S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/02/2016 - 07:59

ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 31: వ్యవసాయశాఖలో యాంత్రీకరణ పథకంలో అక్రమాలకు పాల్పడిన పలువురు అధికారులపై వేడు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014-15 సంవత్సరానికి గాను యాంత్రీకరణ పథకం కింద జిల్లా రైతులకు ట్రాక్టర్లను అందించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. కాగా ఖమ్మం జెడిఏ కార్యాలయంలోని కొందరు అధికారులు తమ చేతి వాటం చూపించి నిధులను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

02/02/2016 - 07:57

గుంటూరు, జనవరి 31: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని భారతీయ జనతాపార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం అరండల్‌పేటలోని అర్బన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అమ్మిశెట్టి మాట్లాడుతూ అధ్యక్షునిగా ఎన్నుకున్న కార్యకర్తలు, నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

02/02/2016 - 07:56

కాకినాడ, జనవరి 31: తునిలో చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కాకినాడ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన రైలు ప్రయాణీకులను రెవెన్యూ అధికార్లు ఆదుకున్నారు. కాకినాడ డివిజన్‌లోని పిఠాపురంలో సికింద్రాబాద్-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. సామర్లకోటలో సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, మేడపాడులో ఢిల్లీ-విశాఖ ఎపి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి.

02/02/2016 - 07:54

తిరుపతి, జనవరి 31: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వైదిక విద్యను పరిరక్షించుకుంటూనే సాహిత్య విద్యను కూడా పరిరక్షించుకోవడం ముఖ్య కర్తవ్యమని వర్శిటీ విసి దేవనాథన్ పిలుపునిచ్చారు. వేదవర్శిటీ కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వర్శిటీలో నిర్వహించే దక్షిణ భారత కవి సమ్మేళన కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది.

02/02/2016 - 07:53

ప్రొద్దుటూరు, జనవరి 31: రాబోయే కాలంలో రాష్ట్రంలో వై ఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కనుమరుగవుతుందని, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి జైలు జీవితం తప్పదని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ నంద్యాల వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.

02/02/2016 - 07:51

అనంతపురం, జనవరి 31 : భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఫిబ్రవరి రెండవ తేదీన జిల్లాలో -పర్యటించనున్నారని కలెక్టరు కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి రెండవ తేదీన ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోబయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారన్నారు.

02/02/2016 - 07:50

అద్దంకి, జనవరి 31 : జిల్లాలో అక్షరాస్యతను మరింత పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వై శ్రీనివాస శేషసాయిబాబు పేర్కొన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలోని అర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహార్‌లాల్‌తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

02/02/2016 - 07:47

వరంగల్, ఫిబ్రవరి 1: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు ఆర్టీసీ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఈ జాతరను విజయవంతం చేసేందుకుగాను ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టింది.

02/02/2016 - 07:46

జనగామ టౌన్, జనవరి 31: నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రెలైన చందంగా తయారయ్యాయ సివిల్ సప్లై అధికారుల తనిఖీలు... రైస్‌మిల్ యజమానులను నమ్మి కోట్లాది విలువ గల ధాన్యాన్ని ఇచ్చి కస్టమ్ ద్వారా బియ్యాన్ని తీసుకోవడంలో సంబంధిత యజమానులు సివిల్ సప్లైకి సుమారు రూ.1.50కోట్లు టోకరా వేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం పసరమడ్ల గ్రామ శివారులో జరిగింది. అధికారుల వివరాల ప్రకారం...

02/02/2016 - 07:44

మద్నూర్, ఫిబ్రవరి 1: కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వచ్చి, తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో అనుకోని రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా సరిహద్దు నుండి పది కిలోమీటర్ల దూరంలో గల మహారాష్టల్రోని దెగ్లూర్ తాలూకా వొన్నాలిగేట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.

Pages