S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/14/2016 - 00:13

ముంబయి, నవంబర్ 13: టాటా-మిస్ర్తిల వివాదం రోజురోజుకు ముదురుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు ఇరు వర్గాల నుంచి మరింతగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సైరస్ మిస్ర్తి మాట్లాడుతూ స్వతంత్ర డైరెక్టర్లను టాటా సన్స్ విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. 100కుపైగా సంస్థలు, 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా సన్స్ చైర్మన్‌గా గత నెల సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే.

11/14/2016 - 00:12

విజయవాడ, నవంబర్ 13: ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఇప్పటివరకు 38 లక్షల 10,305 ఎకరాల వెబ్‌ల్యాండ్‌పై రూ. 9,270 కోట్ల రుణాలు మంజూరు చేశారు. రికార్డుల డిజిటలైజేషన్‌లో భాగంగా భూముల వివరాలన్నింటిని రెవెన్యూ శాఖ వారు ఆన్‌లైన్‌లోకి ఎక్కిస్తున్నారు. ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఎక్కించిన భూములను వెబ్‌ల్యాండ్ అంటారు.

11/13/2016 - 07:22

పూర్తి స్థాయిలో ప్రింటింగ్ ప్రెస్‌లు పనిచేస్తున్నాయి
బ్యాంకుల్లో సరిపడా నగదు లభ్యత ఉంది
స్పష్టం చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎలక్ట్రానిక్ లావాదేవీలు పెంచుకోవాలని ప్రజలకు సూచన

11/13/2016 - 07:20

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణలో ఫార్మాసిటీకి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఫార్మాసిటీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం టిఎస్‌ఐఐసి అధికారులతో శనివారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఫార్మాసిటీకి భూసేకరణ పూర్తి చేశామని గుర్తు చేశారు.

11/13/2016 - 07:19

విజయవాడ, నవంబర్ 12: సరళతర వాణిజ్యంలో తనదైనశైలిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ఫలితాలకు కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ముఖ్యమంత్రికి రాసిన లేఖలో అభినందనలు తెలిపింది.

11/13/2016 - 07:18

విజయవాడ, నవంబర్ 12: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన రాజ్యసభ్య మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీకి పిలుపు వచ్చింది. ఆయన సలహాలు సంప్రదింపులు, సూచనలు తీసుకోవటం కోసం ఈ నెల 19న ఢిల్లీకి రావాల్సిందిగా ఆయనను సగౌరవంగా జైట్లీ ఆహ్వానించారు.

11/13/2016 - 07:17

విశాఖపట్నం, నవంబర్ 12: నవ్యాంధ్రలో పర్యాటకం మొత్తం ఇక నుంచి ప్రైవేటుపరం కానుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర విలువైన హోటళ్ళు, రిస్టార్ట్స్, మరికొన్ని ఆస్తులు ఇక నుంచి ప్రైవేటు రంగం చేతుల్లోకి వెళ్ళిపోనున్నాయి. ఇదే జరిగితే విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి ఎండమావి కానుంది.

11/13/2016 - 07:16

న్యూఢిల్లీ, నవంబర్ 12: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. మ్యాక్స్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ విలీనాన్ని శనివారం ప్రశ్నించింది. దీంతో ఐఆర్‌డిఎఐకి ఈ విషయంపై స్పష్టతను ఇస్తామని ఇరు సంస్థ లు ప్రకటించాయి.

11/12/2016 - 08:42

ముంబయి, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. రచిస్తున్న కొత్త విధానాలతో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు పెరుగుతాయని, ఇవి భారత్‌సహా అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధికి విఘాతం కలిగిస్తాయన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించాయి.

11/12/2016 - 08:41

ముంబయి, నవంబర్ 11: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే ఏకంగా 99.6 శాతం క్షీణించింది. మొండి బకాయిల కారణంగా కేవలం 20.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 4,991.70 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం.

Pages