S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/26/2018 - 22:10

పాపం జనార్దన్‌రావు, ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఆ వూరు నుంచి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు. ఉన్నది చిన్న ఊరు, చేసేది ప్రైవేటు కంపెనీలో స్టెనో ఉద్యోగం. ట్రాన్స్‌ఫర్లూ గట్రా వుండవు. ఉన్న ఒక్క తమ్ముడు, చెల్లీ, అమ్మా, తనలాగే ఆ వూళ్లోనే చదువుకుని అక్కడే పెళ్లిళ్లయి అక్కడే వుంటున్నారు. తండ్రి కూడా బడి పంతులుగా అక్కడే పదవీ విరమణ చేసి అక్కడే కాలం చేశాడు.

02/26/2018 - 22:08

నేటి యువత చదువుకుంటున్నప్పుడు సీరియస్ గా చదువుకున్నా ఒక్కసారి ఉద్యోగం రాగానే ఏదో సాధించేశామని అనుకొంటున్నారు. ఇక అంతా ఎంజాయ్ చేయడానికే రోజులు అనే అపోహతో ఉంటున్నారు. వీక్‌ఎండ్ పార్టీలంటూ దూరంగా వెళ్తున్నారు. వారంరోజులు ఇంట్లో ఉన్నవారితో కనీసం మాట్లాడకుండా గడిపే రోజులు కూడా ఉంటున్నాయ.

02/25/2018 - 23:02

స్ర్తిలకు ఎక్కువ సహన శక్తి ఉన్నట్టే వివేకం పాళ్లుఎక్కువే ఉంటుంది. సమస్య ఏదైనా రాగానే చాలా ఆలోచిస్తున్నాననుకొని చాలామంది పురుషులు సిగెరెట్స్ తాగేస్తుంటారు. మరికొందరు మద్యపానం పుచ్చుకుంటూ ఉంటారు. ఇన్ని చేసినా సమస్యకు పరిష్కారం మాత్రం ఏచేద్దాం అంటూ తమ తమ భార్యల దగ్గరే వస్తారని సర్వేలు తెలుపుతున్నాయ.

02/25/2018 - 19:25

అ అంటే అమ్మే
చింపిరి తల
చిరిగిన బట్టలు
చావిట్లో విరిగిన నులక మంచం
ఏ గుడిసె చూసినా
ఏముంది గర్వకారణం?
ఎండిన డొక్కల్లో పొడి పొడిగా
రాలిపడే ఆకలి రజను తప్ప

02/25/2018 - 19:23

‘‘ముదితల్ నేర్వగలిగిన విద్య కలదే ముద్దార నేర్పించినన్’’ అన్న కవి నానుడిని అనుసరించి, మహిళలు అన్నిరంగములలోను తమవైన ప్రతిభను చాటుతున్నారు. రక్షణ, నేవీ త్రివిధ దళాలలో సైతం మహిళ లే ముందుంటున్నారు. మహిళే మహాలక్ష్మి. లక్ష్మీ అనగా సంపద, బంగారము అని అనుకొంటారు కాని మంగళకరమైన వస్తువులన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. లక్ష్మీ కళలే.

02/23/2018 - 21:12

ఇంతకు ముందుకాలంలో స్ర్తిలకు తగినన్ని సదుపాయాలు ఉండేవికావు. నీళ్లు ఎంతో దూరంనుంచి బిందెలతో మోసుకొని వచ్చేవారు. ఇడ్లీలు, దోసెలుకావాలంటే పనికట్టుకుని మధ్యాహ్నంపూట రుబ్బుకునేవారు. ఇక పొడుల్లు, పచ్చళ్లు అంటే అవీ రోటి దగ్గర కూర్చుని చేసుకొనేవారు. అపుడు స్ర్తిలు ఇంటి వ్యవహారాలన్నీ ఒంటిచేత్తో చేసేవారు.బయట పనులు చేసేవారు కాదు అని వారికి పేరుండేది.

02/22/2018 - 21:08

మనస్సానందానికి డబ్బు అవసరం లేదు. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, మమతానుబంధాలు హేతువులు. ఇవి కావాలంటే కొనుక్కోవడానికి దొరకవు. కానీ మన చేతుల్లోనే చేతల్లోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. ముందు మనం ఆనందమార్గాలను మనచేతుల్తో పట్టుకోవాలి. మనతో కలసి జీవించేవారిలో ఎన్ని లోపాలున్నా వాటిని మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. అవి దుర్గణాలైతే వాటిని ప్రేమతో వారి నుంచి దూరం చేయగలగాలి.

02/22/2018 - 21:00

దేశం ముందుకు పోతోంది. స్ర్తీలు అన్నింటిలోను ముందుకు దూసుకెళ్తున్నా రు. కాని ఇంకా కొంతమంది నిరక్ష్య రాస్యులుగా కూడా అక్కడక్కడ కనిపిస్తునే ఉన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాల్లాంటి మూఢా చారాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయ.

02/22/2018 - 20:57

ఆధునిక జీవితం యాంత్రికమే కాదు- ఆందోళనలమయం కూడా! అభద్రతలూ, ఆత్మన్యూనతలూ, ప్రేమ రాహిత్యాలు, భేషజాలకు పోయి స్వయంకృతంగా పెంచుకుంటున్న అప్పుల బాధలూ, వృత్తిపరంగా వెంటబెట్టే డెడ్‌లైన్లు - టార్గెట్లు- వగైరాది దైనందిన సమస్యలు నేటి ఆధునిక జీవన చిత్రాన్ని ఛిద్రం చేస్తున్న అంశాలు. సంపాదనలు పెరిగాయి- సంపదలు పెరిగాయి- కానీ కంటినిండా నిద్ర కరువై తగిన విశ్రాంతి తద్వారా చేకూరే మనశ్శాంతి మృగ్యమైపోతోంది.

02/22/2018 - 00:26

సృష్టిలో స్ర్తి పురుషులు ఇద్దరూ సమానులే. అనగా + =0 అనగా పూర్ణము. రెండు అరసున్నలు కలిపితే సున్నా అవుతుంది. ఏ పని చేయడానికైనా పూర్ణసంఖ్యల్లో ఏ అరసున్నా అన్నా పనికి వస్తుంది. ఈ కలియుగంలో స్ర్తిపురుషులు వేర్వేరు అని అనుకొంటున్నారు. కాని పూర్వకాలంలో స్ర్తిపురుషులు అధ్యయనం మొదలుకొని అన్నింటా సమానంగా ఉండేవారు. గార్గేయి, మైత్రేయి, రుక్మిణి, దమయంతి ఇలా వీరంతా కూడాసర్వసృష్టికి ఆదర్శప్రాయులే.

Pages