S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/17/2015 - 15:58

ముంబయి : స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు లాభపడి 25,803 వద్ద ముగియగా, నిఫ్టీ 90 పాయింట్లకు పైగా లాభపడి 7,844 వద్ద ముగిసింది.

12/17/2015 - 06:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: హైదరాబాద్‌లో ఓ నూతన క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. అంతేగాక భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ భారత సంతతి సాఫ్ట్‌వేర్ దిగ్గజం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వ్యాపారాభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతామన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేసిన సుందర్ పిచాయ్..

12/17/2015 - 06:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను త్వరగా అమల్లోకి తీసుకురావడం వల్ల అది ఉద్యోగ సృష్టికి దోహదపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టినా లగార్డే అభిప్రాయపడ్డారు. ఆదాయావకాశాలు కూడా పెరుగుతాయని, దేశీయ ఉత్పాదక సామర్థ్యం కూడా పెరుగుతుందన్నారు.

12/17/2015 - 06:17

హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రభుత్వ విధానాలు, వాటి అమలు, రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపై మేనేజిమెంట్ విద్యార్థులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ ప్రావీణ్యానికి పదును పెట్టుకోగలుగుతారని పలువురు ఐఎఎస్ అధికారులు సూచించారు.

12/17/2015 - 06:16

ముంబయి, డిసెంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లోనే ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్షకు ముందు మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 173.93 పాయింట్లు పుంజుకుని 25,494.37 వద్ద ముగిసింది.

12/17/2015 - 06:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నూతన డీజిల్ ఎస్‌యువిలపై, 2,000 సిసికిపైగా ఇంజిన్లను కలిగిన కార్లపై ఢిల్లీలో తాత్కాలిక నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆటోరంగ సంస్థలు వ్యాఖ్యానించాయి.

12/17/2015 - 06:14

నైరోబి/న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) దోహా అభివృద్ధి అజెండా (డిడిఎ) ప్రమాదంలోకి జారుకుంటోదన్న ఆందోళనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న డబ్ల్యుటిఒ 10వ మంత్రిత్వ స్థాయి ప్లీనరీ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు.

12/17/2015 - 06:14

విశాఖపట్నం, డిసెంబర్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో రూ. 18 వేల కోట్ల ప్రీమియం వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసన్ తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ నెలాఖరు నాటికి రూ. 11,800 కోట్ల ప్రీమియం వసూలు చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో తమ సంస్థ రూ.

12/16/2015 - 17:06

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 173 పాయింట్లు లాభపడి 25,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,750 పాయింట్ల వద్ద ముగిసింది.

12/16/2015 - 08:11

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిహెచ్‌ఇఎల్ సిఎండి బి ప్రసాదరావును కోరారు. విజయవాడలో 800 మెగావాట్లు, కృష్ణపట్నంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బిహెచ్‌ఇఎల్ చేపట్టింది.

Pages