S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/19/2016 - 00:56

హైదరాబాద్, నవంబర్ 18: ఆన్‌లైన్ బస్సు బుకింగ్ విధానంలో కొత్త ఒరవడి తీసుకువచ్చిన ట్రావెల్‌యారి సంస్థ.. ఆఫ్‌లైన్ పేమెంట్ ఏకీకరణ కోసం పేటిఎం, రిలయన్స్ జియోతో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకులతో పాటు బస్సు ఆపరేటర్లకు కూడా పరిష్కారాలు చూపించేందుకు ఈ విధానం ఖరారు చేసినట్లు ట్రావెల్‌యారి అధికార ప్రతినిధి అరవింద్ లామ తెలిపారు.

11/19/2016 - 00:56

ముంబయి, నవంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. వచ్చే నెల నిర్వహించే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ ఇవ్వడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు.

11/19/2016 - 00:55

హైదరాబాద్, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను ఇకపై కేవలం సెకన్ల వ్యవధిలోనే నగదు రహితంగా చెల్లించవచ్చును. దేశంలో అతిపెద్ద ఇండిపెండెంట్ డిజిటల్ వాలెట్ మొబిక్విక్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది.

11/18/2016 - 00:46

న్యూఢిల్లీ, నవంబర్ 17: రాబోయే మూడు దశాబ్దాల్లో నిలకడగా 9నుంచి 10 శాతం వృద్ధి రేటును సాధించడంపై దృష్టి పెడుతూ భారత దేశం వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) చట్టం చేయడం, పెద్ద నోట్ల రద్దుసహా పలు చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు. ‘దివాలా చట్టం మొదలుకొని వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దాకా భారత్‌లో మేము వ్యవస్థాగత సంస్కరణలను చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు.

11/18/2016 - 00:45

ముంబయి, నవంబర్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికంగా ఎదురుకానున్న ప్రభావాలపై భయాలు ఇంకా తొలగిపోకపోవడంతో పాటుగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలు సైతం మార్కెట్లు నష్టాల్లో కొనసాగడానికి కారణమైనాయి.

11/18/2016 - 00:42

ముంబయి, నవంబర్ 17: టాటా సన్స్ చైర్మన్ పదవినుంచి తొలగించిన సైరస్ మిస్ర్తి గురువారం జరిగిన ఆ గ్రూపుకే మకుటాయమానమైన టిసిఎస్ బోర్డు సమావేశానికి గైరుహాజరయ్యారు. కాగా, టిసిఎస్ బోర్డునుంచి మిస్ర్తిని తొలగించడంపై నిర్ణయం తీసుకోవడం కోసం వచ్చేనెల అసాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

11/18/2016 - 00:40

న్యూఢిల్లీ, నవంబర్ 17: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దేశ కరెంటు ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో10.1 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యే అవకాశముందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సంస్థ సిటీ గ్రూపునివేదిక అభిప్రాయ పడింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంట్ ఖాతా లోటు (సిఏడి) జిడిపిలో 1.2 శాతం లేదా 30 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని కూడా ఈ సంస్థ అంచనా వేసింది.

11/18/2016 - 03:35

న్యూఢిల్లీ, నవంబర్ 17: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు డిపాజిట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నగదు ప్రవాహం వెల్లువెత్తడంతో ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ సహా పలు ప్రధాన బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో రానున్న కొద్ది రోజుల్లో ఇతర వడ్డీ రేట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

11/18/2016 - 00:39

హైదరాబాద్, నవంబర్ 17: కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్ల కష్టాలు తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో ఆర్ధిక రంగం ఊపందుకుంటుందని, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర వాణిజ్య సంఘాల సంస్ధ (ఎఫ్‌టాప్సీ) ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్ అన్నారు. చట్టానికి లోబడి పనిచేసే సంస్ధలు, వ్యక్తులకు పెద్ద నోట్ల వల్ల భయం ఉండదని, అక్రమమార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వారికే ఆందోళన అని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారన్నారు.

11/18/2016 - 00:37

హైదరాబాద్, నవంబర్ 17: బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్, వైర్‌లెస్, మోబైల్ (పోస్ట్‌పెయిడ్) బకాయిదారులకు, బకాయిల చెల్లింపులో బిఎస్‌ఎన్‌ఎల్ రాయితీ ప్రకటించింది. బకాయిల చెల్లింపులో 10 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

Pages