S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:45

చెనే్నకొత్తపల్లి, జూలై 21: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చెనే్నకొత్తపల్లి సమీపాన హంద్రీనీవా కాలువ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామగిరి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మస్తాన్‌వలి(32) గ్రామంలో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

07/22/2016 - 06:45

పామిడి, జూలై 21: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు ఉప్పర సూర్యనారాయణ (50) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం మండల పరిధిలోని దేవరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి గ్రామస్థులు అందించిన వివరాలిలా వున్నాయి..

07/22/2016 - 06:44

హిందూపురం, జూలై 21 : 2004లో స్థానిక ప్రభుత్వాసుపత్రిపై దాడి చేసిన కేసును కొట్టివేస్తూ జూనియర్ సివిల్ జడ్జి షేక్ జానీబాషా గురువారం తీర్పు చెప్పారు. దీంతో దశాబ్దం తర్వాత కేసులో ఉన్న ముద్దాయిలకు విముక్తి కలిగినట్లైంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

07/22/2016 - 06:42

కరీంనగర్, జూలై 21: రెండేళ్లుగా వరుస కరువుతో అల్లాడిపోతున్న జిల్లా రైతాంగం ఈ ఖరీఫ్‌పైనే గంపెడాశలు పెట్టుకోగా, వారి ఆశలు ఆదిలోనే ఎండిపోతున్నాయి. సరైన వర్షాలు లేక జిల్లాలో సాగు సగానికంటే తక్కువకే పరిమితమైంది. జూన్‌లో వర్షాలు లేకపోయినా.. జూలై మొదటి వారంలో కురిసిన వర్షాలు కొంత ఊరటనివ్వగా, రైతుల్లో గంపెడాశలు చిగురించాయి.

07/22/2016 - 06:42

కరీంనగర్, జూలై 21: ఏ పనైనా సరే చేతులు తడపాల్సిందే..చేతులు తడపకుంటే ఏ పని జరగదు. నెలల తరబడి కార్యాలయం చుట్టు తిప్పించుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి చివరకు ఎసిబి అధికారులకు చిక్కి కటకటాలపాలయ్యారు.

07/22/2016 - 06:41

ముకరంపుర (కరీంనగర్), జూలై 21: మార్కెట్లో కందిపప్పు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన కందిపప్పు కేంద్రాలను కందిపప్పు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన ప్రజలకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌లో మేయర్‌తో కలిసి కందిపప్పు కేంద్రాన్ని ప్రారంభించారు.

07/22/2016 - 06:41

వేములవాడ, జూలై 21: వారిద్దరూ అన్నదమ్ములు.. కష్టాలతో జీవనం సాగిస్తున్నారు. రెక్కడితే కానీ డొక్కాడని దీనస్థితి.. దినసరి కూలీ వేతనం పై వచ్చే డబ్బులతోనే ఆ కుటుంబాలు పూటవెళ్లదీస్తాస్తున్నాయి.. అయితే విధి ఈ నిరుపేదల కుటుంబాలపై కనె్నర్రజేసింది.. కూలీ పనికి బయలుదేరిన అన్న మార్గమధ్యలో ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు.

07/22/2016 - 06:40

కరీంనగర్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాలలో లక్ష్యాలకనుగుణంగా అధిగమించాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపిడిఓలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు.

07/22/2016 - 06:39

గంగాధర, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని ఎస్పీ డి.జోయల్ డేవిస్ అన్నారు. గురువారం మండలంలోని బొమ్మలమ్మగుట్ట వద్ద ఎస్‌ఐ నీలం రవి ఆధ్వర్యంలో హరితహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎస్పీ జోయల్ డేవిస్‌తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

07/22/2016 - 06:39

పెద్దపల్లి రూరల్, జూలై 21: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంతో పచ్చని తెలంగాణ సాధించుకుందామని రాష్ట్ర రవాణ శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ఎస్సారెస్పీ క్యాంపులో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి గురువారం ఆయన మొక్కలు నాటారు.

Pages