S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

11/27/2018 - 18:39

మరి ఎందుకు చెడిపోడో కూడ వేదం తదుపరి వాక్యంలో ‘త్రీష పవిత్రా హృద్యంతరా దధే’ ‘‘మూడు పవిత్రమైన ధర్మాలను హృదయ పూర్వకంగా ఆచరిస్తాడు’’ కాబట్టి అని కారణాన్ని చెప్పింది. ఆ మూడు ఏమంటే
1. 1.్భగవంతుడు
2.జ్ఞానం
3.్ధ్యనం
2.
1.జ్ఞానం
2.కర్మ
3.ఉపాసన
3. 1. పవిత్రాలోచన
2. పవిత్ర సంభాషణ
3. పవిత్ర సదాచారానుసరణ.

11/26/2018 - 18:53

‘‘హృదయాకాశంలో ఉన్న మనోమయ పురుషుడే ఆత్మ. అందలి అమృతమే హిరణ్మయుడు.’’ జీవుల హృదయగత ఆకాశం ఆత్మకు నివాస స్థానం. పరమాత్మ లభించే ప్రాప్తిస్థానం కూడ అదే. హృదయాకాశంలో ఉండే ఆత్మ- పరమాత్మల అనే్వషణ ఛాందోగ్యోపనిషత్తు (8-1-1)లో ఇలా వర్ణింపబడింది.

11/25/2018 - 22:08

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

11/23/2018 - 18:18

భావం:- ఓ ఇంద్ర! ఓ జీవాత్మా! నీకు పరమ మిత్రులమైన మేము ప్రాణాలతో కలిసి తయారుచేసిన సోమరసాన్ని రక్షించు. ఎందుకంటె జీవన సమరంలో చిక్కుకొన్న నీకు నలువైపుల నుండి నీకు రక్షణగా అనేక దేవతలు సిద్ధమైయున్నారు.

11/21/2018 - 18:50

జ్ఞాన- కర్మేంద్రియాల వలె ఈ జంటలోని ప్రాణం బయటనుండి లోపలికి ప్రవేశిస్తుంది. అపానం లోపలినుండి బయటకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణ-అపానాలు కూడ జ్ఞాన- కర్మేంద్రియాల జంటవలె ‘యమ్యా’ జంటయే. ఈ జంట కూడ మొదటి జంటవలె భిన్న స్వభావయుక్తమైనదయినా శరీరాన్ని సదా రక్షిస్తూ ఉంటుంది.

11/20/2018 - 20:13

ఈ పృథివి కంటె జలమయమైన సాగరం చాలా విశాలమైనది. దానిలో ఎన్నో నదులు వచ్చి కలుస్తాయి. కాని అది ఉప్పొంగక స్థిరంగా ఉంటుంది. ఇట్టి సముద్రాన్ని దృష్టాంతంగా తీసుకొన్న మనిషి ‘న రిష్యతి సవనమ్’ చేసే యజ్ఞం లేదా పురుషార్థం నిష్ఫలం కాదు. అతడి కన్ని విషయాల్లో వృద్ధియే ప్రాప్తిస్తుంది. ఏ విధమైన హాని కూడ ఉండనే ఉండదు. అయితే ఇది ఎవరికి సిద్ధిస్తుంది?

11/19/2018 - 19:15

తుచ్ఛ్వాన్ కామాన్ కరతే సిష్విదానః’ బహిరంగాంగా ప్రేమిస్తూ ఆంతరంగా దురాలోచనలను చేసేవాడు అని రుూ ఋగ్వేదమంత్రం చెబుతోంది.

11/19/2018 - 03:26

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

11/16/2018 - 18:34

ఇది ‘అస్మై ఇత్ ఇంద్రాయ’ = అన్న ప్రస్తుత మంత్ర వచనానుసరం కేవలం ఈ జీవుని కొఱకు రచింపబడినదే. ఈ వేద కావ్యంలోని వచః= వచనాలు అంటే మంత్రాలు- సూక్తాలు అన్ని ఉక్థ= నోటితో చెప్పదగినవి. అంటే పఠన- పాఠనయోగ్యాలు. అందుచేత శంస్యమ్= ప్రశంసార్హమైనవి.

11/15/2018 - 18:33

రైలు, టెలిగ్రాము, ఓడ, విమానం, ఫోను, విద్యుద్దీపాలు, నూనె, నెయ్యి తయారుచేయడం, అన్నం వండటం, బెల్లం, పంచదార, ఫలహారాలు, బంగారు ఆభరణాలు, కారు, పెట్రోలు, కిరసనాయిలు, ఇత్తడి, రాగి, పాత్రలు, లోహాలతో ఉపకరణాలు శస్త్ర, అస్తల్రు, వివిధ లోహాల భస్మాలు, సిమెంటు, సిమెంటు ఉపకరణాలు ఇలా ఎన్నని లెక్కపెట్టాలి? ఇవన్ని మనిషియే సృష్టించాడు. కాబట్టి మనిషిని చిన్నో- పెద్దో ఒక బ్రహ్మగా అంగీకరించడంలో తప్పేమీలేదు.

Pages