S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

11/04/2019 - 18:36

మనం ప్రతిరోజూ తినే తాజా కూరగాయల్లో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్ వంటివి తింటే ఎటువంటి రోగాలూ దరిచేరవు. ఇందులో ఉండే విటమిన్ ‘ ఎ’ కంటికి మేలు చేస్తుంది. క్యారెట్‌ను పరగడుపునే పచ్చిగా తింటే ఇంకా మంచిది. ఇందులో కెరోటిన్ అనే పోషక పదార్థం అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటిచూపు మందగిస్తుంది. అదే విటమిన్ సమృద్ధిగా ఉండే క్యారెట్ కంటికి, వంటికి చాలా మంచిది.

10/31/2019 - 18:35

అజీర్తి, ఎసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. ఎసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. ఒకవేళ మీరు ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించాలి.

10/30/2019 - 18:47

మిగిలిన భాగాలతో పోలిస్తే మోకాళ్లు, మోచేతుల వద్ద చర్మం మందంగా, నల్లగా ఉంటుంది. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మోకాళ్ళ, మోచేతుల వద్ద నల్లగా మారిన చర్మం సైతం పలుచబడి, నునుపుగా తయారవుతుంది.
* చెంచాడు కొబ్బరి నూనె, అరచెంచా నిమ్మరసం కలిపి మోకాళ్లు, మోచేతుల వద్ద రుద్ది, వేడినీళ్లలో ముంచిన టవల్‌తో తుడవాలి. ఇలా వారానికోసారి చేస్తే సమస్య తొలగిపోతుంది.

10/29/2019 - 18:57

కాలానికి అనుగుణంగా వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు నిలకడగా ఉన్న ధరలు.. నేడు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న వస్తువుల్లో గ్యాస్ కూడా ఒకటి. మొన్నటివరకు ఒక మోస్తరు ధర పలికిన గ్యాస్.. నేడు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. అలాంటప్పుడు గ్యాస్‌ను ఎంత పరిమితంగా వాడుకుంటే అంత మంచిది. అలా అని వంటకాలు చేయకుండా ఉండటమని కాదు అర్థం..

10/29/2019 - 18:54

గారెలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చలి వాతావరణంలో అయితే వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకుని తింటారు. వీటిని తింటున్నప్పుడు కరకరలాడితే.. ఎంతో మజాగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో గారెలు కరకరలాడవు. ఇలాంటి సమయంలో కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లయితే గారెలు కరకరలాడతాయి. అవేంటో చూద్దామా..
* గారెలు కరకరలాడాలంటే గారెల పిండిలో కొద్దిగా సేమ్యాను కలుపుకోవాలి.

10/28/2019 - 18:47

ప్రతి ఇంట్లోనూ.. ముఖ్యంగా వంటింట్లో బొద్దింకలు పెడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ప్రతి మహిళకు ఇది చాలా పెద్ద సమస్య. ఇల్లు, వంటిల్లు ఎంత శుభ్రంగా ఉన్నా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. వాటిని నివారించడం పెద్ద సమస్య. అలాంటి బొద్దింకలను చిన్న చిన్న చిట్కాల ద్వారా ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.

10/23/2019 - 18:45

కంటి చుట్టూ చాలామందికి నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఇవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు తెలుసుకుంటే తగ్గించుకోవడం సులువవుతుంది. ఈ సమస్య ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తుంది. అలాగే ఆలస్యంగా పడుకోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి, అలర్జీలు, కళ్లు నలిపినప్పుడు ఇలాంటి వలయాలు రావచ్చు. వీటితో పాటు సైనస్, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, రక్తహీనత, ఆస్తమా, డీహైడ్రేషన్..

10/22/2019 - 18:42

పల్లెలు, తండాలు, అడవిలో ఉండేవారి నుంచే ఒకప్పుడు తేనె లభించేది. ఇప్పుడు ప్రతిచోటా తేనె లభిస్తుంది. తేనె ఇప్పుడు మార్కెట్‌లో సులువుగా దొరికే వస్తువుగా మారిపోయింది. అందులో కూడా చాలా బ్రాండ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా లభించే తేనె మంచిదేనా? వాటివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఎలాంటి తేనె కొంటే మంచిదో.. ఒకసారి తెలుసుకుందాం..

10/21/2019 - 19:46

దేశంలో దోసెలకు ఏమేర డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే.. బియ్యపు పిండితో తయారయ్యే ఈ దోసెల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషక విలువలు ఉండటంతో పాటు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇక వండటం కూడా సులభమే కాబట్టి.. చాలావరకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో దీనే్న తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇక ఇళ్లల్లో అయితే మూడురోజులకు సరిపడా పిండిని తయారుచేసుకుని పెట్టుకుంటారు. అయితే మొదటిరోజు వరకు పిండి బాగానే ఉంటుంది కానీ..

10/18/2019 - 19:28

* బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
* టొమాటో రసాన్ని, నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి కళ్లచుట్టూ పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మిశ్రమం రోజు విడిచి రోజు పూస్తే మంచి ఫలితం ఉంటుంది.

Pages