S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 04:55

పెనుకొండ, నవంబర్ 19 : న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులు, న్యాయవాదులు మూలస్తంభాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. శనివారం పట్టణంలో జరిగిన మున్సిఫ్ కోర్టు 144వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలంటే న్యాయమూర్తులు, న్యాయవాదులు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాద వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు.

11/21/2016 - 04:54

అనంతపురం అర్బన్, నవంబర్ 19:తుంగభద్ర ఎగువ కాలువ కింది ఆయకట్టుకు నీరు విడుదల కోసం శనివారం రైతులు, వైకాపా, వామపక్షాల నాయకులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హెచ్చెల్సీ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలు, తూములను రైతులే స్వచ్ఛందంగా ఎత్తివేయడానికి చర్యలు తీసుకోగా పోలీసులు అడ్డుకుని అరెస్టుచేశారు.

11/21/2016 - 04:53

తనకల్లు, నవంబర్ 19 : మండల పరిధిలోని డేగానువారిపల్లి ప్రాంతం లో శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులను గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తనకల్లు నుంచి డేగానువారిపల్లికి బాలాజినాయుడు(19), సురేష్‌నాయుడు(16), సోమశేఖర్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది.

11/21/2016 - 04:52

మచిలీపట్నం, నవంబర్ 20: కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని ఆదివారం మంగినపూడి బీచ్‌కు భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది సముద్ర స్నానాల కోసం మంగినపూడి తీరానికి చేరుకున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అన్ని వర్గాల ప్రజలు సకుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల రాకపోకలు సాగాయి. మంగినపూడి బీచ్ రోడ్డు ఖరీదైన వాహనాలతో రద్దీగా మారింది.

11/21/2016 - 04:51

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 20: పెద్దనోట్ల రద్దుతో ధాన్యం, మినుముల కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కూలీలకు డబ్బులిచ్చే విషయంలో తలలు పట్టుకుంటున్న రైతన్నలకు పుండుమీద కారంలా కొనుగోళ్లు కూడా మందగించటంతో వారి పరిస్థితి కుడితో పడ్డ ఎలుక చందాన తయారైంది.

11/21/2016 - 04:51

నూజివీడు, నవంబర్ 20: నాగార్జున సాగర్ జలాలు నూజివీడుకు చేరుకున్నాయి. నూజివీడు బ్రాంచ్ కాలువలో నీరు 26 కి.మీ.లు దాటి ఆదివారం మధ్యాహ్నానికి 15వ కిలోమీటరుకు చేరుకున్నాయ. నీటి సరఫరా తీరును రాష్ట్ర జల వనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ, సాగర్‌రు ఇఇ అర్జునరావు, డిఇఇ శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధుల బృందం పరిశీలించారు.

11/21/2016 - 04:50

కూచిపూడి, నవంబర్ 20: చిన్ననోట్లు అందుబాటులో లేకపోవటంతో మొవ్వ మండలంలో ఖరీఫ్ వరికోతలను రైతులు వాయిదా వేస్తుండటంతో వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఈ నెల 16న పౌర్ణమి వెళ్లిపోవటంతో ఆగస్టు, సెప్టెంబరులో సాగుచేసిన ఖరీఫ్ వరిపంట కోతలు ప్రారంభించారు.

11/21/2016 - 04:49

మైలవరం, నవంబర్ 20: డెంగ్యూ జ్వరాలతో ఏకంగా ఏడుగురు మరణించిన సంఘటన మర్చిపోకముందే మైలవరంలో మరో డెంగ్యూ కేసు నమోదైంది. డెంగ్యూ జ్వరంతో ఆదివారం మరో బాలుడు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు చేరటం కలకలం రేపింది. జమేదార్‌పేటకు చెందిన జంపాన రాజేష్ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స జరిపించినా తగ్గకపోవటంతో ఆదివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

11/21/2016 - 04:49

మైలవరం, నవంబర్ 20: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ (అప్సా) ఆధ్వర్యంలో మైలవరం డివిజన్ స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన క్రీడాపోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమం స్థానిక ఎస్‌ఎస్‌కె ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో ఆదివారం కోలాహలంగా జరిగింది.

11/21/2016 - 04:49

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 20: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఈడ్పుగంటి వెంకట్రామయ్య చేసిన సేవలు ప్రశంసనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వై కృష్ణారావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం సంస్థ కార్యాలయంలో వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈడ్పుగంటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేస్తూ ఇటీవల హఠాన్మరణం చెందడం బాధాకరమన్నారు.

Pages