S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/01/2016 - 14:42

విజయవాడ: వినాయక చవితి, ఉపాధ్యాయ దినోత్సవం ఒకేరోజున రావడంతో గురుపూజోత్సవ వేడుకలను ఈనెల 5కు బదులు ఏడో తేదీన నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రభుత్వం తరపున ఏడో తేదీన గురుపూజోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

09/01/2016 - 14:30

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డీఏ పెంపునకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం సంతకం చేశారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

09/01/2016 - 14:25

హైదరాబాద్ : హైదరాబాద్ లో షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి 2,220 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గురువారం తెలిపారు. ప్రత్యక్షంగా 378, ఈమెయిల్స్ ద్వారా 165, ఫేస్ బుక్ ద్వారా 320, వాట్సాప్ ద్వారా 162, డయల్ 110 ద్వారా అధికంగా 1157 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.

09/01/2016 - 14:20

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తనపై ఏసీబీ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం ఉమ్మడి హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

09/01/2016 - 13:49

విజయవాడ: ఈనెల 25, 26 తేదీల్లో మూడో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు, బి-కేటగిరిలో డబ్బు కట్టిన వారికి ఏ- కేటగిరిలో సీటు వస్తే మినహాయింపు ఉండదని మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో భవిష్యత్‌లో ఎటువంటి గ్రేస్ మార్కులు ఉండవని మంత్రి తెలిపారు.

09/01/2016 - 13:45

విజయవాడ: విజయవాడ పరిసరాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.50 లక్షల విలువైన 1.6 కేజీల బంగారం, 8.20 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

09/01/2016 - 13:40

అనంతపురం: కొన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనందునే నేడు రాయలసీమలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కాంట్రాక్టర్లు ఇకనైనా నిర్లక్ష్యం వీడకుంటే కఠిన చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన గురువారం ఇక్కడ పోలవరంతో పాటు సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తీరుతెన్నులను సమీక్షించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

09/01/2016 - 13:39

హైదరాబాద్: ఇంట్లో ఆడుకుంటున్న తొమ్మిది నెలల బాలుడిని డ్రెస్సింగ్ టేబుల్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన నగరంలోని రాంనగర్ ప్రాంతంలో గురువారం జరిగింది. అనూష, ప్రవీణ్ దంపతుల రెండో కుమారుడు అయ్యన్ ఇంట్లో అటూ ఇటూ ఆడుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వెళ్లాడు. డ్రెస్సింగ్ టేబుల్ కింద పెట్టిన రాళ్లు కదలడంతో అది ఒక్కసారి అయ్యన్‌పై పడింది. దీంతో ఊపిరాడక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

09/01/2016 - 13:38

విజయవాడ: గన్నవరం మండలం గూడవల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఓ ఉద్యోగిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. సమాచారం తెలిశాక గన్నవరం పోలీసులు కళాశాలకు చేరుకుని ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.

09/01/2016 - 13:22

విజయవాడ: కృష్ణా జిల్లా డీఆర్డీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అజయ్‌ కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెనమలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్‌ అవివాహితుడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Pages