S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 04:58

గుంటూరు, జూలై 2: జిల్లాలో వైరల్ జ్వరాలు వణుకు పుట్టిస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలో పలు తండాలతో పాటు కృష్ణా నది పరివాహక తీర ప్రాంత గ్రామాల్లో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. గుంటూరు, బాపట్లలో డెంగీ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇంటింటా సర్వే నిర్వహించాల్సిన మలేరియా విభాగం పత్తా లేకపోవడంతో ప్రైవేటు వైద్యులు వైరల్ ఫీవర్ బాధితుల నుంచి పెద్ద మొత్తంలో ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నారు.

07/03/2016 - 04:56

కింగ్‌స్టన్, జూలై 2: జమైకా స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్‌ను ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కాలి కండరాలు బెణకడంతో అతను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగా మారింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బోల్ట్ జమైకా నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జరుగుతున్న ట్రయల్స్‌లో పాల్గొన్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ ఫైనల్ చేరాడు.

07/03/2016 - 04:55

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 2: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నీరు-చెట్టు కింద ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

07/03/2016 - 04:54

బెంగళూరు, జూలై 2: భారత క్రికెటర్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే భారత జట్టు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు. తాను స్వయంగా నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ, యువ బౌలర్లకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నాడు.

07/03/2016 - 04:53

పాతబస్తీ, జూలై 2: రాష్ట్రంలోనే గాకుండా దేశంలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన ఓ సొసైటీపై ఉన్న నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి ఇంజనాయిల్ కౌంటరుని దొంగనోట్ల మార్పిడికి వేదికగా మార్చుకున్నాడు. ఎంతకాలం నుండి ఈ చీకటి వ్యాపారం సాగిస్తున్నాడో గాని గత నాలుగు రోజుల క్రితం సొసైటీ డైరెక్టర్లు కొందరు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఈ బండారం బయటపడింది.

07/03/2016 - 04:52

బెంజిసర్కిల్, జూలై 2: షెడ్యూలు కులాలు, తెగల కోసం ఏర్పాటు చేసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

07/03/2016 - 04:52

లండన్, జూలై 2: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సిం గిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకో విచ్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. శామ్ క్వెర్రీతో తలపడిన జొకోవిచ్ మొదటి రెండు సెట్లను 6-7, 1-6 తేడాతో చేజార్చుకున్నాడు. అదే సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత తిరిగి ఆ మ్యాచ్‌ని కొనసాగించగా, మూడో సెట్‌ను జొకోవిచ్ 6-3 తేడాతో గెల్చుకున్నాడు.

07/03/2016 - 04:51

విజయవాడ (కార్పొరేషన్), జూలై 2: నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని బిజెపి నగరాధ్యక్షులు దాసం ఉమామహేశ్వర రాజు పేర్కొన్నారు.

07/03/2016 - 04:51

లిల్లే, జూలై 2: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో వేల్స్ జట్టు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అనామక జట్టుగా బరిలోకి దిగిన వేల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంపై 3-1 తేడాతో విజయం సాధించి, తొలిసారి ఒక మేజర్ టోర్నీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

07/03/2016 - 04:50

విజయవాడ (కార్పొరేషేన్), జూలై 2: అప్పుల భారాలతో కనీసం సిబ్బంది జీతాలనైనా విడుదల చేసుకోలేని దుస్థితి నుంచి విజయవాడ నగరపాలక సంస్థను గట్టెక్కించడమే కాకుండా నగర ప్రజలపై పన్నుభారాలు మోపకుండా విఎంసి ఆదాయాన్ని గణనీయంగా పెంచి ఆర్థిక వృద్ధి సాధించినట్టు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు.

Pages