S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/26/2019 - 22:36

ఉప్పెన కెరటమై
కాశ్మీర్ శిఖరాలని తాకింది
కుంకుమ పువ్వు పరాగాన్ని
రక్తనాళాల్లో నింపుకుంది
యాపిల్ ఫల తోటలని
గుత్తులు గుత్తులుగా
రసాంకురాలకి అందించింది
పతాకాలకి ధవళ హిమకాంతుల్ని ప్రసాదించింది

08/26/2019 - 22:33

ఇరుకు గదుల్లో నుండి
ముత్యం లాంటి అక్షరం
నవ్వులు నవ్వులుగా భూమిపై పొర్లగానే
ఒక పెద్ద కొండ తన గాయాన్ని
ఒత్తుకుంటూ కనబడింది
గాయం అంటే
అలాంటి ఇలాంటి గాయం కాదు
భవిష్యత్తును మింగేసిన గాయం

08/26/2019 - 22:31

ఈ నూరేళ్ళలో గడియారం రామకృష్ణశర్మగారి వంటి సాహిత్య యోద్ధ మరొకరు ఏరీ? ఆయన జీవిత గాథ రమ్యాతిరమ్యం. తెలుగు భాషా సాహిత్యాభిమానులకు కనువిందు అక్షరమైన పసందు. వారి స్వీయ చరిత్ర పేరు ‘శత పత్రము’.

08/26/2019 - 22:27

వెతికేకొద్దీ
విశే్లషణకు అందని పరంపరలు
రూపాలేమిటో తెలియదు
అంతా అంతరంగ మథనమే...
దేహ పంజరం నిండా
అనియంత్రణలు
అనిర్వచనీయాలు
ముద్రాంకితాలు
సజీవ జీవన కళలు
తుడిపివేతలకు మాసిపోవవి
మననాలై ముందు నిలుస్తాయ
అసంకల్పిత పరితపనలెందుకు?
అవి పూసేవి సహజాతాలనే...
నిట్టూర్పులకు సెలవిచ్చి
ప్రాణాన్ని చిక్కబట్టి

08/26/2019 - 22:22

ఎవరో
తలుపు తట్టిన శబ్దం
తెరిచి చూస్తే
అద్భుతం!

ఎదురుగా నవ్వుతూ
నిండు జాబిలి!!
***
నిండుగ వెలిగే
నీ మోముని చూసి
జాబిలికి అసూయ!

తనకా అదృష్టం
మాసానికోసారేనని!!

08/19/2019 - 22:14

నిండు హృదయంతో
పుడమిని తన ఆనంద బాష్పాలతో
ప్రేమ కురిపించాల్సిన మేఘం
అప్పుడప్పుడూ
నాలుగు కన్నీటి చుక్కల్ని రాలుస్తోంది

అవునులే...
తను మాత్రం ఏం చేస్తుంది?
అంతులేని దురాశతో
అడవుల్ని, కొండల్ని మింగేసే
నరరూప రాక్షసులు
భూమిపై తిరుగుతూ
హృదయాన్ని గాయం చేస్తుంటే...

08/19/2019 - 22:12

భ్రమర డోలాకేళి పరిమళాక్షరరమ్య
గా నొప్పెగా! ఆదికవి కలాన;
బృందావనైక గోవిందాబ్దమై - పోత
న కలాన హలమరందంబు చిలికె;
సామాన్యు కడగండ్ల సద్భావ ‘నాముక్త
మాల్యదై’ - రాయలై - మసలెగాదె!
రస ‘సుగాత్రి’గ మహా ‘లయవిభాతి’గ - ‘కళా
పూర్ణోదయా’న సొంపులు వెలార్చె;
‘తరళ’, ‘విద్యున్మాల’ ‘్ధరాప్రసిద్ధ’ ప్ర
బం‘్ధభ్యుదయ’ ‘రామభద్రమ’య్యె;

08/19/2019 - 21:57

మన కథలలో
ఎన్ని విషయాలో
తిరగేద్దామనుకునేలోపే
కొత్త సంఘటనలు
పలకరిస్తాయ
బరువైనవీ తేలికపాటివీ
క్లిష్టమైనవీ అందమైనవీ
అందవిహీనమైనవీ
నమ్మకాన్నిచ్చేవీ
అయోమయమూ
ఉంటూనే ఉంటాయి
మనతో ప్రయాణం చేస్తూనే ఉంటాయి
అయన మన కథలో
చివరి పేజీకొచ్చేలోపు
ఇంకెన్ని సన్నివేశాలో, సంఘటనలో
గాయాలు నయం కావడానికి

08/19/2019 - 21:55

తరాలు మారినప్పుడల్లా
ఆకాంక్షలూ మారుతాయి.
ప్రవహించే కొద్దీ నదులకు
కొత్త పేర్లు మొలుస్తాయ
కనపడదు గాని
నిశ్శబ్దం కూడా కదుల్తుంది.

నిన్న నువ్వు పాడిన పాట
ట్యూన్ మార్చుకుంటుంది.
అర్థం అదే
సారాంశం మారుతుంది.

ఒకప్పుడు ఇల్లు
ప్రపంచమంత విశాలంగా ఉండేది,
ఇప్పుడు చిన్నగానే కాదు
చిన్నబోయ కూడా చూస్తుంది

08/05/2019 - 22:35

ఎంత దూరం పోయనా
వ్యష్టి సమాజంలోని సమష్టి వ్యాపకం ఒకటే
వ్యక్తి నుంచి వ్యక్తికి
వర్ణ పరిచ్ఛేదం చేసుకుంటున్న
వింత పోకడలన్నీ
వర్గ వ్యామోహాన్ని కౌగలించుకునే బ్రతుకుతున్నాయ
ఆవేశంగా మనుషుల్ని
అనవధిగా ఆకల్ని
స్వప్నాలు వెనకబడిపోతున్న అనర్ధ జాగరణల్ని
సామాజిక పైత్యానికి అనివార్య తర్కంగా
అమర్చుకున్న వేళ
ఉదయాన్ని జార్చుకున్న తూర్పు

Pages