అనంతపురం

2న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 31 : భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఫిబ్రవరి రెండవ తేదీన జిల్లాలో -పర్యటించనున్నారని కలెక్టరు కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి రెండవ తేదీన ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోబయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అక్కడే మధ్యాహ్నం 2.30 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారని, మధ్యాహ్నం 2.30 గంటల కు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకు నార్పల మండలం బండ్లపల్లి చేరుకుంటారన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలోపాల్గొని ప్రసంగం అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 4.25 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. ప్రత్యేక విమానంలో4.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.

మన్మోహన్, రాహుల్ పర్యటనకు విస్తృత బందోబస్తు

పుట్టపర్తి, జనవరి 31: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జిల్లా, పుట్టపర్తి పర్యటనపై విస్తృత స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌పి రాజశేఖరబాబు తెలిపారు. ఆదివారం సత్యసాయి విమానాశ్రయాన్ని పరిశీలించి ఏర్పాట్లపై పోలీసులతో చర్చించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఢిల్లీ నుంచి ఉదయం 10గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 12:30గంటలకు వారు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. ఇక్కడి నుండి 12:35 గంటలకు రాహుల్‌గాంధీ నార్పల మండలం బండ్లపల్లికి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయలుదేరి వెళ్తారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రశాంతినిలయంలోని శాంతి భవన్‌కు రోడ్డు మార్గాన కారులో చేరుకుంటారు. ఇక్కడ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. మధ్యా హ్నం 2:30గంటల వరకు స్థానిక శాంతి భవన్‌లో విడిది చేస్తారు. 2:35గంటలకు బయలుదేరి సత్యసాయి విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలీకాప్టర్‌లో బండ్లపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:30గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీలు చేరుకుంటారు. ఇక్కడి నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ సందర్భంగా వారి పర్యటనలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త జాయింట్ కలెక్టర్ ఖాజా మోహిద్దీన్, ఎఎస్పీ మాల్యాద్రి, అగ్నిమాపక జిల్లా అధికారి జయన్న, సత్యసాయి విమానాశ్రయం డైరెక్టర్ వేణుగోపాల్, ఆర్‌డిఓ రాజశేఖర్, డిఎస్‌పి ముక్కా శివరామిరెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, పుడా వైస్ చైర్మన్ రామాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ సాహెబ్‌పీరా పాల్గొన్నారు.

తోడేసుకో.!

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకుని రానున్నట్లు ప్రకటించిన నేపథ్యంలోజిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. దీంతోజిల్లాలోని అధికారికంగా గుర్తించిన ఇసుక రీచ్ లతోపాటు అనధికారి ఇసుక రీచ్ ల నుంచి సైతం పెద్ద ఎత్తున ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి వేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ వందల లారీలు, ట్రాక్టర్లు జిల్లా నుంచి సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతోపాటు మరికొంతమంది ప్రబుద్దులు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సురక్షిత ప్రాంతాల్లో డంప్ చేసుకుంటున్నారు. ఇలా డంప్ చేసిన ఇసుకను అత్యవసర సమయంలో అధిక ధరలకు అమ్ముకోవచ్చన్న దురాశతో ఈ పనికి పాల్పడుతున్నారు. జిల్లాలోవారం పది రోజుల వ్యవధిలో ఓడిసి పోలీసులు, నల్లమాడ పోలీసులు సుమారుగా ఐదు వరకూ ఇసుక లారీలను పట్టుకున్నారు. ఇలా పట్టుబడ్డ లారీల్లో కొన్ని ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన లారీలు కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలోఅధికార పార్టీ నాయకుల పరోక్ష,ప్రత్యక్ష ప్రమేయంతోఅందిన కాడికి తోడేసుకో అన్న చందంగా దొరికిన ఇసుకను దొరికినట్లుగా తోడేసుకుంటున్నారు. వీరి వ్యవహారాన్ని కొంతమంది పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లోని పోలీసులకు ఇందులో భాగస్వామ్యం ఉండడం గమనార్హం. ఇలా ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కు అయ్యి చిత్రావతి, పెన్నా నదుల్లోని ఇసుకను తోడి పారేస్తున్నారు. ఇక జిల్లాలోని రాయదుర్గం, బొమ్మనహాళ్, గుత్తి, గుంతకల్లు, ధర్మవరం, కదిరి, పెనుకొండ, రాప్తాడు, హిందూపురం ప్రాంతాల్లో తిష్ట వేసిన ఇసుక మాఫియా పెద్ద ఎత్తున రెచ్చిపోతూ ఉంది. ఇలా వీరు ప్రతి రోజూ ఎలాంటి పర్మిట్లు లేకుండానే పెద్ద ఎత్తున ఇసుక దందాకు తెర తీస్తున్నారు. ఇలా కొన్ని ప్రాంతాల్లో ఆధీనంలో ఉన్న రీచ్ ల నుంచి మరికొన్ని ప్రాంతాల్లో ఆధీనంలోలేని రేవుల నుంచి సైతం ఇసుకను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా కర్ణాటకలో ఇసుకకు ఉన్న డిమాండును ఆసరాగా చేసుకున్న వీరు ఒక ట్రాక్టరు ఇసుకను పది వేలకు పైగానే అమ్ముకుంటున్నారు. దీంతోపాటు ఇసుక మాఫియలోని కొంతమంది సభ్యులు ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేసుకుంటూ ఉంటోంది. ఇలా ప్రతి రోజూ వందల సంఖ్యలోలారీలు, ట్రాక్టర్ లతో కర్ణాటక ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుని రానున్న కొత్త ఇసుక పాలసీ కన్నా ముందుగానే ఇసుక మాఫియా మొత్తం ఇసుకను తోడేస్తోంది.

