S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:38

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2013 నూతన వేతన సవరణ ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి బకాయిలను తక్షణమే చెల్లించాలని టిఎన్‌యుఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిరిశాల వెంకట్రామయ్య డిమాండ్ చేశారు.

07/03/2016 - 23:37

వైరా, జూలై 3: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం అందరి బాధ్యత అని వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అన్నారు. ఆదివారం స్థానిక తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. అటువంటప్పుడు తప్పనిసరిగా మొక్కలు అందరి బాధ్యతగా అందరి బాధ్యతన్నారు.

07/03/2016 - 23:37

ఖమ్మం(కల్చరల్), జూలై 3: ఎన్ని కష్టాలొచ్చినా, ఆకలితో కడుపులు మాడినా పేదోడి సమస్యలపై గళం విప్పడమే ప్రజానాట్యమండలి లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక మంచికంటి భవన్‌లో ఆదివారం ప్రజానాట్యమండలి జిల్లా 10వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

07/03/2016 - 23:36

ఖమ్మం(క్రైం), జూలై 3: గత నెల 27న ప్రారంభమైనా ఎస్‌ఐ దేహదారుఢ్య పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఈ పరీక్షలకు 8157మంది అభ్యర్థులు రాత పరీక్ష ద్వారా ఎంపిక కాగా వీరిలో 7219మంది పురుషులు, 938మంది మహిళలు ఉన్నారు.

07/03/2016 - 23:35

గుంటూరు, జూలై 3: జన్మభూమి నగర్ పంటకుంటలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు భరోసా ఇచ్చారు. ఆదివారం మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 62,500 రూపాయల చొప్పున 2,50,000 రూపాయల వ్యక్తిగత ఆర్థికసాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కూడా తగిన ఆర్థిక చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు.

07/03/2016 - 23:34

గుంటూరు, జూలై 3: కాదేదీ కబ్జాకు అనర్హం అనే చందంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు భూ దందాకు తెరలేపుతున్నారు. ప్రభుత్వ అసైన్డు, పోరంబోకు భూములు ఇప్పటికే దాదాపు కుటుంబ సభ్యులు.. తమ పేరిట రెగ్యులరైజ్ చేసుకున్న నాయకులు లేకపోలేదు. అధికార పార్టీ నేతలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా పార్టీ కార్యాలయాలకు నిషేధిత భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.

07/03/2016 - 23:34

గుంటూరు (క్రైం), జూలై 3: నగరానికి చెందిన ఓ ఎలక్ట్రికల్ వ్యాపారస్థుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానిక మంగళగిరి రోడ్డులోని నవభారత్ కాలనీ 1వ లైనుకు చెందిన సాంబశివరావు (70) జిన్నాటవర్‌లోని ఎలక్ట్రికల్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తుంటాడు. మొదటి భార్య చనిపోయి పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు.

07/03/2016 - 23:34

మంగళగిరి, జూలై 3: గడిచిన రెండేళ్లల్లో మంగళగిరి పట్టణంలో 6 కోట్ల రూపాయలు వెచ్చించి సిమెంటురోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైపులైన్లు నిర్మించామని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీ వి వెల్లడించారు. మున్సిపల్ పాలకవ ర్గం ఏర్పడి ఆదివారానికి రెండేళ్లు పూ రె్తైన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అఖిలపక్ష కౌన్సిలర్లతో కలిసి సమావేశమయ్యారు. కౌన్సిల్ హాలు లో ఏర్పాటుచేసిన కేక్‌ను కట్‌చేశారు.

07/03/2016 - 23:33

వినుకొండ, జూలై 3: స్థానిక మసీదుమాన్యంలో ఆదివారం జరుగుమల్లి ప్రకాశమ్మ (40) అనే అత్తను అల్లుడు మనీష్ అబ్దుల్ లతీఫ్ షేఠ్ రోకలి బండలో తలపై బలంగా మోదడంతో ఆమె అక్కడి కక్కడే మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన మృతురాలు ప్రకాశమ్మ భర్త చనిపోగా రెండేళ్ళ నుండి స్ధానిక మసీదు మాన్యంలో కాపురం ఉంటూ కూరగాయలు అమ్ముకుంటుంది. ఈమెకు కుమారులు, కుమార్తె ఉన్నారు.

07/03/2016 - 23:33

పొన్నూరు, జూలై 3: రాష్ట్ర రాజధాని వెలగపూడికి పొన్నూరు డిపో నుండి ప్రతిరోజూ రెండు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రమేష్‌బాబు, ఎస్‌టిఐ శ్రీనివాసరావు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. రాష్ట్ర రాజధాని సందర్శనార్ధం వెళ్లే ప్రయాణికుల కోసం, ఉద్యోగుల ప్రయాణార్ధం ఈ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Pages