S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/16/2019 - 22:54

నట్టింట
చిలుకుతున్న
పాడికుండ చుట్టూ
చెల్లాచెదురైన చల్ల చినుకులల్లే -

పరుచుకున్న
నీలాకాశ వస్తమ్రీద
చుక్కల వడియాలు ఆరబెట్టినట్టు -

కొత్త నీటికెదురెక్కి
మా చెరువులో
పిత్తపరిగ లెగిరి గంతేసినట్టు -

పితుకుతున్న
పొదుగునుండి
పాత్రలోకి పరుగులు తీసే
పాలధార్ల ఝరి శ్రావ్యమైన చిరు శబ్దమల్లె -

09/16/2019 - 22:53

చంటి పిల్లాడి తలపై
తల్లి కొంగు నీడ ఎంత చల్లనో -
తల్లి లేని సూర్యుడు
ఈ దృశ్యం చూసి
ఆర్ద్ర ఆర్ద్రంగా చల్లబడ్డాడు
తల్లి తలపైకి
మబ్బు ఛత్రం పట్టాడు!
ఆహా!
పిల్లాడికి తల్లి కొంగు నీడ..
తల్లికి మబ్బు గొడుగు నీడ!

09/09/2019 - 22:25

మెడ మీద అగుపించని
కత్తి వేలాడుతుంది

వ్యక్తిత్వాలను నిరసించే కాలం
ఉనికిని గుర్తించని వ్యవస్థ
‘నేను’ను నిట్టనిలువునా
పాతరేసే సమయం

ఆకాశం అంతా
కారుచీకట్లు కమ్ముకుంటాయ
బలవంతం ఏమీ లేదు
అంతా నీ ఇష్టమే

09/09/2019 - 22:23

అక్కడి దృశ్యం
కళ్ళు లేని నదిలా ఉంది!

కొండ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక
చినుకుల స్పర్శతో నవ్విన ఆకాశం
మెరుపులూ ఉరుములూ పిడుగులతో
అకస్మాత్తుగా ఆగ్రహాన్ని ప్రకటించింది!

ఈ శీతవేళ
మనసుకి ఏమైందో ఎవరికి తెలుసు?!

నిజం
నిట్టూర్పు రహస్యం
ఎవరికీ అంతుబట్టదు కదా!

09/09/2019 - 22:21

ఏ హక్కుతో ఆనందంగా
స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నావో
ఏ హక్కుతో అవిరామంగా
స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నావో
ఏ హక్కుతోనైతే ఈ నేలపై
యధేచ్ఛగా తిరుగాడుతున్నావో
ఏ హక్కుతో
నోరు తెరిచి ప్రశ్నిస్తున్నావో
ఆదమరచి నిద్రిస్తున్నావో
ఏ హక్కుతో సమాజంలో
నీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నావో
ఏ హక్కుతో నిర్భయంగా

09/09/2019 - 22:17

‘‘శతపత్ర’ రచయితకు శత జయంతి ఏది?’’ శీర్షికన ఆంధ్రభూమి ‘సాహితి’లో పెద్దలు డా.అక్కిరాజు రమాపతిరావుగారు వ్యాసం రాశారు. డా.గడియారం రామకృష్ణశర్మగారి బహుముఖమైన, అసాధారణమైన కృషిని గురించి వివరించారు. ఆంధ్ర (నేటి తెలంగాణ) సారస్వత పరిషత్తు నిర్మాతల్లో శర్మగారు ప్రథమగణ్యులని తెలియజేశారు. చాల సంతోషం. గడియారంవారి శత జయంతి ఏది? అని ప్రశ్నార్ధక శీర్షికపెట్టారు.

09/02/2019 - 01:39

నీకు తెలియని గొంతేదో
నిన్ను పిలుస్తుంటుంది
దీనంగా!

నువ్వు చూడని చూపేదో
నిన్ను వెంబడిస్తుంటుంది
నీడలా!

నువ్వు పిలవని పిలుపేదో
నీకే ప్రతిధ్వనిస్తుంటుంది
ఆర్తిగా!

అక్కడేముంది...
మర మనుషుల మధ్య?!
కుళ్లిన మనసుల మధ్య
ప్లాస్టిక్ నవ్వుల మధ్య!
శుష్క వాగ్దానాల మధ్య!
నాగరికత మృగ్యమైన
నగరాల ఎడారుల్లో...?

09/02/2019 - 01:38

ఎనె్నన్ని అందాలు ఈ భూమి మీద
ఎన్ని ఆనందాలు, ఈ బ్రతుకులోన
కడలి కెరటాలపై
కదులునొక అందం
కొండ కొమ్మున
కూరుచుండనొక అందం!
తేనెటూహలలోన
తేలుటానందం
అంబరాన విమానయాన మానందం
పల్లె బడిలోన వర్ధిల్లు ఒక అందం
పట్టణాలకు ఆటపట్టు వొక అందం
పూలు నగుపూలు పొంగించు ఆనందం
ఉభయ సంధ్యారాగ విభవమానందం
అన్ని అందాలొక్కటయ్యె నీయందే

09/02/2019 - 01:36

కాలం
ఎంత నిర్దయనో
రాలుతున్న పండుటాకునడగాలి

ప్రాయమున్నంతకాలం
ఎన్ని చిందులు వేసినా
పత్రాన్ని హరిత పతాకం చేస్తది!

పూల మధ్య
రసభరిత ఫలాల నడుమ
రాజ్య వైభవాన్ని అంటగడ్తది!

మండుటెండల్లో
పచ్చని గొడుగును చేసి
ప్రాభవాన్ని వెదజల్లుతది!

విస్తరిస్తున్న కొద్దీ
అమ్మతనాన్ని అంటగట్టి
అజరామరత్వాన్ని రాసిస్తది

09/02/2019 - 01:32

ఆసక్తికరంగా ఉంది కదూ? ఆనందించ వలసిన విషయం కూడా కదూ?? ఇది ఎట్లా సంభవించిందంటే భారతదేశం పట్ల ప్రపంచంలో ఉన్న గౌరవంవల్ల అని చెప్పాలి. భారతదేశంలో వేల సంవత్సరాలుగా పురాతన సంస్కృతి, తత్త్వ చింతన, ధార్మిక బోధ, అనుపమాన సంగీత, సాహిత్య, నాట్య, నాటక కళాసంపద ప్రపంచానికి తెలుసుకాబట్టి ఈ అపురూపమైన సంఘటన చోటుచేసుకున్నది. హైదరాబాదు నగరంలో బషీర్‌బాగ్ చౌరస్తాఉంది. అది చాలా ప్రముఖమైన కూడలి.

Pages