విద్యతోనే అభివృద్ధి

ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 31 : విద్య వల్లనే విజ్ఞానం, అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టరు బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. ఆదివారం ఉదయం అనంతపురంలోని సాంఘిక సంక్షేమ బాలుర 4వ వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థులకు ఉత్తీర్ణత, ఉత్ప్రేరణ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంయుక్త కలెక్టరు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా సాంఘిక సంక్షేమ శాఖాధికారి పరిధిలోని కూడేరు, బుక్కరాయసముద్రం, తరిమెల, శింగనమల, అనంతపురం లోని ప్రభుత్వ వసతి గృహాల్లోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. ఈ సదస్సులోనిష్ణాతులైన అధ్యాపక నిపుణులచే విద్యార్థులకు అనేక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారన్నారు. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు పాటించాల్సిన విషయాలపై తగు సూచనలు చేశారన్నారు. ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు పొందుటకు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి నూటికి నూరు శాతం పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. విద్యార్థులలో విద్య పట్ల చైతన్యం, ఉత్సాహం, ప్రేరణ కొరకు వసతి గృహాల్లోని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు కృషి చేయాలన్నారు. ఈ అవగాహన సదస్సులో చెప్పే అంశాలపై విద్యార్థులు దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం హాస్టళ్ల విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలల కంటే మెరుగైన వసతులు కల్పిస్తోందన్నారు. కాల పరిమితితోప్రణాళికాబద్దంగా ప్రభుత్వ పాఠశాలల్లో ని విద్యార్థులు చదవాలన్నారు. ఈ సాధన చేయడం వల్ల ఉత్తీర్ణత సులభతరమవుతుందన్నారు. చిత్తశుద్దితోచదివి తల్లితండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈకార్యక్రమంలోజిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి లక్ష్మానాయక్, సహాయ సంక్షేమ శాఖాధికారులు చంద్రశేఖరరెడ్డి, మహబూబ్ భాషా, రామునాయక్, రాజేశ్వరి, బాబు, శ్రీరాములు, ఇర్షాద్, హెచ్ ఎం ఆదినారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ నెట్టికంటి సన్నిధిలో పుష్యార్క హోమం
గుంతకల్లు, జనవరి 31: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం పుష్యార్క హోమాన్ని ఆలయ వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కొలువు దీర్చి అభిషేకాలు, విశేష పుష్పలంకారాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం పుష్యార్క హోమాన్ని ఆలయ వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎఇఓ ధనుంజయ, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మానవ శ్రేయస్సుకే అయుత చండీయాగం
హిందూపురం టౌన్, జనవరి 31: విశ్వశాంతి, మానన శ్రేయస్సు కోసమే ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు పట్టణంలోని ఎంజిఎం క్రీడా మైదానంలో ఆయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామిజీ పేర్కొన్నారు. ఆయుత చండీ హోమ నిర్వహణలో భాగంగా ఆదివారం దేవాలయాల సందర్శన నిర్వహించారు. స్థానిక శ్రీకంఠాపురం అరుంధతి నగర్‌లో ప్రసన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. భగవంతుడు అందరికీ సమానమన్నారు. పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా తాను దళిత వాడల్లో కూడా పర్యటిస్తున్నట్లు తెలిపారు. గోవధ మహా పాపమని, గోవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు హరి, ఎన్‌సి ఆదర్శ్, చంద్రశేఖర్‌రెడ్డి, ఉదయ్, సాయి, రమేష్, శివ, సిద్ధప్ప, ఆదెప్ప, సుబ్రమణ్యం, లక్ష్మినారాయణ, సుదర్శన్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చలపతి, ఆది జాంబవంత డెవలప్‌మెంట్ ట్రస్టు అధ్యక్షులు ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
బొమ్మనహాల్, జనవరి 31: మండల పరిధిలోని పలుగ్రామాల నందు రైతులకు ప్రభుత్వం 7 గంటలు అందిస్తున్న విద్యుత్ సమయం సందర్భం లేకుండా సరఫరా చేయడం వల్ల అందని ద్రాక్షలగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శ్రీ్ధర్‌ఘట్ట, బొమ్మనహాల్, గోవిందవాడ సబ్ స్టేషన్ నుండి పలుగ్రామాలకు వెళ్లే విద్యుత్ ఫీడర్లను పలుమార్లు ఆఫ్, ఆన్ చేయడం వల్ల పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆరోపించారు. ఈ విషయంపై విద్యుత్ ఎఇ సంజీవరాయుడుకి ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు పేర్కొన్నారు. లక్షలాధి రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వేరుసెనగ, మొక్కజొన్న పంటలు నీరు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం అదేశాలను నిలుపుకోవడం అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ విషయంలో అధికారులు కలుగ చేసుకుని ప్రభుత్వం నిర్దారించిన సమయంలో సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని లేకుంటే విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. ఈ విషయంపై ఎఇని వివరణ కోరగా ప్రభుత్వం అదేశాల మేరకు కోతలు లేని 7 గంటల విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు.

