ఐడియా

డబుల్ చిన్‌కు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖం ఎంత అందంగా ఉన్నా ‘డబుల్ చిన్’ అంటే మాత్రం ఆ వదనంలో ముగ్ధత్వం కనిపించదు. అందుకే ఎంత అందంగా ఉన్నవారు కూడా కాస్త డబుల్ చిన్ కనిపించగానే దీని నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తుంటారు. కొందరికి డబుల్ చిన్ వయసు వల్ల వస్తే.. మరికొందరికి జన్యుపరంగా సంక్రమిస్తుంది. అయితే డబుల్ చిన్‌ను తగ్గించే కొన్ని టిప్స్ ఉన్నాయి. డబుల్ చిన్ రావడానికి వయసు, డైట్, శరీర బరువు, వ్యాయామాలు చేయకపోవడం, చర్మం వదులుకావడం, జన్యుపరమైన అంశాలు ముఖ్య కారణాలు. శరీరంలోని ఇతర భాగాల ఎలాగైతే వ్యాయామం అవసరమో.. ఫేషియల్ కండరాలకు కూడా నిత్య వ్యాయామం అవసరం.
* ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారడమే కాకుండా టోనింగ్ కూడా బాగా అవుతుంది. * చర్మం ఆరోగ్యకరంగా, మృదువుగా ఉండటంతో పాటు గడ్డం కింది కొవ్వు వల్ల ఏర్పడే ముడతలు కనపడకుండా తరచూ స్కిన్ కేర్ పద్ధతులను అనుసరించాలి.
* ఈ సమస్య ఉన్నవారు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. జంక్‌ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి.
* డబుల్ చిన్‌ని చాలామంది అందానికి సంబంధించిన అంశంగానే చూస్తారు తప్ప వైద్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చునని ఆలోచించరు. కానీ డబుల్ చిన్ సమస్యను అధిగమించడానికి సురక్షితమైన రకరకాల వైద్య సౌకర్యాలు ఉన్నాయి.
* గడ్డం కింది భాగంలో చేరిన కొవ్వును తొలగించుకునేందుకు నాన్ - ఇనే్వసివ్ చికిత్సలను వైద్య నిపుణులు చేస్తున్నారు. వీటిల్లో డైట్, వ్యాయామాలు వంటి సింపుల్ టెక్నిక్స్ సైతం ఉన్నాయి.
* డబుల్ చిన్ పరిష్కారానికి క్రియోలిపోలసిస్ చేస్తారు. ఇది పాపులర్ ప్రొసీజర్. లేజర్ రిడక్షన్ ప్రక్రియ ద్వారా కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. అలాగే డబుల్ చిన్ పరంగా కొన్ని తాత్కాలిక చిట్కాలు కూడా ఉన్నాయి.
* ఫొటోల్లో డబుల్ చిన్ కనపడకుండా ఉండాలంటే ఎదురుగా నిలుచుని కింద నుంచి ఫొటోలు తీయకుండా పై యాంగిల్లోంచి తీయాలి. అలాగే పార్టీలకి వెళ్లినప్పుడు ఎవరైనా ఫొటోలు తీస్తున్నప్పుడు ముఖం కొద్దిగా పైకి ఎత్తినట్టు పెడితే చర్మం కొద్దిగా టైట్ అయి డబుల్ చిన్ కనిపించదు. అలాగే మాట్లాడేటప్పుడు ముఖం కొద్దిగా పక్కగా పెట్టి గడ్డం కింద చేయి ఉంచి మాట్లాడడం వల్ల చేయి అడ్డుగా ఉండి డబుల్ చిన్ అంతలా కొట్టొచ్చినట్టు కనపడదు.