. జిల్లా సామాజికవర్గంలో అత్యధికంగా ఉన్న సామాజికవర్గాలైన కళింగ, తూర్పుకాపు, పోలినాటి వెలమ కులాలకు చెందిన వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతూ వస్తున్నారు.

07/22/2016 - 07:19

శ్రీకాకుళం, జూలై 21: ప్రతీ గ్రామంలోనూ మత్స్య సంపద పెంపొందేలా మత్స్యశాఖ, పంచాయతీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో మత్స్య అభివృద్ధిపై సమీక్షించారు. గ్రామాల్లో ఓ పదిమంది కలిసి మత్స్యకారుల సంఘాన్ని ఏర్పరచుకొని ఆ గ్రామంలోని చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టాలన్నారు.

07/22/2016 - 07:15

నెల్లూరు, జూలై 21: ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన పన్నుల భారం ఇక నుంచి పల్లెవాసుల నెత్తిన పడనుంది. పన్నుల వడ్డింపుపై పంచాయతీరాజ్ శాఖ నూతన విధి విధానాలను రూపొందించింది. పన్ను మదింపునకు గతంలో ఉన్న విధి విధానాలను పక్కనపెట్టి భవన పరిమాణం, దాని స్వరూపంతోపాటు స్థల మూలధనం, విలువను పరిగణనలోకి తీసుకొని పన్ను నిర్థారించనున్నారు. మదింపు ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15లోగా పూర్తిచేయాల్సి ఉంది.

07/22/2016 - 07:12

కర్నూలు, జూలై 21 : జిల్లా పేరును మార్పు చేస్తూ దామోదరం సంజీవయ్య జిల్లాగా నూతనంగా నామకరణం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిసిఎల్‌ఎ నుంచి కలెక్టరేట్‌కు ఆదేశాలు అందాయి. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు జిల్లా పేరు మార్పు కోసం ప్రజల విన్నపాన్ని పరిశీలిస్తోం ది.

Pages