S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/06/2017 - 01:14

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టి పట్టుమని పది రోజులైనా కాలేదు. ఆయన చెలరేగి నృత్యం చేస్తున్న రీతిలో ఎడాపెడా జారీచేస్తున్న అధికారిక ఆదేశాలతో అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ కంపిస్తున్నాయి. ఇతర దేశాలతో ఉన్న సంబంధాల్ని సమూలంగా మార్చివేసే తన సొంత బాణీ రాజనీతిని అమలుపర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు లాభం కన్నా ఎక్కువ నష్టానే్న కలగజేసేవిగా ఉన్నాయి.

02/04/2017 - 00:38

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల బైఠాయించిన సందర్భంగా విపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు పిల్లచేష్టలను తలపించాయి. ‘మీరు సిఎంను టచ్ చేస్తున్నారు.. నా రాజకీయ హక్కులను హరిస్తున్నారు.. రెండేళ్లలో నేనే ఎపి సిఎం అవుతా.. ఇప్పుడు నన్ను అడ్డుకున్న పోలీసులందర్నీ గుర్తుంచుకుని అప్పుడు వారి పనిపడతా.. మీలో ఎవర్నీ మరచిపోను..

02/03/2017 - 20:48

విశాఖ ప్రాంతీయులు చిరకాలంగా కోరుతున్న ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇకనైనా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ జోన్‌లో ఉన్న విశాఖపై రైల్వే అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ వస్తుందని కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రకటించినా ఆ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

02/02/2017 - 08:53

సాహస ధైర్య నిష్ఠాపరుడైన శాతకర్ణి అసలు సిసలైన సార్వభౌముడు! బ్రాహ్మణ వర్గీయులు అక్కన్న- మాదన్న మంత్రులుగా తమ ప్రతిభతో, చాతుర్యంతో రాజ్యపాలనకు మార్గదర్శకులైనారు. అటు రాజ్యాధికార ప్రభువులుగా, ఇటు మంత్రి పదవులు అలంకరించిన బ్రాహ్మణులు సవ్యసాచులు అనుటకు ఇదే నిదర్శనం. ‘శాతకర్ణి’ గురించి జ్వాలా నరసింహారావు విశే్లషణ ఇందుకు చారిత్రక నిలువుటద్దం. దీనిని కాదనుటకు సాహసించేవారు ఎంతమంది?

02/01/2017 - 00:32

భారతజాతి అనేక వేల సంవత్సరాల నాటిది. ప్రపంచంలో ప్రప్రథమంగా భారతదేశం, భారత జాతి పుట్టింది. భారత జాతి నుండి అలనాటి సంస్కృతిని విడదీయలేము. సంస్కృతి, ఆచారాలు, సాహిత్యం, సమాజం, భౌగోళిక సరిహద్దులతో కూడిన భూ భాగం, పతాకం.. ఇవన్నీ ఉంటేనే ‘జాతి’ అని పిలువబడుతుంది. ఈ విధంగా ఆలోచిస్తే మనకు స్వరాజ్యం రాకమునుపు ఒక పతాకం ఉన్నదా? లేదా? ఉంటే- ఆ పతాకం ఏది? ఇప్పటి మన జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు.

01/31/2017 - 01:20

మన త్రివర్ణ పతాకాన్ని, హిందూ దేవతలను అవమానించే రీతిలో అమెరికన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ డోర్‌మ్యాట్‌లు, టీషర్టులు, బెర్ముడాలు, మద్యం గ్లాసులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్టు వస్తున్న వార్తలపై భారత ప్రభుత్వం గట్టిగా స్పందించాలి.

01/30/2017 - 01:12

జీవితాలను జీతాలతో సరిపెట్టుకోలేక ధన దాహంతో అవినీతికి పాల్పడుతూ లంచాలకు ఆశపడి చివరకు పట్టుబడుతున్నారు అనేక మంది అధికారులు. అయనా ఇంకా ఎంతోమంది లంచావతారాలు పుడుతూనే ఉన్నారు. నోట్ల రద్దుతో నల్లకుబేరులు ఎంతమంది బయటపడ్డారో, పత్రికలు ప్రచురించిన వార్తలు ఎంత సత్యమో ఆ దేముడికెరుక.

01/28/2017 - 03:37

నిత్యావసర సరకుల ధరలు భారంగా మారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం. కొన్నింటికి సంబంధించి ప్రభుత్వాలే ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తరచూ పెంచుతున్నారు. విద్యుత్ చార్జీలను మరోసారి పెంచాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ప్రజలు తప్పనిసరి అని భావించే వస్తువుల, సేవల ధరలను ఇలా పెంచడం భావ్యం కాదు.

01/27/2017 - 02:52

‘జల్లికట్టు’ పోరాటానికి, ప్రత్యేక హోదాకు పోలికేమిటని ఎపి సిఎం చంద్రబాబు మండిపడడం భావ్యం కాదు. కేంద్రంతో వ్యవహారం గనుక ఎపికి ప్రత్యేకహోదా సాధించడం అసాధ్యమని ఆయన భావించి ఉండాలి. జల్లికట్టు కోసం పోరాడిన తమిళ యువత నుంచి స్ఫూర్తి పొంది తెలుగు యువత అదే తీరులో ఉద్యమిస్తే రాష్ట్రం పరువు పోతుందని చంద్రబాబు అనుమానించడం అర్థరహితం.

01/26/2017 - 07:32

జలవనరుల సంరక్షణ అన్నింటికంటే ప్రధానమైనది. ఈ కారణంగానే తెలంగాణలోని ప్రతి ఇంటివద్ద ఇంకుడు గుంత ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. వేసవి కాలంలో వీటి నిర్మాణాల అవసరం మరింత ఉంటుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఇంకుతు గుంతలు కార్యరూపం ధరించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుపరిస్తే బాగుంటుంది. గత వేసవిలో వలే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Pages