S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

04/07/2019 - 22:22

* జుట్టు ఆధారితంగా కండీషనరును ఎంచుకోవాలి. అది జుట్టును నునుపుగా, మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుంది. తలస్నానం తరువాత తడి జుట్టుపై కండీషనర్ ఉపయోగించడం మంచిది.

04/04/2019 - 19:10

నిద్రలేమి అనేక జబ్బులకు దారి తీస్తుంది. నిద్ర సక్రమంగా వస్తే రోజంతా హాయిగా పనులు చక్కబెట్టుకోవచ్చు. లేకుంటే తల బరువుగా ఉండటం, ఆవలింతలు రావడం, ఏ పనీ చేయబుద్ధి కాకపోవడం, నీరసంగా ఉండటం వంటివి తలెత్తుతాయి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలాంటి ఒత్తిడిలు ఉండకూడదు. సమయానుసారం నిద్రకు ఉపక్రమించాలి. దీంతో నిద్ర సరిగా పడుతుందంటారు వైద్యులు.

04/03/2019 - 18:49

ప్రతిరోజూ క్రమం తప్పకుండా పండ్ల జ్యూస్ తాగితే చర్మం నిగారిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే పండ్ల రసాన్ని ఫేషియల్‌గా ఉపయోగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రకృతి సౌందర్యం కూడా. దీనివల్ల చర్మానికి, శరీరానికి ఎటువంటి హానీ జరగదు. నేడు చాలామంది చర్మ సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను ఎక్కువగా వాడటం వల్ల, అందులోని రసాయనాలతో ముఖంపై చర్మం దుష్ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.

04/02/2019 - 20:02

ఆహార విషయంలో సరైన అవగాహన, శ్రద్ధ లేకపోవడం వల్ల, ప్రకృతి వైపరిత్యాల వల్ల అనారోగ్యానికి గురికావడం జరుగుతుంది. అనారోగ్యానికి ప్రధానమైన కారణం మలబద్ధకం. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే మలబద్ధకం నుండి తప్పించుకోవచ్చు.

03/31/2019 - 23:12

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఒత్తిడి వంటి ప్రతికూల ప్రభావాలతో బాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. శరీరంలోని మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగులు మారతాయి. వృద్ధుల్లో మెలనిన్ ఉత్పత్తి ఆగిపోయి జుట్టు తెల్లబడుతుంది.

03/27/2019 - 19:25

టీనేజీ అమ్మాయిలు గోళ్ల అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నెయిల్ పాలిష్‌ని ఉపయోగించడంలో మెలకువలు తెలుసుకోగలిగితే మరింత చక్కగా వాటిని ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..
* కొందరు గోళ్లరంగు వేసుకుంటే అది చర్మంపైన కూడా అంటుకుంటుంది. అలాంటప్పుడు వాడేసిన లిప్‌బ్రష్‌ను నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచి రంగుపై అద్దితే సరిపోతుంది.

03/26/2019 - 19:07

వేసవికాలం వచ్చేసింది. వేడి, ఉక్కపోతలు పెరిగాయి. ఈ ఎండలో ఎక్కువసమయం నిలబడటం వల్ల చర్మం కందిపోతుంది. సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది ఒక వర్ణద్రవ్యం. ఇది చర్మ, వెంట్రుకల, కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో మెలనిన్ సరిపోయేంత స్థాయిలో వేగంగా ఉత్పత్తి జరగదు.

03/22/2019 - 21:41

* సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, స్థూలకాయం, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు... నేడు చాలామంది గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి ఏవేవో మందులను వాడుతుంటారు. ఈ మాత్రలు తీసుకోవడంవలన సమస్యలు తగ్గినా... సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొందరు చెబుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే కింద పేర్కొన్న కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి.

03/18/2019 - 19:53

కొన్ని రకాల వంట నూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సొన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ‘ఇ’వల్ల ఆరోగ్యానికెంతో మేలని పోషకాహార నిపుణులు అంటున్నారు.

03/17/2019 - 22:53

ద ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ద బేబీ ఆయిల్‌ని కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.
ద కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

Pages