బాలయ్య సమక్షంలో
వైకాపా ఎంపిటిసిలు టిడిపిలో చేరిక

చిలమత్తూరు, జనవరి 31: మండల పరిధిలోని కోడూరు పంచాయతీకి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలు చెన్నక్రిష్ణ, సూర్యనారాయణలు ఆదివారం హైదరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎంపిపి నౌజియాభాను భర్త మన్సూర్, రాష్ట్ర చంద్రదండు ఉపాధ్యక్షులు అన్సార్ అహ్మద్‌ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు వెళ్ళిన ఎంపిటిసిలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు మంది వైకాపా ఎంపిటిసిలు గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఎంపిపి నౌజియాభానుకు ఒకరిద్దరు స్వంత పార్టీ సభ్యుల నుండి వ్యతిరేకత ఉండటం, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నంజుండ కూడా ఎంపిపి వర్గానికి వ్యతిరేకంగా ఉండటంతో చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సార్ అహ్మద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి వైకాపా ఎంపిటిసిలను టిడిపిలోకి చేర్చుకొనేందుకు పావులు కదిపారు. దీనికి తోడు ప్రతిపక్షంలో తామేమి తమ ప్రాంతాలకు అభివృద్ధి చేయడానికి అవకాశం లేదన్న ఉద్దేశంతో ఆయా వైకాపా ఎంపిటిసిలు టిడిపిలోకి చేరినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వాలు

హిందూపురం టౌన్, జనవరి 31: గత యుపిఏ ప్రభుత్వం వలసలు వెళ్తున్న కూలీలను ఆదుకోవడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయగా దాన్ని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ నెల 2వ తేదీన బండ్లపల్లిలో జరిగే ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ పర్యటనను విజయవంతం చేయడంలో భాగంగా ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రఘువీరా కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమై చర్చించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ, గత యుపిఏ ప్రభుత్వం హయాంలో దేశంలోని ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వలసలు ఆపేందుకు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు దాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించి పనులను ఎంపిక చేసి ప్రతి వారం బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. అయితే టిడిపి ప్రభుత్వం సర్పంచ్‌లను డమీ చేసి జన్మభూమి కమిటీలకు పెత్తనం కట్టబెట్టి దళారులను ప్రోత్సహిస్తూ యంత్రాలతో పనులు చేస్తూ నెలల తరబడి బిల్లులను చెల్లించడం లేదన్నారు. స్థానికంగా ప్రభుత్వాలు పనులు కల్పించకపోవడంతో విధి లేక లక్షలాది కుటుంబాలు పొట్టచేత బట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో రాహుల్‌గాంధీ బండ్లపల్లిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని అమలు చేసి దశాబ్దకాలం గడిచిందన్నారు. రాహుల్‌గాంధీ పనులు లేని కూలీలు, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించిన ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్‌లతో ముఖాముఖి నిర్వహించడం జరుగుతుందన్నారు. రాహుల్‌తోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ కేంద్ర మంత్రులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారన్నారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరా సూచించారు. కార్యకర్తలు, నాయకులు సాధ్యమైనంత త్వరగా బండ్లపల్లి చేరుకొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, చిన్న వెంకట్రాముడు, అబ్ధుల్లాఖాన్, కెటి శ్రీ్ధర్, రాయల్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఆదిమూర్తి, నాయకులు శైవలి రాజశేఖర్, అబ్ధుల్ రవూఫ్, పీర్‌సాబ్, ఇందాద్, దీపక్, నా గేంద్ర, బండ్లపల్లి జబీ, రహమత్, జ మీల్, ఇనాయత్, అస్లాం పాల్గొన్నారు.

