S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2016 - 05:25

సబ్బవరం, నవంబర్ 20: కేంద్ర ప్రభు త్వం మంజూరు చేసిన ఎక్ట్స్రనల్ ఎయిడెడ్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో 5 వేల కోట్లరూపాయలతో తాగునీటి కొరతను తీర్చించేందుకు ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా ఉచితంగా నీటిని అందించేందుకు ముఖ్యమం త్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.

11/21/2016 - 05:24

సబ్బవరం, నవంబర్ 20: సబ్బవరం-అనకాపల్లిరోడ్డుపై ఆదివారం రాత్రి బైక్‌ను వేగంగా వస్తోన్న సఫారీ కారు అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయా లపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక ఎస్‌ఐ తోట మల్లేశ్వరరావు తెలిపిన వివరాలిలాఉన్నాయి.

11/21/2016 - 05:23

నర్సీపట్నం, నవంబర్ 20: విశాఖ ఏజన్సీలో చలి తీవ్రత అధికమైంది. గత కొద్ది రోజుల నుండి మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలోనే చలితీవ్రత పెరిగిపోవడంతో మన్యం వాసులు చలిపులితో వణుకుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండే చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది. ఆదివారం ఉదయం చింతపల్లిలో 8 డిగ్రీలు, పర్యాటక కేంద్రమైన లంబసింగిలో ఆరు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

11/21/2016 - 05:23

నక్కపల్లి, నవంబర్ 20: టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లాంటి మహానీయులు మనభూమిపై జన్మించడం మనందరి అదృష్టమని ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుచుకోవడం సదా శ్రేయస్కరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉద్ఘాటించారు.

11/21/2016 - 05:22

విశాఖపట్నం, నవంబర్ 20:అనేక రకాలైన సాంకేతిక సమస్యలతో నిలిచిపోయే విద్యుత్ సరఫరాను క్షణాల్లో మెరుగుపర్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆన్‌లైన్ ఫీడర్ మోనటరింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చేస్తోంది. దీనివల్ల విద్యుత్ అంతరాయాలు క్షేత్రస్థాయి అధికారులకు క్షణా ల్లో తెలిసిపోతుంది.

11/21/2016 - 05:21

విశాఖపట్నం, నవంబర్ 20: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసీ) అసలే అప్పుల్లో కూరుకుని ఆర్థికంగా పీకలోతు కష్టాల్లో ఉంది. సంస్థను ఆదుకునే చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చర్యలు చేపడుతుండగా, స్థానిక అధికారుల వైఖరి మాత్రం అందుకు భిన్నం గా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్యుపెన్సీ రేష్యో గణనీయం గా పడిపోయిన నేపథ్యంలో ఇతర మార్గాల ద్వారా ఆదాయానే్వషణకు ఆర్టీసీ యత్నిస్తోంది.

11/21/2016 - 05:20

విజయనగరం (టౌన్), నవంబర్ 20: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఎపిఎన్జీవో యూనియన్ చర్య లు తీసుకుంటుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. ఎపిఎన్జీవో జిల్లాశాఖ కౌన్సిల్ సమావేశాన్ని యూనియన్ కార్యాలయ ఆవరణలో ఆదివారం జిల్లా శాఖ అధ్యక్షుడు బిసిహెచ్ ప్రభూజీ అధ్యక్షతన జరిగింది. గత మూడేళ్లలో జిల్లాశాఖ నిర్వహించిన పోరాటాలను కార్యదర్శి ఆర్‌వి రమణమూర్తి కౌన్సిల్ సభ్యులకు నివేదించారు.

11/21/2016 - 05:18

ఏలూరు, నవంబర్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకుముందు హామీ ఇచ్చినవిధంగా ఈ మూడవ సోమవారం జిల్లాకు రానున్నారు. పోలవరం పనుల పరిశీలన, అధికారులతో సమీక్షను ప్రతి మూడవ సోమవారం క్షేత్రస్ధాయిలో చేస్తానని ఇంతకుముందు ప్రకటించిన విషయం తెల్సిందే. దానికితగ్గట్టుగానే సోమవారం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రానున్నారు. అయితే ఇంతకుముందు సోమవారాలతో పోలిస్తే ఈ సోమవారానికి మరింత విశిష్టత ఉందనే చెప్పాలి.

11/21/2016 - 05:15

శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజనలో కొంతమంది ఐఎఎస్‌లు తప్పిదాలు చేశారన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. జీవోఎంఎస్‌నెం570 ఎంఎ తేదీ 6.11.1996 ప్రకారం ఈ నెల 18వ తేదీన ఆర్‌సినెం.2330/2016తో ఫారం-1, రూల్-8 ప్రకారం 50 వార్డుల విభజనలో ఇక్కడ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో సర్దుబాట్లు చేశారన్న ఆరోపణలతో న్యాయస్థానంలో పిటిషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.

11/21/2016 - 05:14

సీతంపేట, నవంబర్ 20: సీతంపేట ఏజెన్సీలో మన్యం మండలాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం అన్నారు. ఆదివారం సీతంపేట ఏజెన్సీలో కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన జరిపారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో మిర్చిగూడ జలపాతం అందాలను అభివృద్ధి చేసేందుకు రూ.70 లక్షల నిధులతో జరుగుతున్న నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

Pages