S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/07/2019 - 00:56

నేనో అక్షరాన్ని
సమాజానికి సమస్యలకు
మధ్య ఊగిపోతుంటాను
సమాజాన్ని బ్రతికించాలని
సమస్యలను చంపాలని

నేనో పదాన్ని
పదవికి పెదవికి మధ్య ఊగిపోతుంటాను
పెదవిలో పదమై నిలవాలని
పదవిలో ప్రగతిబాటై సాగాలని

నేనో వాక్యాన్ని
వేదనకు వాదనకు మధ్య ఊగిపోతుంటాను
వేదనను వెలివేయాలని
వాదనను జయించి
వెలుగుకు వేకువవ్వాలని

10/07/2019 - 00:55

ఇన్ని నాళ్లు దేన్నుంచైతే
తప్పించుకోవాలని చూసానో
అదే ముట్టడించి నన్ను కట్టడి చేస్తుంది

ఇటీవల మా మనుమరాలు
ఏడ్చేడ్చి వాళ్ల అమ్మతో
ఆండ్రాయడ్ ఫోన్ కొనిపిచ్చి
ముసిముసిగా నవ్వుతూ
నాకు కానుకగా ఇచ్చింది

ఎలా వాడాలో తెలువదు
మనుమరాలును ఎంత బతిమిలాడినా
చెప్పదు కాక చెప్పదు
ఇక మొదలైంది నాకు తిప్పలు

10/01/2019 - 22:10

కాలం
పరుగెత్తుతూనే ఉంటుంది
కాలంతోపాటు
కదలిపోవడమే
మనిషి చేయవలసింది
మనిషి అంటేనే
మానవమూర్తి
మానవత్వం పంచుతుంటేనే
మనిషికి కీర్తి

10/01/2019 - 22:09

దేహం గాయపడ్డప్పుడల్లా
కట్టుకట్టిన స్నేహం..!
ఉడుకెత్తిన జ్వరమానికి
చల్లదనాన్నిచ్చిన చేయి-
వేకువ ఉదయానికి
మెలకువనిచ్చిన కదలిక
పేగు కదిలిన చప్పుడుకు
అల్లాడిన హృదయం..!
కళ్ళల్లో తొణకిన స్వప్నాల్ని
జారనీయని దోసిల్ల సోపతి;
రగిలిన బాధల్లో
కరిగిన కాలం కొవ్వొత్తి-
వాలిన మబ్బుల మధ్య
కోరిన దృశ్యాలు అస్పష్టం

10/01/2019 - 22:05

తడికి దూరమైన తులసిమొక్క
పొడిబారి పండుదై పోయినట్టు
నువ్వు నవ్వుకు దూరమై
రాలిన పువ్వై పడున్నావ్

09/23/2019 - 22:42

పచ్చని చెట్టును చూసి
మోసపోతే ఎలా?
భూమిని పాతుకుపోయన
చెట్టు వేళ్ళ బాధ వర్ణనాతీతం...

గుప్పెడు గుండె
కాలితనంతో మసక మసకగా రోదిస్తోంది
కళ్ళు మూసినప్పుడు
కనురెప్పల ముల్లులు చేసే గాయాలకు
బాధ కన్నీరై ఉడికిపోతోంది...

‘నా’ అనే అక్షరంలోని ఒంటరితనం
నరాల్లోకి చేరి
జీవితాన్ని మలుపులు మలుపులుగా
శాసిస్తోంది...

09/23/2019 - 22:40

నాలుగేండ్లు వలసపక్షినై పోయవచ్చేసరికి
నే పుట్టి పెరిగిన వూరొకటి కాటగలిసిపోయందిక్కడే
ఇక్కడ నా మూలాలుండేవి, ఆనవాల్లుండేవి, జ్ఞాపకాలుండేవి
చిన్నప్పుడు నా చేయ పట్టుకుని
నాన్నలా నడిపించుకుని వెళ్లిన మట్టితోవ
కనుమరుగయంది
నాలుగులైన్ల నల్లని డాంబర్ రోడ్
పింజర తొవ్వని మింగేసి
నాలుగు రోడ్ల కూడలిలో సుట్టసుట్టుకుని పడుకుంది

09/23/2019 - 22:33

తెలుగులో మొట్టమొదటి చారిత్రక నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులగారు వారి 152వ జయంతి ఉత్సవాలు హైదరాబాదు త్యాగరాయ గానసభలో 26 సెప్టెంబరు గురువారం సాయంత్రం జరుగుతాయ. ఆ సందర్భంగా చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌కు చిలకమర్తి సాహితీ పురస్కారం అందజేయనున్నట్లు కినె్నర ఆర్ట్ థియేటర్స్ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

09/16/2019 - 23:02

అక్కడ వెనె్నల వెలుగు తొంగిచూసేది
మువ్వనె్నల జెండా స్వాగతిస్తుంటే
మానవత్వం పలకరించేది...

మట్టివాసన పులకింతలతో
మమకారపు లోగిళ్లూ
నిండుకుండలల్లే తొణికిసలాడేవి

పల్లె వేడుకగా నిలిచేది
పల్లె పలుకులో మురిసిపోయేది
పచ్చదనంతో ఊరంతా తోరణాలే
రంగురంగుల హరివిల్లులే...

09/16/2019 - 22:59

ఎటుచూసినా దగా, మోసం
రాజ్యమేలుతుందేమో అహం, స్వార్థం
అంతులేని ఆర్తనాదాలు
అర్థం కాని ఆకలి కేకలు

విస్తీర్ణంలో అతి పెద్ద దేశం
ప్రపంచంలో అతి పేద దేశం
అవినీతిలో ముందుంటాం
ఐక్యతలో చిట్టచివరుంటాం

దేశమంతా రాజకీయ నిరుద్యోగులే
చేసేవేమో బడా వ్యాపారాలు
చెప్పేవేమో నీతి వచనాలు
కట్టేవన్నీ అవినీతి కోటలు

Pages