నిర్వీర్యమవుతున్న సంక్షేమ పథకాలు

ధర్మవరం, జనవరి 31: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోసకారితనం, టిడిపి చేతకానితనం వల్లే పలు పథకాలు నిర్వీర్యం అవుతున్నాయని, అంతేగాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని 20 సూత్రాల పథకం మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన్మోహన్ ప్రధానిగా వున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు జరిగాయన్నారు. విద్యాహక్కు చట్టం, గృహ హింస నిరోధక చట్టం, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టాలు కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టబడ్డాయన్నారు. ప్రపంచంలోనే కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో ఇలాంటి చట్టాలు ఏ దేశంలో లేవని, అయితే ప్రపంచంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం ఉపాధి హామీ అన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఇందిరమ్మ ఆశించిన దారిద్య్ర రహిత భారత్ నిర్మాణం, రాజీవ్ కలలు కన్న సాధికారతలే ఉపాధి హామీకి ప్రాతిపదికలన్నారు. పస్తులు, ఆకలి చావులు, వలసలు లేని గ్రామీణ భారతం ఆవిష్కరణ లక్ష్యంగా ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు. ఈ లక్ష్య సాధన కోసం ఉపాధి హామీని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. ఇది ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కాదని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో అత్యధిక వలసలున్న జిల్లాలు ముఖ్యంగా అనంతపురం, మహబూబ్‌నగర్‌లలో అనంతపురంను ఎంపిక చేసి 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్, సోనియాలు బండ్లపల్లిలో జాతీయస్థాయిలో పథకాన్ని ప్రారంభించారన్నారు. యుపిఎ హయాంలో 2006నుండి 2014 దాకా జాతీయ స్థాయిలో రూ.2,36,700 కోట్లు ఉపాధి హామీకి వ్యయం చేసిందని, ఎపిలో రూ.30,806 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దీంతో 60 లక్షల కుటుంబాలకు 1.16 కోట్ల మంది కూలీలకు ఉపాధి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అలాగే 220 కోట్ల పని దినాలు కల్పించిందని, పర్యవసానంగా గ్రామీణ పేదరికం తగ్గిందని, వారి జీవన ప్రమాణాలు పెరిగాయని, వలసలు సైతం గణనీయంగా తగ్గాయన్నారు. అయితే మో దీ ప్రధాని అయిన తర్వాత గతంలో యుపిఎ చేపట్టిన పథకాలను నీరుగారుస్తోందని ధ్వజమెత్తారు. ప్రధానంగా గణనీయ అభివృద్ధికి దోహదపడే ప్లానింగ్ కమీషన్‌ను రద్దు చేసిందన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం దేశంలోని నగరాలు, పట్టణాల్లో కనీస సౌకర్యాలకు నిధులు ఇచ్చేవారని, దాని పేరు మార్చి కొన్నింటికే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. అదే బాటలో ఉపాధి హామీని సైతం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బడ్జెట్ 2010-11లో రూ. 40,100 కోట్లు కేటాయిస్తే 2015-16 లో రూ.31 వేల కోట్లు మాత్రం కేటాయించారని తెలిపారు. సకాలంలో కూలీలకు డబ్బు అందడం లేదని, ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం తగదన్నారు. యంత్రాలతో పనులు చేయిస్తూ పలు విధాలుగా పథకాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ కూలీల పొట్ట కొట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలకు కాంగ్రెస్‌పరంగా భరోసా, కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి ఉపాధిని మరింత పటిష్టవంతంగా అమలుచేసేందుకు కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లిలోనే పదేళ్ల తర్వాత అదే రోజున అదే గ్రామంలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ తదితరులు వస్తున్నారని, ఈ నేపథ్యంలో వారు ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు భరోసా కల్పించనున్నట్లు తెలిపారు.