S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/22/2016 - 06:52

ప్రొద్దుటూరు, జూలై 21: రాష్ట్రంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాము అ న్నివిధాలా కృషి చేస్తున్నామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప పార్లమెంటరీ వ్యవహారాలా అబ్జర్వర్ జ యనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

07/22/2016 - 06:50

అనంతపురం సిటీ, జూలై 21: జిల్లా కేంద్రంలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో ఆధిపత్య పోరుకై గురువారం అన్నదమ్ముల జంట హత్యలు జరిగాయి. గురువారం రుద్రంపేట బైపాస్ దాటుకుని చంద్రబాబునాయుడు కొట్టాల వైపుకు వెళ్తున్న గోపినాయక్ (30), వెంకటేసు(31)లను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, ఐరన్ రాడ్లతో కొట్టి హత్య చేశారు.

07/22/2016 - 06:49

అనంతపురం, జూలై 21 : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజీవ్ యువశక్తి పేరుతో ఉన్న పథకాన్ని అంతకు ముందు ఉన్నట్టుగానే సిఎంఇవై (చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ యోజన)గా మార్చింది. పేరైతే మార్చిందిగానీ స్వయం ఉపాధి పథకాలూగానీ.. నిధుల కేటాయింపుగానీ లేకుండా పోయింది.

07/22/2016 - 06:49

అనంతపురం, జూలై 21 : జిల్లాలో నేరాలు అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌వి.ఎస్పీ రాజశేఖర్‌బాబు తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల పాలనలో జిల్లాను ప్రశాంతంగా ఉంచడంతో పాటు, అన్ని వర్గాలను సమన్వయ పర్చుకుని పోలీసు శాఖను ప్రగతి పథంలో నడిపించి విజయం సాధించారనడంలో సందేహం లేదు.

07/22/2016 - 06:48

గుంతకల్లు, జూలై 21 : గుంతకల్లులో పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు హరిహరనాథ్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్న కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీ బుగ్గ సంఘాల వద్ద పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.

07/22/2016 - 06:48

అనంతపురం సిటీ, జూలై 21: ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తూ సకలాంగులకు దీటుగా వికలాంగులు రాణిస్తున్నారని రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత అన్నారు. రాప్తాడు సమీపంలోని టిటిడిసిలో సమర్థనా ట్రస్టు ఆధ్వర్యంలో అంధులకు కంప్యూటర్ విద్యలో శిక్షణా తరగతులను మంత్రులు ప్రారంభించారు.

07/22/2016 - 06:47

ధర్మవరం రూరల్, జూలై 21: పట్టణంలో గురుపౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా గురువారం షిరిడీ సాయినాథుని గ్రామోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన జానపద కళాకారులు నిర్వహించిన అష్టలక్ష్మిల నాట్యం అందరినీ ఆకట్టుకుంది. గురువారం షిరిడీ సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేకంగా అలంకరింపబడిన వాహనంలో సాయినాథుడు కొలువుదీరి పట్టణ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

07/22/2016 - 06:47

అనంతపురంటౌన్, జూలై 21: ఎ.పికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరుతూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి ప్రారంభమై జెడ్.పి కార్యాలయం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించారు.

07/22/2016 - 06:46

గోరంట్ల, జూలై 21 : పట్టణంలోని శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యార్థిని తన్మయి సాయి బండ విరిగిపడి మృతి చెందిన ఘటనపై ప్రజా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా గురువారం స్థానిక ఎస్‌విఆర్ కళాశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకూ ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ చేసి కదిరి-హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

07/22/2016 - 06:46

బళ్లారి, జూలై 21 : తుంగభద్ర జలాశయం నుంచి గురువారం మధ్యాహ్నం ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నేడు హెచ్చెల్సీకి నీరు విడుదల చేస్తామన్నారు. ఎల్లెల్సీకి సంబంధించి గంటగంటకూ 100 క్యూసెక్కులు పెంచుతూ గరిష్టంగా 1300 క్యూసెక్కులు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గురువారం జలాశయంలో 1612.41 అడుగులు, 40072 టిఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.

Pages