S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 05:12

ఒంగోలు,నవంబర్ 20:జిల్లాకు మరో 1.5టిఎంసిల నాగార్జున సాగర్‌నీరు కావాలని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కోరనున్నట్లు రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఆదివారం రాత్రి స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నీటిని విడుదల చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు.

11/21/2016 - 05:10

నెల్లూరు, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దు చేసి రెండు వారాలవుతున్నా.. ప్రజల కరెన్సీ కష్టాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్ని ఉపశమన చర్యలు తీసుకుంటున్నప్పటికి చిల్లర కొరత సామాన్యుల్ని వేధిస్తూనే ఉంది. చిల్లర కొరత సమస్య ఆదివారం మరింత ఎక్కువైంది. ఆదివారం మాంసాహారం తినాలనే జిహ్వ చాపల్యం ఉన్న వారు కూడా నోరు కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

11/21/2016 - 05:08

కర్నూలు, నవంబర్ 20 : నగదు రహిత లావాదేవీల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొదటిదశలో డిసెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని చౌక దుకాణాల్లో ఎటిఎం(డెబిట్) కార్డుల ద్వారా సరుకుల అమ్మకాలు కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించింది. అలాగే అదే రోజు నుంచి రూ.

11/21/2016 - 05:06

ఖమ్మం, నవంబర్ 20: పెద్దనోట్ల రద్దు వెనక బిజెపి రాజకీయ లబ్ధి ఉన్నదని, నోట్ల రద్దుకు సంబంధించిన ప్రకటనకు ముందే బిజెపి నేతల ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ అయ్యాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలో ప్రారంభమైన సిపిఐ ఖమ్మం జిల్లా నిర్మాణ సభల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల ఏ ధనవంతుడు ఏడవటం లేదని, పేదలు మాత్రం నానా కష్టాలు పడుతున్నారన్నారు.

11/21/2016 - 05:04

సత్తెనపల్లి, నవంబర్ 20: సత్తెనపల్లి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవిధంగా జరుగుతున్నాయని పట్టణ కౌన్సిలర్లను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరాతీశారు. ఆదివారం స్థానిక స్పీకర్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పురోగతిపై కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతి రోజూ పర్యవేక్షించాలని కౌన్సిలర్లకు సూచించారు.

11/21/2016 - 05:02

శంఖవరం, నవంబర్ 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామిజీ ఆదివారం దర్శించుకున్నారు. స్వామిజీతోపాటు విజయేంద్ర సరస్వతి, శిష్య బృందం వెంట రాగా అన్నవరం దేవస్థానంపై ఇఓ కాకర్ల నాగేశ్వరరావు, ఛైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

11/21/2016 - 05:02

కాకినాడ, నవంబర్ 20: నల్లధనాన్ని మార్చుకునే ఎత్తుగడల్లో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాలకు గేలం వేసే పనిలో కొందరు అధికారులు తలమునకలు కావడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ముఖ్యంగా జిల్లాలోని మహిళా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే శాఖకు చెందిన కొందరు అధికారులు ఈ పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

11/21/2016 - 05:00

చిత్తూరు, నవంబర్ 20: జిల్లాలో పలు కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థల ఉప ఎన్నికల పర్వం ఊపందుకుంది. త్వరలో ఈ ఎన్నికలకు నోటికేషన్ జారీ కానున్న నేపథ్యంలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. జిల్లాలో పది ఎంపిటిసి స్థానాలతో పాటు 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గ్రామాల్లో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

11/21/2016 - 04:58

కడప, నవంబర్ 20: కరవుపీడిత జిల్లాలో కోనేటి గుంతలు, పంట కుంటలు సత్పలితాలు ఇచ్చి కొంతమేరకు రైతులకు ఊపిరినిచ్చింది. గతంలోకంటే ప్రస్తుతం కోనేటి గుంతలు, పంటకుంటలు ఏర్పాటుచేయడంతో వాటిద్వారా భూగర్భజలాలు పెరిగి వాటి కింద ఉన్న వేలాది గొట్టపుబావులకు నీటి మట్టం పెరిగి రైతులను కొంతమేరకు ఆదుకుంటున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 12వేల పంటకుంటలు, దాదాపు 2వేల కోనేటి గుంతలు తవ్వారు.

11/21/2016 - 04:57

కడప,నవంబర్ 20:గ్రామసీమలే అభివృద్ధికి పట్టుకొమ్మలు కాగా దాదాపు మూడేళ్లు క్రితం సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గానికి నిధులకొరతతో అభివృద్ధి ఆమడదూరంలో ఉందనేది జగమెరిగిన సత్యం.

Pages