S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 04:50

ఇంద్రకీలాద్రి, జూలై 2: దుర్గగుడి ఇవోగా ఐఎయస్ అధికారిణిని ఎ సూర్యకుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం జివోను విడుదల చేసింది. దశాబ్ధలుగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి ఐఎయస్ అధికారిని నియమించి మరింతగా అభివృద్ధి చేయాలని వివిధ రాజకీయపార్టీలు, పలు సంస్ధలు డిమాండ్ చేశాయి. ఈఅంశాన్ని పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ఎటువంటి స్పందనలేదు.

07/03/2016 - 04:49

కాల్గరీ (కెనడా), జూలై 2: భారత యువ ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరుగుతున్న కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌కే చెందిన హర్షీల్ డానీని 21-18, 19-21, 21-8 తేడాతో ఓడించాడు. కాగా, నాలుగో సీడ్ సాయి ప్రణీత్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

07/03/2016 - 04:46

ఇబ్రహీంపట్నం, జూలై 2: జిల్లాను తమ ఇష్టానుసారంగా విభజిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేష్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని డాగ్‌బంగ్లా అతిథిగృహంలో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకొని విభజన చేపట్టాలే తప్ప తమ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడం దుర్మార్గమన్నారు.

07/03/2016 - 04:45

ఉప్పల్, జూలై 2: ఉప్పల్ భాగాయత్ భూనిర్వాసితుల సమస్యపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. స్వాధీనం చేసుకున్న భూములలో తమ వాటా కింద అభివృద్థి చేసిన హెచ్‌ఎండిఏ లేవుట్‌లో ప్లాట్లను సకాలంలో కేటాయించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని రైతు సంఘం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఒకవైపు రైతు సంఘం, మరొక వైపు రైతు జెఏసి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమానికి సిద్ధమవుతుతోంది.

07/03/2016 - 04:45

న్యూఢిల్లీ, జూలై 2: మాటకు మాట అనడమే స్లెడ్జింగ్‌కు తన సమాధానమని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. తనను హేళన చేసిన వారిని ఎవరినీ ఉపేక్షించనని అంటూ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డారెన్ లీమన్‌ను ఒకసారి ‘నువ్వు గర్భిణివా’ అని అడిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. త్వరలోనే ప్రసారం కానున్న ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న భజ్జీ స్లెడ్జింగ్‌పై పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

07/03/2016 - 04:44

ఉప్పల్, జూలై 2: రామంతాపూర్ టివికాలనీలోని రహస్య ప్రదేశంలో అనుమతి లేకుండా నకిలీ మందులను తయారు చేస్తున్న స్థావరాలపై సైబరాబాద్ స్పెషల్ పోలీసు టీం (ఎస్‌ఓటి) బృందం శనివారం సాయంత్రం ఆకస్మిక దాడిచేసి బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ.10లక్షల విలువైన పేరున్న కంపెనీల నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు.

07/03/2016 - 04:42

హైదరాబాద్, జూలై 2: మహానగర పాలక సంస్థలో ప్రస్తుతం కిస్సా కుర్సీకా జరుగుతోంది. ఒకవైపు ప్రస్తుతం పెరిగుతున్న జనాభా, రద్ధీకి అనుకూలంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా తగిన సంఖ్యలో ఇంజనీర్లు లేక పనుల్లో వెనకబడి పోతున్న జిహెచ్‌ఎంసికి కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం 160 మంది ఇంజనీర్లను కేటాయించింది.

07/03/2016 - 04:42

జైపూర్, జూలై 2: ప్రో కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్, పునేరీ పల్టన్ జట్లు విజయాలను నమో దు చేశాయ. బెంగళూరు బుల్స్‌తో తలపడిన ఢిల్లీ 32-24 తేడాతో గెలి చింది. మిరాజ్ షేక్ ఎనిమిది పాయంట్లు చేశాడు. సచిన్ షిగాడే ఏడు పాయంట్లతో రాణించాడు. బెంగళూరు తరఫున రోహిత్ కుమార్ ఎని మిది పాయంట్లతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మోహిత్ చిల్లార్ ఏడు పాయంట్లు సాధించాడు.

07/03/2016 - 04:41

పోర్ట్ ఆఫ్ స్పెయిన్, జూలై 2: షహీం ఆమ్లా, డ్వెయిన్ బ్రేవో టి-20 ఫార్మెట్‌లో ఐదో వికెట్‌కు కొత్త రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడాస్ ట్రైడెంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన వీరు ఐదో వికెట్‌కు 92 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆమ్లా 54 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేయగా, బ్రేవో అజేయంగా 66 పరుగులు సాధించాడు.

07/03/2016 - 04:40

హైదరాబాద్, జూలై 2: పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చెల్లించి, వైద్యం అందని పేదలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను

Pages