S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 00:47

హైదరాబాద్, జూలై 4: సంజీవ్‌రెడ్డినగర్ డివిజన్-6 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జలమండలి ఎండి ఎం.దానకిషోర్ తనిఖీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, కమలాపురి కాలనీ, వెంకటగిరి కాలనీలో సోమవారం ఎండి పర్యటించి నీటి సరఫరా, డ్రైనేజీ వంటి ఇతర సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

07/05/2016 - 00:46

హైదరాబాద్, జూలై 4: మహానగరాన్ని మరింత ఆహ్లాదకరంగా, పచ్చదనంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ రెండు మొక్కలను నాటాలని కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంపై ఆయన సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు, జెఎన్‌టియు, సెంట్రల్ వర్శిటీల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

07/05/2016 - 00:46

ఉప్పల్, జూలై 4: మూసీ ప్రక్షాళన, అభివృద్ధి కోసం స్వాధీనం చేసుకున్న భూములలో తమ వాటా కింద వచ్చే ప్లాట్లను కేటాయించడంలో ప్రభుత్వ నిర్లక్షవైఖిరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది.

07/05/2016 - 00:45

హైదరాబాద్, జూలై 4: మహానగర పాలక సంస్థ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తున్నారు. అంతేగాక, ఒకవైపు అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు వరుసగా దాడులు చేయటం, ఆపై కమిషనర్ ఎంతో పక్కా వ్యూహం, రహస్య నిఘాతో విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి సస్పెన్షన్ వేటు వేయటంతో జిహెచ్‌ఎంసి సిబ్బందిలో హడల్ నెలకొంది.

07/05/2016 - 00:44

హైదరాబాద్, జూలై 4: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) ప్రాజెక్టుకు సంబంధించి తొలి అడుగు పడాల్సిన కెబిఆర్ పార్కు చుట్టూ స్థల సేకరణ వివాదాస్పదంగా మారుతోంది.

07/05/2016 - 00:43

శంషాబాద్, జూన్ 4: తనతో గొడవ పెట్టుకున్నదని కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడో ఘనుడు. చనిపోయిన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి.. ఒక సూట్‌కేస్‌లో పెట్టుకుని, కన్నకూతుర్ని వెంటబెట్టుకుని శంషాబాద్ శివార్లలోకి తీసుకువచ్చి దహనం చేసేశాడా మొగుడు. నగరు శివారులోని శంషాబాద్ మండలం, మదన్‌పల్లి గ్రామం పక్కన ఉన్న గ్రీన్ సిటీ వెంచర్‌లో కన్నకూతురు సాక్షిగా తన భార్య శవాన్ని తగలబెట్టిన ఘటన కలకలం రేపింది.

07/05/2016 - 00:03

విజయనగరం(టౌన్), జూలై 4: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ అతిథి గృహంలో వ్యవసాయం, ఉద్యానశాఖ, నీటిపారుదల శాఖ, తాగునీరు, నీరు-చెట్టు, ఉపా ధి పనులపై మంత్రి అధికారులతో సమీక్షించారు.

07/05/2016 - 00:02

విజయనగరం(టౌన్), జూలై 4: మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి జిల్లా ఇన్‌చార్జ్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ఐఎంఎ హాలులో ముస్లింలకు రంజాన్ పండుగ తోఫా సరకులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ రంజాన్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తున్నదని చెప్పారు.

07/05/2016 - 00:02

బొబ్బిలి, జూలై 4: పట్టణ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని, అందుకు పాలకులు, ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ టి.అచ్యుతవల్లి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పట్టణంలో ఉన్న 30 వార్డుల్లో ఎటువంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

07/05/2016 - 00:01

విజయనగరం(టౌన్), జూలై 4: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని జిల్లా యంత్రాంగం సోమవారం ఆనందగజపతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించింది. జిల్లా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన జయంతి వేడుకలను జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు.

Pages