S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/15/2019 - 23:18

నాలో నేను.. నాతో నేను
మాట్లాడి పోట్లాడుకోవాలె
నా ప్రశ్నల వర్షంలో
జవాబులు తానమాడి
కవితాక్షరాలై వెలసి
బతుకు వెతల్ని పేల్చి
ప్రేమానురాగాల్ని నింపాలె!
పదాల వెంట పరుగు
కాదేమో కవిత్వం
పదాలు పరవశంలో నీ వశమై
భావ ప్రవాహంతో
మది మడుల్ని తడిపి.. తడిమి..
వినూత్న ఆలోచనా చిగుర్లు
మొలిపించి మురిపించాలె!

04/15/2019 - 23:17

చిక్కిన కడుపుకు
గుప్పెడు మెతుకులు పెట్టలేని
అమృత ఘడియలెందుకు

మనిషి పుట్టుకను ఆపలేని
దుర్ముహూర్తం ఊసెందుకు

మంచి చెడులను నిర్థారించలేని
తిథుల కుతి ఎందుకు

జీవిత గమనానికి
దిక్సూచి కాలేని
హస్తరేఖల గోలెందుకు

అభాగ్యుల జీవితాల్లో
చిరునవ్వులు పూయంచలేని
చిలుక పలుకులెందుకు

04/08/2019 - 22:06

అతనికి అందరూ తెలియకపోవచ్చు
కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ
అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే...

04/08/2019 - 22:02

అది అక్షరాలను
సృష్టించే గర్భస్థలం
అచటి నుంచి
ఎన్ని అస్త్రాలు
ఆయువు పోసుకుంటున్నాయో
కాలానికే తెలుసు

అది పదాల పొదరిళ్లను
నిర్మించే విశ్వకర్మ క్షేత్రం
అచట సమాజాన్ని కదిపే
ఎన్ని శిల్పాలు సృష్టించబడుతున్నాయో
కాలానికే తెలుసు

04/08/2019 - 22:01

అలలు అలలుగా
అస్పష్టమే స్పష్టం అన్నంత స్పష్టంగా...
చుట్టూ అల్లుకున్న తెరల్లో...

నాది కాని నా ఉనికే నేనై..
నేను కాని నేనే అనంత విశ్వమై!

నిన్నటి నీడలే నీ ఉనికి అంటూ...
ఊపిరిని బంధించిన పంజరాలు
కనబడని సంకెళ్లతో కవాతులు!

ఊహలకు రెక్కలు తొడిగే ప్రయత్నంలో
పటపటమని తెగుతున్న
యుగయుగాల బంధనాలు

04/08/2019 - 21:59

నాకు కాసిని పూలమొక్కలున్నాయి
వాటి పరిమళాలున్నాయి
కొన్ని నవ్వులున్నాయి
బోలెడన్ని పువ్వులున్నాయి
ఆకాశముంది, ఇంద్రధనుస్సూ ఉంది
మేఘాలతో పరుగుపందెమేస్తూ
కువకువలాడే రెండు పక్షులున్నాయి
పుస్తకాలున్నాయి
వాటినిండా తొణికిపోయేటన్ని
అక్షరాలున్నాయి
నది ఉంది, దానిని దాటే పడవా వుంది

04/08/2019 - 21:56

ఎంత అందమైన జీవితమో
ఎంత బాగా జీవించారో
అన్నట్టు ఉంటుంది ప్రశాంత వదనం..

ఎవరికి తెలుసు ఆ తేజస్సు
ఒక్క నిమిషానిదేనని
చీకటిని దాటిన వెనె్నల వెలుగులన్నీ
విచ్చుకున్న నవ్వుల పువ్వులన్నీ
అక్కడే కురిశాయనీ
వెల్లి విరిసాయని
అర క్షణపు ఆనంద హేలయని!

04/01/2019 - 22:10

కనుచూపుల ‘కలువలు’
వికసించేదెప్పుడో...
చిరు పలుకుల ‘చినుకులు’
కురిసేదెన్నడో...
సిరి నవ్వుల ‘సవ్వడి’
వినిపించేదెప్పుడో...
ఆనంద వీచికలు
పల్లవించేదెప్పుడో...
అడుగులు కలిసి
నడిచేదెప్పుడో
ప్రియతమా -
ఆ మధుర క్షణాలకై
నా మనో గవాక్షాన్ని
తెరిచి ‘చకోర పక్షి’నై
నిరీక్షిస్తూనే ఉన్నా...

04/01/2019 - 22:05

తారాతరంగాల తాత్త్వికాభ
ఉషః ప్రవాహంలో మిళితమైన ఉదయ కమలాన్ని
సంగడించింది
స్మృతులు
నాడీ రక్త నదులీదుకుంటూ
ఒడ్డుమీద ఒత్తిగిలాయి
మరీచి మావి మరంత బిందువుల్ని చల్లుకుంటూ
ప్రభాత రుచుల్ని ప్రంపంచించే క్రమంలో పడ్డాడు
సౌమనస్య సందర్భాన్ని సమీక్షిస్తూ
అర్థాలమీద వాలుతున్న అనిమకాలు
కాళిదాసోపయల్ని నాదాంకితం చేస్తున్నాయి ...

04/01/2019 - 22:00

ఓర్పు హద్దుల్ని చెరపజూస్తే
తప్పు నిప్పులా రాజుకుంటుంది
కంటితుడుపు శాంతి సూత్రాలు
నోటితో వల్లిస్తూ నొసటితో వెక్కిరిస్తే
పరిణామం దీటైన సమాధానవౌతుంది!
కవ్వింపు చర్యలతో రచ్చకీడ్చి
ఒక్క ఛాన్సంటూ వెక్కిళ్ళు పెట్టే
గమ్మత్తు నాటకం లాగే తెరపడుతుంది
నిద్రపోతున్న పెద్దపులిని
ఆర్డీఎక్స్‌తో నిద్రలేపితే
మిరాజ్ ఆకలి నోటికి బలికావాల్సిందే

Pages