S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/18/2019 - 21:50

నీ ప్రపంచంలో నువ్వుంటావని
మిత్రులు బంధువులు అంటూ వుంటే
చిన్న పాప తెల్లకాగితంపై
గీసిన ఆకారం లేని గీతల్లాగా
చిక్కుపడ్డ దారంలాగా
ఆలోచనలు కమ్ముకున్నాయ

అప్పుడే మనసు మాటలాడింది
మెరుపులా ప్రశ్నించింది కూడా
నీది నిజంగా ఏ లోకమని
నాలో ఉండీ ఎలా అడిగావని
ఉరుములా గర్జిద్దామనుకున్నా
కాని తనని ప్రశ్నించలేదు
ఆ సాహసం చేయలేను మరి

03/11/2019 - 02:10

ఆర్థినీ, ఆలంబననూ
అమ్మలో ఆవిష్కరిస్తూ
ఒద్దికనూ, ఓదార్పునూ
ఆలిలో అనుగ్రహిస్తూ
‘మహిని..’ తనలో నింపుకుంది మహిళ మహిమాన్వితులాయ్యింది సబల.

03/11/2019 - 02:08

అలను తాకి ఆలకించు
అపురూప నాదాలు
ధరణినాస్వాదించు
దాగి వుంది మమత
అందలాన్ని ఆహ్వానించు
అందించును పులకరింత
అగ్నిని ఆరాధించు
యజ్ఞమై మేల్కొలుపు
గాలిని శ్వాసించు
గాంధార్వమై పలుకు
ప్రకృతిలో వనరులన్నీ
పరహితమే కోరు
మానవుడికేమయంది
ఇంత దగాకోరు!
హద్దులు దాటిపోయె
అత్యాశా వికారాలకు
అవధులు కూలిపోయె

03/11/2019 - 02:08

అమ్మవడి కమ్మదనం పొందుతున్న
తరుణంలో మరో అమ్మ చేతికి అప్పగించిరి
ఆర్థిక భారమో ఆడపిల్లలని అలుసో
అద్దెబిడ్డను చేసిరి
ఏ తప్పు ఎరుగని నాకు ఇంత పెద్దశిక్షేటో
ఈ చిన్న మనసుకు అవగతం కాలేదు
నిత్యం కళ్లు చెమ్మగిల్లి కన్నీటితో ఒల్లుతడిచేది
అద్దెబిడ్డనైనా అక్కున చేర్చి లాలించెను ఈ తల్లి
నా అదృష్టమేనేమో ఆనందాల జీవితం గడిచింది

03/04/2019 - 23:55

ఆకాశాన్ని శోధిస్తూనే
అఖాతాల్లోకి ముడుచుకుంటూ
శిఖరాలెక్కుతూనే
శిథిలాల్లోకి జారిపోతూ

ఏవేవో తరంగాల అలలపై
ఈదుతున్న సమూహాలు
సైబరక్వేరియంలో చేపలైన జీవితాలు
క్షణాలుగా క్షణాలుగా విడిపోతూ కలుస్తున్న
నగర కూడళ్లలో వాహనాలు

03/04/2019 - 23:53

పిడికిలి బిగించి కను తెరుస్తూ
స్వప్నాలన్నీ సాధించేయాలని
ఆశయాల సాధనా సమరంలో
ఉరకలెత్తే ఊపిరవ్వాలని ఉవ్విళ్లూరుతూ...

ఊత మొదిలి ఉరుకులు పరుగుల గాడిలో
జీవితపు పరీక్షల పాఠాలు,
పాఠాల పరీక్షల చట్రంలో
ఉన్నవాటిని ఖారు చేయక
లేని వాటికై వెంపర్లాడుతూ...

03/04/2019 - 23:51

ఎందుకు
కన్నీరు కారుస్తున్నావు?
కడుపుబ్బా నవ్వించినందుకా?
ఏడుపును నీ కళ్ళనుండీ
తగ్గించినందుకా?

03/04/2019 - 23:47

పేజీలు: 237, వెల: రు.150
ప్రతులకు:
భోగరాజు ఉపేందర్‌రావు
ఇం.నెం.11-10-694/5
బురహాన్‌పురం, ఖమ్మం
94947 73969
*

02/24/2019 - 21:27

ఏమీ తెలియదు
కలో నిజమో...
కలే కదా అనుకోలేం..
నిజమని కూడా.
ఒక గాలి వీచిపోతుంది.
నెమ్మదిగా బహు సుందరంగా
చెంపల్ని సుతారంగా తాకి...
కన్నులు మూతపడి కలలోకి వెళ్లిపోతాం
హాయ గొప్పదనం అది.
బహు జ్ఞానులు పలికేవి
అర్థాలు బోధపడని సత్యాలే కావొచ్చు
నీలి మేఘం తెలిపేది అనురాగమని కదా..
కమ్మని కల
కళ్ళు మూసుకుని మరీ చెప్పింది

02/24/2019 - 21:26

అతడు
నిజం తుపాకీనే ధరించేవాడు

కళ్లల్లో
దయా, జాలీ కనబడకుండా
టోపీ ధరించేవాడు

ముఖంలో
నవ్వు కానరానియ్యకుండా
అడ్డంగా శిరస్త్రాణం పెట్టుకునేవాడు

తననెవరూ గమనించకుండా
చెట్లు పుట్టలలో కలిసిపోయే
బట్టలు వేసుకునేవాడు

గంటల తరబడి
ఊపిరి బిగబట్టి
స్వేదాన్నీ, రక్తాన్నీ ప్రవహించకుండా ఆపేసేవాడు

Pages