S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

03/11/2017 - 01:10

అమెరికాలో గతంలోనూ భారత సంతతికి చెందినవారిని ఏదో ఒక మిషతో కాల్చి చంపిన సంఘటనలు జరిగాయి. తన కారు మరో కారుకు తగిలిందనో, ఓ యువతిని రక్షించే క్రమంలో జరిగిన వివాదంలో వరంగల్‌కు చెందిన ఓ ఇంజనీర్‌ను అమెరికన్ పౌరుడు కాల్చి చంపాడు. ఇటీవల ఓ క్లబ్‌లో హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ను జాత్యహంకారంతో ఓ తెల్లజాతీయుడు కాల్చిచంపి తెలుగు ప్రజలను విషాదంలో ముంచేశాడు.

03/10/2017 - 00:20

పెళ్లి ఖర్చు ఐదు లక్షలు దాటితే అందులో పదిశాతం మొత్తాన్ని ప్రభుత్వానికి సమర్పించుకోవాలన్న చట్టం రాబోతున్నదని వార్తలొచ్చాయి. ఈ రోజుల్లో పెళ్లిళ్లు కన్యాదాత గృహంలో జరగడం లేదు వెనకటి మాదిరిగా. కల్యాణ మండపం బుక్ చేయాలి. బంధువులు, అయినవాళ్లు కూడా- ‘మా అబ్బాయికి అమెరికాలో జాబ్. వాడి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తారు. పెళ్లి గ్రాండ్‌గా చేయాలి. మా అమ్మాయి పెళ్లి అలాగే చేశాం. ఒక్కగానొక్క కొడుకు.

03/09/2017 - 05:52

మన దేశంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయట.. ఈ విషయమై అమెరికా ప్రభుత్వం ఒక నివేదికను మన ప్రభుత్వానికి పంపించింది. ఇతర దేశాల నుంచి డబ్బు అందుకుంటున్న ‘సేవా’ సంస్థలను మన ప్రభుత్వం క్షోభ పెడుతోందట! ( అంటే మత మార్పిడి సంస్థలను అని అర్థం) మతాలూ, కులాలూ, ఆడవాళ్లూ వగైరా అందరి పట్లా మానవ హక్కులకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ప్రవర్తిస్తోందట. కనుక తన పద్ధతి మార్చుకోవాలట.

03/08/2017 - 01:01

మహిలో మహిమలు చూపే మహిళ
బహుముఖ పాత్రలు పోషించే మహిళ
మహిళుంటేనే గృహమున కళకళ
మగడికి మగువే మార్గం అన్నివేళల

ఆడది లేదా జగమగు వెలవెల
అబల అని అలుసుగ చూచుట ఏల?
అది ఇది ఏమని అన్ని రంగముల
మగడిని మించిన అతిబల.. సబల

గగనములోన సగమగు నవల
సమహోదాతోనే జీవన సఫల
వనితే అవని నిండిన వెనె్నల

03/07/2017 - 02:58

దేశ శ్రేయస్సు కోసం ప్రస్తుతం ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతం అనుసరణీయం. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా విభేదాలు దాటి జాతికోసం పనిచేసే మనుషుల నిర్మాణం, నేటి అవసరం, వ్యక్తి నిర్మాణం వల్లనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ‘కలసి వుంటే కలదు సుఖం’ అన్న భావనయే ఏకాత్మ మానవతావాదం.

03/06/2017 - 07:34

ఇరుగు పొరుగు దేశాలకు ఉగ్రవాదం ఎగుమతి చేస్తూ పబ్బం గడుపుకునే పాకిస్తాన్‌లో ఇటీవల ఉగ్రవాదం పెచ్చుపెరిగి రెండు వందలమంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోడం, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగడం చూస్తుంటే పరులకోసం తీసిన గొయ్యిలో తానే పడి కాళ్లు విరగగొట్టుకున్న ఒక ప్రబుద్ధుడి కథ గుర్తుకురాకమానదు.

03/04/2017 - 01:34

ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-2 పరీక్షల సందర్భంగా అభ్యర్థులకు నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సెంటర్లలో చిన్న పిల్లలకు వేసే బెంచీలనే అభ్యర్థులకు వేయడం గమనార్హం. రోజుకు 5, 6 గంటలు ఆ చిన్న బెంచీలపై కూర్చోలేక అభ్యర్థులు నరకయాతనని అనుభవించారు. మహిళా అభ్యర్థుల వెంట వచ్చిన వారికి పరీక్షా కేంద్రాల వద్ద పడిగాపులు తప్పలేదు.

03/03/2017 - 00:47

మా ఆవిడ విసుక్కొంటూ చేసిన జీడిపాకమైనా కొరుకుడు పడుతుందేమో కానీ ఈ జీడీపి లెక్కల హెచ్చుతగ్గులు మాత్రం అర్థం కావడం లేదు. తాజాగా మూడో త్రైమాసికంలో (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) మన దేశం జీడీపి 7 శాతంగా నమోదైనట్టు అధికారిక వర్గాల వార్త. నోట్ల రద్దుని అధిగమిస్తూ జీడీపి వృద్ధిని సాధించడం తీపికబురు అనడంలో సందేహం లేదు. అయితే, ఆ వార్త ఆనందంతోపాటు అనుమానాల్ని కూడా మోసుకొచ్చింది.

03/02/2017 - 04:34

అవినీతిపరులైన అధికారులను, ఉద్యోగులను ఎసిబి యంత్రాంగం పట్టుకోని రోజు ఉండదంటే అతిశయోక్తి కాదు. దీనికి సంబంధించి రోజూ మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. వేలాదిమంది లంచగొండుల్లో ఒక్కరో ఇద్దరో దొరుకుతారు, అదీ బాధితులు ఇచ్చే సమాచారం మేరకు ఎసిబి అధికారులు ‘వల’ పన్ని పట్టుకుంటారు. లంచగొండి అధికారులు, ఉద్యోగులు జనం నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తామే తీసుకుంటున్నా- ఇతరులకు ఇందులో వాటా ఉందని చెబుతుంటారు.

03/01/2017 - 00:13

మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్) ప్రాంగణంలో తలదాచుకుంటున్న తెలుగు భాషా పీఠాన్ని నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలించేందుకు వెంటనే తగుచర్యలు తీసుకోవాలి. తెలుగు భాషకు 2008లోనే ప్రాచీన భాషాహోదా లభించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో వివాదం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.

Pages