S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 17:24

విజయవాడ: ప్రత్యేక హోదా కింద వచ్చే ప్రయోజనాలన్నింటిని కలిపి ఇస్తే- ప్యాకేజీని అంగీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, సాధారణంగా వచ్చే నిధుల మధ్య ఉన్న 30 శాతం నిధుల గ్యాప్‌ను పూడ్చాలని చంద్రబాబు షరతు పెట్టారు. కొద్దిసేపటి క్రితం సీఎంతో జైట్లీ, వెంకయ్య, సుజనా మాట్లాడారు.

09/01/2016 - 17:18

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుడు సోమన్నను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న శేషన్నకు సోమన్న కొరియర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

09/01/2016 - 16:35

విజయవాడ: విజయవాడ రాజరాజేశ్వరిపేట ఎర్రకట్ట దగ్గర ఆరేళ్ల బాలుడు శ్రీకాంత్‌ డ్రైనేజీలో మంగళవారం పడ్డాడు. తమ కుమారుడు డ్రైనేజీలో గల్లంతవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి ఆచూకీ కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

09/01/2016 - 16:01

హైదరాబాద్‌: గోదావరి జలాల ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్‌రావు గురువారం చెప్పారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారిందని, జనరేటర్లు, ఇన్వెర్టర్లకు గిరాకీ తగ్గిందన్నారు. నీటి ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలకు 10శాతం నీటిని కేటాయించనున్నట్లు తెలిపారు.

09/01/2016 - 15:56

హైదరాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని, జాతీయహోదా రాకుంటే 75వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతుందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌కు వచ్చిన ప్రధానిని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కేసీఆర్‌ ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.

09/01/2016 - 15:53

దిల్లీ: వరుసగా మూడో నెల- రాయితీ సిలిండర్‌పై రూ.2 వరకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తాజాగా ప్రకటించింది. ప్రస్తుత ధర ప్రకారం దిల్లీలో 14.2 కిలోల రాయితీ సిలిండర్‌ ధర రూ. 423.09 నుంచి 425.06కు పెరిగింది. జులై నుంచి నెలవారీగా ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు సబ్సీడీయేతర వంటగ్యాస్‌ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ.

09/01/2016 - 15:50

దిల్లీ: మంత్రి వర్గం నుంచి తొలగించిన సందీప్‌ కుమార్‌పై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ గురువారం భాజపా కార్యకర్తలు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. అశ్లీల సీడీలు బయటికి రావడంతో సాంఘిక సంక్షేమ మంత్రి సందీప్‌ కుమార్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు.

09/01/2016 - 15:43

దిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) వేసిన పరువు నష్టం దావాపై విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం సుప్రీంకోర్టులో వెల్లడించారు. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌ కారణం కాదని రాహుల్‌ చెప్తే కేసు వెనక్కి తీసుకుంటామని ఆరెస్సెస్‌ గతంలోనే వెల్లడించింది. అయితే, రాహుల్‌ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు.

09/01/2016 - 15:35

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో తనను విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

09/01/2016 - 15:05

ఢిల్లీ : దళితుడవ్వడంవల్లే తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సందీప్‌ కుమార్‌ ఆరోపించారు. ఇద్దరు మహిళలతో సందీప్‌ కుమార్‌ సన్నిహితంగా ఉన్న సెక్స్‌ వీడియో బయట పడింది. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించారు. సెక్స్‌ వీడియోలో లేనని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సందీప్‌ అన్నారు.

Pages