S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/17/2016 - 07:38

న్యూఢిల్లీ, నవంబర్ 16: నగదు డిపాజిట్ల వివరాలను ఆదాయ పన్ను శాఖకు అందించాలని బ్యాంకులు, పోస్ట్ఫాసులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను వారం రోజుల క్రిందట (నవంబర్ 8 రాత్రి) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే.

11/17/2016 - 07:35

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. భారీగా పేరుకుపోయిన మొండి బకాయిలను ఖాతా పుస్తకాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇది వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఎస్‌బిఐ రద్దు చేసిన మొండి బకాయిల జాబితాలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణం కూడా ఉండటమే దీనికి కారణం.

11/17/2016 - 07:34

హైదరాబాద్, నవంబర్ 16: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) వరల్డ్ వైడ్ సేవలు ఇక తెలుగు భాషలోనూ లభించనున్నాయి. బిబిసి వరల్డ్ వైడ్ సర్వీసెస్ దాదాపు 80 సంవత్సరాల తర్వాత అతిపెద్ద విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా మరో 11 భాషల్లో సేవలు అందించనుందని బిబిసి డైరెక్టర్ జనరల్ టోని హాల్ చెప్పారు.

11/17/2016 - 07:34

హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ అంతరాయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విద్యుత్ పరిస్ధితిపై అమరావతిలో సమీక్షించారు. దేశం మొత్తం మీద విద్యుత్ పంపిణీలో వాణిజ్య నష్టాలు లేని రాష్ట్రంగా ఆంధ్రా ఉండాలన్నారు. అంతర్జాతీయ విద్యుత్ ఉన్నతా ప్రమాణాలను అమలు చేయాలన్నారు.

11/17/2016 - 07:33

ముంబయి, నవంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా నష్టపోతే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది.

11/16/2016 - 00:29

న్యూఢిల్లీ, నవంబర్ 15: వీడియో కాలింగ్‌ను వాట్సప్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే ప్రత్యర్థి యాప్‌లు స్కైప్‌తోపాటు యాపిల్‌కు చెందిన ఫేస్‌టైమ్, గూగుల్ డ్యూయో వీడియో కాలింగ్‌ను మొబైల్ వినియోగదారులకు పరిచయం చేసినది తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కూడా వీడియో కాలింగ్‌ను తీసుకొస్తోంది. మరికొద్ది రోజుల్లో 100 కోట్లకుపైగా ఉన్న వాట్సాప్ వినియోగదారులు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారని ఆ సంస్థ తెలిపింది.

11/16/2016 - 00:28

దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్ లగ్జరీ వాహనాల విభాగమైన జాగ్వార్ లాండ్ రోవర్.. పూర్తి స్థాయలో తొలిసారిగా ఓ విద్యుత్ ఆధారిత కారును లాస్ ఏంజిలిస్‌లో విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది

11/16/2016 - 00:30

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో.. మంగళవారం ముంబయలో వి5 స్మార్ట్ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 17,980 రూపాయలు. 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా దీని సొంతం

11/16/2016 - 00:23

మంగళవారం ముంబయిలో ప్రముఖ విదేశీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. మకాన్ పేరిట ఓ సరికొత్త ఎస్‌యువిని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ముంబయి ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 76.84 లక్షల రూపాయలు

11/16/2016 - 00:21

న్యూఢిల్లీ, నవంబర్ 15: టాటా సన్స్ సంక్షోభం నేపథ్యంలో దాని తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా మంగళవారం ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టాటా గ్రూప్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి రతన్ టాటా ఓ లేఖను రాయగా, జైట్లీతో తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో ఏం మాట్లాడారన్న దానిపై స్పందించేందుకు రతన్ టాటా నిరాకరించారు.

Pages