S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

01/10/2020 - 01:37

‘‘వారాసిగూడకు వచ్చింది నిన్ను చూడడానికి అనుకున్నావా? కాదు కానే కాదు. బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచి మనం ఇక్కడ తిన్న వేడివేడి ఇడ్లీలను ఎప్పుడూ మరిచిపోను. ఎక్కడ తిన్నా ఆ రుచి రాదనుకో.. అయినా ఇవన్నీ నీకు తెలియనివా? కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. పద వెళదాం’’
‘‘అక్కడికి నేను రాను..’’

01/03/2020 - 01:46

‘‘రాత్రి అలసట ఇంకా తీరలేదేమో! బాగా అలసిపోయినట్టున్నావు?’’
‘‘నేనేమీ అలసిపోలేదు.. బాగా ఎంజాయ్ చేశాను.’’
‘‘అంత పెద్దబరువు భుజం మీద మోసుకొస్తే అలసిపోకుండా ఎలా ఉంటావు’’
‘‘నేనా? బరువు మోయడమా? మా ఆవిడ ఇంట్లో మంచినీళ్లు గ్లాసు ఇటు తీసి అటు పెట్టమంటేనే నా వల్ల కాదంటాను’’

12/27/2019 - 04:22

‘‘జీవితంలో ఏదో ఒకటి త్యాగం చేయాలని బలంగా అనిపిస్తుందోయ్’’.
‘‘ఎప్పటినుంచి ఈ రోగం. కడుపుతో ఉన్నవారికి మామిడికాయ, చింతకాయ లాంటి పుల్లని పదార్థాలు తినాలనిపించినట్టు త్యాగం చేయాలని నీకెప్పటినుంచి అనిపిస్తోంది?’’
‘‘నీకన్నీ వెటకారాలే. ఏం త్యాగం చేయాలో అర్థంకావడం లేదు. కానీ ఏదో ఒకటి త్యాగం చేయాలనిపిస్తోంది.’’

12/20/2019 - 05:44

‘‘ఏంటోయ్ విశేషాలు?’’
‘‘జబ్ ఖుదా దేతా హై తో చప్పడ్ పాడ్‌కే దేతా అంటారు’’
‘‘ఔను! అంటారు. భగవాన్‌కే కృపామే దేర్ హోగా మగర్ అందేర్ నహీ హోతా అని కూడా అంటారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కానీ. ఇలా తలా తోకా లేకుండా మధ్యలో నుంచి చెబితే ఏం అర్థం అవుతుంది. ఇంతకూ దేవుడు అంతగా చప్పడ్ పాడ్‌కే ఏమిచ్చాడో? ఎవరికిచ్చాడో ఆ మాట చెప్పు?’’

12/13/2019 - 03:35

‘‘ఏంటోయ్..! మేధావిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’

12/10/2019 - 23:26

‘అదిగో నవలోకం.. వెలసే మన కోసం
నీలి నీలి మేఘాల లీనమై...
దూర దూర తీరాలకు సాగుదాం...
ఎచట సుఖముందో ఎచట సుధగలదో
అచట మనముందామా....?’

11/29/2019 - 01:27

‘‘ఏంటోయ్.. అంత తీక్షణంగా చూస్తున్నావ్..?’’
‘‘ధర్మదాతల పేర్లు..’’
‘‘ఇందులోఉద్దేశ పూర్వకంగా బ్యాంకులను ముంచిన వారి పేర్లు ఉన్నాయి కదా? ధర్మదాతలని అంటావేం?’’

11/22/2019 - 05:10

‘‘జీవితం బుద్భుద ప్రాయం’’
‘‘ఔను..!’’
‘‘జీవితం సంక్లిష్టమయం’’
‘‘ఔను..!’’
‘‘జీవితం అంటే కష్టాలు, కన్నీళ్లే కదా?
‘‘ఔను..!’’
‘‘పుట్టినప్పుడు ఏడుస్తాం, పోయేటప్పుడు ఏడిపిస్తాం. రెండు ఏడుపుల మధ్య కాలమే కదా? జీవితం అంటే’’
‘‘ఔను..!’’
‘‘బాధలు, ఏడుపులు లేని జీవితమే లేదా?’’
‘‘ఔను..!’’

11/15/2019 - 01:26

‘‘నీకో బ్రహ్మాండమైన బిజినెస్ ఐడియా..?’’
‘‘చెప్పి పుణ్యం కట్టుకోరా!’’
‘‘ఎడ్యుకేషన్ బిజినెస్.. నీకో విషయం తెలుసా? చట్టప్రకారం ఎడ్యుకేషన్ బిజినెస్ చేయకూడదు. కానీ ఎడ్యుకేషన్ బిజినెస్‌లోనే ఎక్కువ లాభం’’
‘‘నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఈ వ్యాపారాన్ని చైతన్యవంతులైన నారాయణులు ఎప్పుడో ఆక్రమించేసుకున్నారు. ’’

11/08/2019 - 01:51

‘‘ఏంటీ.. ఇన్ఫోసిస్‌లో ఏదో గోల్‌మాల్ అట..!’’
‘‘ఇన్ఫోసిస్‌లో గోల్‌మాల్ లేదు కానీ.. అలాంటి వార్తలు రావడం వెనుక ఏదో గోల్‌మాల్ ఉందనిపిస్తోంది. రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు కూడా ఇదే అనుమానం వచ్చింది..’’
‘‘అస్సలు అర్థం కాలేదు. ఆ ఝున్‌ఝున్‌వాలా ఎవరో అస్సలే తెలియదు’’

Pages