S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

08/23/2019 - 02:04

‘‘ఈ లోకంలో అధికారం ఉన్నవాడు చెబితే రైట్, అధికారం పోయినవాడు చెబితే నవ్వులాటగా ఉంటుంది’’
‘‘ఏమైంది? ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఎవరు నవ్వారు?’’
‘‘నాకేమైనా అధికారం ఉందా? ఇప్పుడు పోవడానికి. నా గురించి కాదు. నేనెప్పుడూ నా గురించి ఆలోచించను. లోకం తీరు గురించి ఆలోచిస్తాను’’

08/16/2019 - 02:04

‘‘ఇంకెందుకోయ్ అంత దిగులు? మనం చిన్నప్పటి నుంచి జోకులేసుకునే వాళ్లం. కశ్మీర్ సమస్య, తెలంగాణ సమస్యకు ముగింపు ఉం టుందా? ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా? అని. దీనిపై సినిమాల్లోనూ డైలాగులున్నాయి. 2014లో తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికింది, మరో ఐదేళ్లకు కశ్మీర్‌కు ఏదో ఒక పరిష్కారం అయితే చూపారు. ఇది లాభమా? నష్టమా? అన్నది కాలమే చెబుతుంది. ఇంకా నీలాంటివాడు దీర్ఘంగా ఆలోచించాల్సిన సమస్య ఏముంది?

08/08/2019 - 22:39

‘‘ఊరందరిదీ ఒకదారి ఐతే ఉలికి పిట్టది ఇంకోదారిలా.. సందట్లో సడేమియాలా..’’
‘‘దేని గురించి.. ?’’
‘‘దేశమంతా కశ్మీర్ గురించి ఆలోచిస్తుంటే వర్మ మాత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రయల్ శుక్రవారం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. పైగా మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ సినిమానట’’
‘‘నాకు కేతిగాడు గుర్తుకొస్తున్నాడురా!’’

08/02/2019 - 01:58

‘‘ముఖంలో అంత వైరాగ్యం ఎందుకు?’’
‘‘చిత్రంగా ఉందే? మాటల్లో వైరాగ్యం కనిపిస్తుంది కానీ, ముఖంలో ఎక్కడైనా వైరాగ్యం కనిపిస్తుందా? ముఖంలో కనిపించేది దిగులు. వైరాగ్యం కాదు. ’’
‘‘భాషలో ఏముంది? భావం ముఖ్యం. నేనేం అడగాలనుకున్నానో నీకు అర్థం అయింది. అది చాలు. దిగులైతేనేం, వైరాగ్యమైతేనేం.. నువ్వు ఏదో ఆలోచిస్తూ దిగులుపడుతున్నావనేది మాత్రం నిజం’’

07/26/2019 - 02:12

‘‘అలా నవ్వుతూనే పోయేట్టుగా ఉన్నావ్? మరీ అంతగా పగలబడి నవ్వకు..’’
‘‘హా..హా..హా...’’
‘అదేంటో మాకూ చెప్పు.. మేమూ నవ్వుతాం’’
‘‘మూడ్ బాగా లేదు. మంచి అడల్ట్ జోక్ చెప్పమన్నాను’’
‘‘ఏం జోక్ చెప్పాడు? నాకూ చెబితే నవ్వుకుంటాను.’’
‘‘విలువలతో కూడిన రాజకీయాలు అని ఏకవాక్య జోకు చెప్పాడు.’’

07/19/2019 - 02:30

‘‘అంతగా నవ్వు తెప్పిస్తున్న వార్తలేమిటో? ఆంధ్రా అసెంబ్లీలో బుగ్గున జోకులా? అంబటి రాంబాబు విసుర్లా?’’
‘‘అవేమీ కాదు, అవి ఎప్పుడూ ఉన్నవే..’’
‘‘మరింకేంటి? వైఎస్‌ఆర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు చెప్పిన దాని గురించా?’’

07/12/2019 - 02:10

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ప్రవహిస్తుంటే నీకేమనిపిస్తుంది?’’
‘‘పాతిక రూపాయలిస్తే మినరల్ వాటర్ బాటిల్ వస్తుంది కదా? కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు ఖర్చు చేసింది బురద నీటి కోసమా? ఆ నీళ్లను ఎప్పుడు శుభ్రం చేయాలి? ఎప్పుడు వాటర్ బాటిల్స్‌లో పట్టాలి? ఖర్చు పెట్టిన వేలకోట్లు తిరిగి రావాలంటే ఎన్ని వాటర్ బాటిల్స్ కావాలి? ’’

07/05/2019 - 02:06

‘‘న్యూస్ పేపర్‌ను మింగేసేట్టు చూస్తున్నావ్? ఏంటో అంత ఆసక్తి?’’
‘‘ఏమీ లేదు..’’
‘‘ఏమీ లేకపోతేనే అంతలా చూస్తావా?’’
‘‘చూడోయ్.. పేపర్‌లో ఒక్కొక్కరికి ఒక్కోటి నచ్చుతుంది. లోకో భిన్న రుచి అన్నట్టు మనం ఎడమ నుంచి కుడికి రాస్తే, ఉర్దూలో కుడి నుంచి ఎడమకు రాస్తారు.’’
‘‘అసలు విషయం చెప్పు’’

06/28/2019 - 02:42

‘‘ఈ మనుషులు అస్సలు అర్థం కారు. తమిళం వాడో, మలయాళీ వాడో సినిమా తీస్తే ఆహో ఓహో సినిమా అంటే ఇలా ఉం డాలి..అని తెగ పొగిడేస్తాం. వాస్తవ కథలు అంటూ పేజీలకు పేజీలు రివ్యూలు రాసేస్తుంటాం. అదే తెలుగువాడు వాస్తవిక కథతో సినిమా తీస్తే చూసేవాడుండడు. ‘మల్లేశం’ సినిమాకు బాహుబలి రేంజ్‌లో సమీక్షలు వచ్చినా, థియోటర్లలో పరిస్థితి వేరుగా ఉందట! డబ్బులు రాల్చని రివ్యూలు ఎంత అద్భుతంగా ఉంటేంది?

06/21/2019 - 01:59

‘‘పె ళ్లికి వెళ్లడం, రావడం కూడా ఐపోయిందా? మా రోజుల్లో ఐతే పెళ్లంటే వారం రోజులు జరిగేది. నెలముందే ఇళ్లంతా బంధువులతో సందడిగా ఉండేది. అబ్బో.. ఆ మర్యాదలు, ఏర్పాట్లు, హడావుడి.. వాటితో పోలిస్తే ఇవి కూడా పెళ్లిళ్లా? అనిపిస్తుంది. ఒకరోజులోనే పెళ్లి ముగిసిపోతోంది. అరగంటలో హాలంతా ఖాళీ.. అటెండెన్స్ కోసం కనిపించినట్టు వచ్చి మాయమవుతున్నారు. ఆ రోజుల్లో ఊళ్లో పెళ్లంటే గ్రామంలో ఎవరింట్లోనూ వంట ఉండేది కాదు..

Pages