S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/08/2018 - 21:35

సానుకూల దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం మహనీయుడు అబ్దుల్ కలామ్. ఒక ఆదర్శాన్ని తీసుకుని దాని గురించి కలలు కనమన్నారు. మీ వ్యక్తిత్వం అంతా ఆ కలతో మమేకం కావాలి. ఇదే విజయానికి మార్గం అని ఆయన చెబుతుంటారు. అలాంటి ఆయన జీవితంలో కూడా నిరాశ నింపిన క్షణాలు ఎదురయ్యాయి. అబ్దుల్ కాలమ్ యువకుడిగా ఉన్నప్పుడు వైమానిక దళ ఉద్యోగం కోసం అప్లయ్ చేశారు. కాని అది రాలేదు. పరీక్షలో ఫెయిల్ అయ్యారు.

02/08/2018 - 21:34

రాజకీయాల్లో మీరు ఏవైనా కోరుకుంటే ఒక మనిషిని అడగండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే
ఒక మహిళను అడగండి
-మార్గరేట్ థాచర్

02/08/2018 - 21:31

‘‘పిల్లల్ని ఐదేళ్లు వచ్చేవరకూ రాజభోగాలతో పెంచాలి. పదేళ్ల తరువాత పనిపాటలు నేర్పంచాలి. పదహారేళ్ల వయసు వచ్చాక స్నేహితుల్లాగ భావించి సలహాలిస్తూ సన్మార్గంలో నడిపించాలి.’
- చాణక్య నీతి

02/07/2018 - 22:32

వివాదగ్రస్త అంశాలతో జనప్రియ నాయకులను నాయికల కీర్తిప్రతిష్ఠలను డబ్బులు చేసుకోవాలని కక్కుర్తితో వెండితెరకి యాంటీసెంటిమెంటు అని తెలిసీ ఎక్కిస్తున్న రాణీ హిందీ చిత్ర నిర్మాత కమల్ జైన్‌కి సర్వబ్రాహ్మణ సంఘం జనవరిలోనే అభ్యంతరం చెబుతూ లేఖాస్త్రం సంధించింది. ఈ సినిమా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కధగా చెప్పబడే ఒక నిషేధ గ్రంధంమీద ఆధారబడ్డ స్క్రిప్ట్.

02/05/2018 - 21:34

మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకు
మగవారిని గౌరవించటం తెలుసు.
మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి
ఓ మహిళను ఎలా గౌరవించాలో..ప్రేమించాలో
బాగా తెలుస్తుంది

02/05/2018 - 21:30

మాకూ తెలుసు వంటింటి వస్తువులు ఎలా ఉపయోగపడుతాయో- కానీ దానికోసం కేటాయించే సమయమెక్కడా? అంటారా? అయితే ఇది చదివి చూడండి.
ఆలుగడ్డలు ఉడికించారనుకోండి. ఆ నీళ్ళు సింకులోకి వంపేయకుండా చల్లారాక కాసింత ముఖంపై చిలకరించుకుని పనుల్లో పడితే మీ పని మీది, మీ చర్మంమీది ట్యాన్ సంగతి అది చూసుకున్నట్లే.

02/02/2018 - 22:04

మధుమేహ చికిత్సలో ఆహార నియమాలు కీలకమే. ఎత్తు,బరువు, వయసు, లింగభేదం, శారీరక శ్రమ, వ్యాధి తీవ్రతను బట్టి ఎవరికి వారు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
మంచినీరు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే మధుమేహుల్లో ఒంట్లో నీరు తగ్గిపోతే (డీ హైడ్రేషన్) తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత మేరకు నీరు ఎక్కువగా తాగటానికి ప్రయత్నించాలి.

02/02/2018 - 22:00

ఎటుచూసినా జనారణ్యమే
ఎక్కడ కాలిడినా మృగాల జాడలే
నేను నీడ కోసం తోడు కోసం చూస్తే
నీడ కూడా దుర్బుద్ధితో చెయ్యి పట్టింది
తోడు సహితం ఆటవిక మృగమైంది
కాలేజీ క్యాంపసులో
మృగనయని అంటూ లాలనగా పిలిచినోడే
తక్షకుడై భక్షకుడై కాటేయచూస్తున్నాడు
కామపరిశ్వంగములో నలిపేస్తున్నాడు
ఎలా ఊపిరాడేది? ఏమిటి విపరీతం?
దూరపు బంధువే - రక్త సంబంధీకుడే

02/01/2018 - 20:22

ఈ మధ్య కాలంలో అందాల పోటీలు ఎక్కువైపోతున్నాయి. చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల వారికీ ఈ పోటీలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. చిన్న పిల్లల చేత ముద్దు ముద్దుగా క్యాట్ వాక్‌లు చేయిస్తున్నారు. ఇదంతా వారిలో ఆత్మస్థయిర్యాన్ని కలిగించటానికి అంటున్నారు. పిల్లలను సినిమా నటులతో పోల్చుకుని వారి క్యాట్‌వాక్‌లూ, కుప్పిగంతులూ చూసి మురిసిపోయే తల్లిదండ్రులు ఎంతమందో!

01/31/2018 - 20:07

పోయినవారం చెన్నైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సమారోహానికి రాష్ట్ర గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ - కంచిపీఠం చిన్నసామి (జూనియర్) శంకర విజయేంద్ర సరస్వతి- ఇంకా ముఖ్య అతిథులు అందరూ వేదికని అలంకరించారు. సందర్భం - తమిళ సంస్కృత నిఘంటువు విడుదల కనుక- జూనియర్ కంచి పీఠాధిపతి రాక ముదావహమే కానీ సభ ప్రారంభంలో తమిళతల్లి పాటని పాడి సభని సంప్రదాయబద్ధంగా మొదలుపెట్టారు.

Pages