S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/19/2018 - 01:07

టెహరాన్, ఫిబ్రవరి 18: ఇరాన్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 66మంది దుర్మరణం చెందారు. దేశంలోని జాగ్రోస్ పర్వతాల్లో అసేమన్ ఎయిర్‌లైన్స్ విమానం ఇపి 3704 కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. టెహరాన్ నుంచి బయలు దేరిన ఈ విమానం 45నిముషాల్లోనే రాడార్‌కు కనిపించకుండా పోయిందని అధికారులు తెలిపారు.

02/18/2018 - 00:42

పాకిస్తాన్, ఫిబ్రవరి 17: పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఆరేళ్ల బాలిక జైనాబ్ అన్సారీపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ముద్దాయి ఇమ్రాన్ అలీకి నాలుగు మరణ శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అపహరణ, అత్యాచారం, హత్య, తీవ్రవాద చర్యలకు పాల్పడ్డట్టు నిర్ధారిస్తూ నాలుగు మరణశిక్షలు విధించిన కోర్టు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న నేరానికి గాను యావజ్జీవ శిక్షతోపాటు భారీ జరిమానా విధించింది.

02/17/2018 - 01:05

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 16: అస్తమా సమస్యతో బాధపడే మహిళలు గర్భిణులు కావడానికి ఎక్కువ కాలమే పడుతుందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. ఈ సమస్య కలిగిన మహిళలు సంతానలేమికి గురయ్యే అవకాశం కూడా ఉండొచ్చని శ్వాసకోశ సంబంధిత వైద్య పత్రికలో ప్రచురితమైన ఓ వ్యాసంలో నిపుణులు స్పష్టం చేశారు.

02/17/2018 - 01:02

వాషింగ్టన్, ఫిబ్రవరి 16: నాలుగేళ్ల వయసులోగా హృద్రోగ శస్తచ్రికిత్స అవసరమయ్యే పిల్లలు అనంతర కాలంలో బధిరులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తాజా సర్వే స్పష్టం చేసింది. నాలుగేళ్లలోపు పిల్లలకు గుండె ఆపరేషన్ జరిగితే వాళ్లలో సాధారణంగానే చెముడు వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.

02/16/2018 - 02:12

నేపాల్ కొత్త ప్రధానిగా గురువారం బాధ్యతలు చేపట్టిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఖడ్గ ప్రసాద్ వోలీ. చిత్రంలో మాజీ ప్రధాని షేర్ బాహదూర్ దేవుబా

02/16/2018 - 01:25

బీజింగ్, ఫిబ్రవరి 15: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడంపై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ఒక భాగమని చెప్పిన చైనా ఆ ప్రాంతంలో భారత్ ఎటువంటి చర్యలకు పాల్పడినా ఇరుదేశాల మధ్య ఉన్న ‘సరిహద్దు’ వివాదం మరింత సంక్లిష్టంగా మారుతుందని హెచ్చరించింది.

02/16/2018 - 00:40

వాషింగ్టన్, ఫిబ్రవరి 15:అమెరికాలో తుపాకుల సంస్కృతి మరోసారి మారణహోమం సృష్టించింది. తనను పాఠశాల నుంచి బహిష్కరించారన్న అక్కసుతో తొమ్మిదవ తరగతి చదువుతున్న మాజీ విద్యార్థి నికోలస్ క్రుజ్ (19) తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 17మంది మరణించగా పెద్దసంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు.

02/14/2018 - 05:28

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 13: ముంబయిలో జరిగిన భయానక ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు దారికొచ్చింది. ముంబయి పేలుళ్లకు సంబంధించి సరుూద్ ప్రమేయాన్ని రుజువు చేసే సాక్ష్యాధారాలను భారత్ అందించినా ఇంతవరకూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. భారత్ అందించిన సాక్ష్యాధారాల ఆధారంగా అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లకు తలొంచి హఫీజ్ సరుూద్‌ను ఓ ఉగ్రవాదిగా ఎట్టకేలకు ప్రకటించింది.

02/13/2018 - 03:53

మస్కట్, ఫిబ్రవరి 12: భారత్ ఒమన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అన్ని అంశాల్లోనూ బలమైన సంబంధాలకు తన పర్యటన పునాది అవుతుందన్న ధీమాను భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఒమన్ అగ్రనాయకత్వంతో తాను జరిపిన చర్చలు ఇందుకు పూర్తిస్థాయిలో దోహదం చేయగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పర్యటన తనకు చిరస్మరణీయ స్మృతిగా మిగిలిపోతుందని తన రెండు రోజుల ఒమన్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు.

02/13/2018 - 03:52

మస్కట్, ఫిబ్రవరి 12: పశ్చిమాసియా దేశాల్లో పర్యటనలో భాగంగా మస్కట్ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ 125 ఏళ్లనాటి శివాలయాన్ని దర్శించుకున్నారు. దుబాయి నుంచి ఇక్కడకు చేరుకున్న మోదీకి మస్కట్‌లో ఘన స్వాగతం లభించింది. మత్రాహ్ ప్రాంతంలో వేంచేసిన ఆలయాన్ని దర్శించుకుని శివుని ఆశీస్సులు అందుకున్నట్టు ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘మస్కట్‌లో శివాలయాన్ని సందర్శించి నేనేంతో అనుభూతిని పొందాను.

Pages