S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 05:18

దామరచర్ల, జూలై 2: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామంలో కృష్ణానది సమీపంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం... కృష్ణా పుష్కరాల పనులలో భాగంగా కృష్ణానది సమీపంలో వరదలో ముంపునకు గురైన వీరభద్రుని ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తవ్వకాలు జరుపుతుండగా మూడు దేవతామూర్తుల విగ్రహాలు లభ్యమయ్యాయి.

07/03/2016 - 05:17

కుమార్ అంటే సినిమా పిచ్చోడని ఆ వూళ్లో అందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి కుమార్‌కు సినిమాలంటే తగని పిచ్చి. ఊళ్లోకి పబ్లిసిటీ రిక్షా వచ్చిందంటే కుమార్ దాని వెంబడే వుండేవాడు. హీరోల ఫోటోలు చూస్తూ తన్ను తాను ఆ హీరోగా ఊహించుకునేవాడు. ఆ సినిమా పిచ్చి ఇంతింతై వటుడింతయై అన్నట్లు కుమార్‌తో పాటే పెరిగి పెద్దదైంది. సినిమాల్లో చేరాలన్న ఆలోచన అంతకంతకు ఎక్కువైంది.

07/03/2016 - 05:15

కోరుట్ల, జూలై 2: కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలోని మద్దుల చెరువు కట్ట నిర్మాణం పనుల్లో శనివారం చెరువు కట్ట కింద జరుగుతున్న తవ్వకాల్లో శ్రీరాముని విగ్రహం బయల్పడింది. దేవుడి విగ్రహం బయట పడడంతో చెరువు తవ్వకం చేపట్టిన నిర్వాహకులు వెంటనే పనులను నిలిపివేసారు. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో ప్రజలు తండోప తండాలు తరలి వచ్చి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసారు.

07/03/2016 - 05:09

మిర్యాలగూడ టౌన్, జూలై 2: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రాంచంద్రగూడెం నార్కట్‌పల్లి-అద్దంకి బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌పై 6.33 లక్షల రూపాయల బ్యాగుతో వెళ్తున్న పెట్రోల్ బంకు యజమానిపై ముసుగుదొంగలు దాడి చేసి డబ్బుబ్యాగుతో పరారయ్యారు.

07/03/2016 - 05:09

హైదరాబాద్, జూలై 2 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు దశలవారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమక్షంలో శనివారం ప్రైవేటు ఆసుపత్రుల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.

07/03/2016 - 05:08

హైదరాబాద్, జులై 2: రాష్ట్రంలో, ప్రత్యేకించి హైదరా బాద్‌లో ఉగ్రవాదులు తిష్ట వేయడానికి మజ్లిస్ పార్టీయే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ విమర్శించారు.

07/03/2016 - 05:02

గుంటూరు, జూలై 2: మొక్కలు నాటండి... చెట్లను పెంచండి.. అవి మానవాళిని రక్షిస్తాయి.. ఇవి తరచూ ముఖ్యమంత్రి నుండి గల్లీలోని చోటా, మోటా నాయకుల వరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి బిళ్ల బంట్రోతు వరకు చెప్పే మాటలు. అయితే ఎక్కడ ఏ ప్రాంతంలో మొక్కలు పెంచుతున్నారో, చెట్లను సంరక్షిస్తున్నారో తెలియదు గానీ గుంటూరు నగరంలో మాత్రం అడ్డంగా నరికేస్తున్నారు.

07/03/2016 - 05:01

గుంటూరు, జూలై 2: అప్పటివరకు ఆనందంగా గడిపిన విద్యార్థులు ఒక్కసారిగా విగత జీవులుగా మారారు. శనివారం ఒంటిపూట బడికి వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులు ఆటలాడుతూ ఈత కొట్టేందుకు బయల్దేరారు. అయితే మృత్యుకుహరంగా మారిన పంటకాల్వ ఆ విద్యార్థులను బలి తీసుకుంది. ఈ దుర్ఘటనతో జన్మభూమి నగర్ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

07/03/2016 - 05:00

గుంటూరు, జూలై 2: జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు నిఘా తీవ్రతరం చేసినా అధికారుల కళ్లుగప్పి కొరియర్ వ్యవస్థ ద్వారా నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్నారు. శనివారం రాత్రి అధికారులకు అందిన సమాచారం మేరకు ప్రొఫెషనల్ కొరియర్ కార్యాలయంలో దాడులు చేశారు.

07/03/2016 - 04:59

గుంటూరు, జూలై 2: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎపి నిరుద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట వేదిక ఆధ్వర్యంలో నిరుద్యోగ సంకల్ప నిరాహారదీక్షను నిర్వహించారు.

Pages