S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

11/08/2018 - 18:36

భారతీయులు తులసి మొక్కను సౌభాగ్యానికి ప్రతీకగా, ఎంత పవిత్రంగా కొలుచుకుంటారో అందరికీ తెలిసిందే.. అలాగే తులసి మొక్కలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో కూడా తెలిసిన విషయమే.. అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నందు వలన తులసిని పురాతన కాలం నుండే ఆయుర్వేద ఔషధాల తయారీలో విరివిగా వాడుతున్నారు. మరి అలాంటి తులసి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దామా..!

11/02/2018 - 20:20

గుండె పదికాలాలపాటు ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే క్రమం తప్పకుండా రోజూ గుప్పెడు గింజలను తినండి అని చెబుతున్నారు వైద్యులు, పోషక నిపుణులు. గింజల్లో ఉండే అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అందుకే మునుపు స్వీట్లలోనూ, పాయసాల్లోనూ కనిపించే డ్రైఫ్రూట్స్.. ఈ మధ్య అన్ని ఇళ్లల్లోనూ స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి.

10/31/2018 - 19:50

సన్ టాన్‌ను తొలగించుకోవడానికి నిమ్మరసం, దోసకాయ రసం, గులాబీ నీటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు, చేతులపై అప్లై చేయాలి. పది, పదిహేను నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ మిశ్రమం సన్ టాన్‌ను తొందరగా పోగొట్టడానికి సహకరిస్తుంది. నిమ్మరసాన్ని సన్ టాన్ ఉన్న దగ్గర రాస్తూ మసాజ్ చేసి పది, పదిహేను నిముషాల తర్వాత ఆ సొల్యూషన్ అంతా ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

10/30/2018 - 19:36

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.
* రెండు చెంచాల శనగపిండిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత ముఖాన్ని నెమ్మదిగా రుద్దుతూ కడిగేయాలి. ఈ పూతను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం కాంతులీనుతుంది.

10/28/2018 - 23:24

మన భారతీయం ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేయమంటుంది. సూర్యనమస్కారాలు చేస్తే యోగాసనాలు త్వరగా అబ్బుతాయ. ప్రతిరోజు కాస్తంత నడక, కాస్తంత వ్యాయామం తో మానసికంగాను, శారీరికంగాను ఆరోగ్యంగా ఉండవచ్చు. వర్షాకాలం, చలికాలం శ్వాసకోశ వ్యాధులు చలి, వర్షాకాలాల్లో మరింత ప్రభావాన్ని చూపుతాయి. వీటి నుంచి తప్పించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలే చక్కని ఉపశమన మార్గాలంటున్నారు యోగానిపుణులు.

10/25/2018 - 19:11

స్ర్తిలు, పురుషులు అందరూ క్షణం తీరికలేకుండా ఈ యాంత్రిక ప్రపంచం లో పరుగులు తీస్తూన్నారు. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితాలు అయిపోతున్నాయి. వాటితో పాటు మనిషి సరియైన వ్యాయామం లేక ఎన్నో జబ్బుల బారిన పడుతున్నారు. చాలామంది ఊబకాయలుగా మారుతున్నారు. మరికొద్దిమంది వయస్సు తగ్గ ఎదుగుదల లేకుండా ఉంటున్నారు. వీటిఅన్నింటికీ కారణం ఏమిటి అంటే నిపుణులు... మనిషి శారీరిక శ్రమకు దూరమవుతున్నాడు.

10/14/2018 - 23:53

రోజువారీ అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవడం వల్ల ఇంట్లో విద్యుత్తుని, నీటిని ఆదా చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించుకోవచ్చు. విద్యుత్తు, నీటిని అధికంగా వినియోగించే వాటిలో బాత్‌రూములతో పాటు, వాటర్ హీటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు చాలా ఉన్నాయి.

10/10/2018 - 19:03

పండ్లను తిని గింజలు విసిరేయడం ఎవరైనా చేసే పనే. అయితే గింజలను దాచుకుని, తిన్న వాడే అసలుసిసలు ఆరోగ్యవంతుడు అంటున్నారు నేటి న్యూట్రిషనిస్టులు. శరీరానికి అవసరమైన పోషణ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. అయితే ఏ ఏ గింజలు తింటే ఏ పోషకాలు లభిస్తాయో చూద్దాం..

పుచ్చకాయ

10/09/2018 - 19:26

తీపి అంటే చాలామందికి చాలా మక్కువ. కానీ దీనివల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతివ్యక్తీ రోజుకు కేవలం ఆరు స్పూన్ల పంచదారను మాత్రమే వాడాలని చెబుతోంది. ప్రస్తుతం ఏ డాక్టరు అయినా చక్కెరకు దూరంగా ఉండమనే చెబుతున్నాడు. సాధారణంగా చక్కెర, మైదా, అన్నం, ఉప్పులను కలిపి వైట్ డెవిల్స్ అంటారు.

10/08/2018 - 03:37

వర్షాకాలం, చలికాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరాన్ని మోసే పాదాల్లో పగుళ్లు రావడం, అవి నీళ్లలో నాని చివికిపోయి, వాసన రావడం సహజం. మొదట్లో ఇది సమస్యగా అనిపించకపోయినా తరువాత పెనుసమస్యగా మారే అవకాశముంది. చాలా సమయం నీళ్లలో పనిచేయడం వల్ల ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాదాలను సంరక్షించుకోవచ్చు.

Pages