S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

09/02/2017 - 21:18

మనిషి పుట్టుక మనకు తెలియదు. మరణం కూడా తెలియదు. ఈ రెండూ ఇష్టా-యిష్టాలతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి కదా! ఈ రెండింటికి మధ్య నున్న జీవితం మాత్రం అంతా తనిష్ట ప్రకారమే జరగాలని అనుకుంటారు.

09/01/2017 - 23:13

మన అనుసరించే సిద్ధాంతం గురించి మనకు తెలియకపోతే మన జీవితమే వ్యర్థం. ఈ విశాల ఫ్రపంచంలో ఎన్ని మతాలున్నా మతాచారాలలో భేదం ఉంటుందేమో కానీ మత సిద్ధాంతాలందు మాత్రం భేదం ఉండదు.

08/31/2017 - 20:43

‘ఉప’ అనే పదానికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రయోజనం వుందో, ఉపాధ్యాయునికి లౌకికంగా ‘ఉప’ అంత గౌరవం ఉంది, విద్యార్థి విషయంలో. ఉపాధ్యాయుడు అంటే విద్యార్థికి దగ్గరగా ఉండి అధ్యయనం చేసేవాడు. విద్యార్థికి ఆయనం వంటి వాడు ఉపాధ్యాయుడు. అతడిని అనుసరించేవాడు విద్యార్థి. ఇరువురు తరగతి గదిలో వున్న సమయంలో బింబ ప్రతిబింబాలుగా వుండాలి. గురు శిష్యులది విడరాని సంబంధమై ఉండాలి.

08/30/2017 - 23:18

సుఖసంతోషాలతో జీవించమని పెద్దలుదీవిస్తుంటారు. సుఖ సంతోషాలనే పదాల గురించి ఆలోచిస్తే ఈ రెండూ ఒకే అర్థం కలిగినట్టు అనిపించినప్పటికీ సుఖమనేది ఎపుడూ కూడా శరీరానికి సంబంధించి నదిగా ఉంటుంది. అదెలా అంటే ఒకనికి లడ్డు తింటే ఎంతో బాగుం టుంది. అదే లడ్డు మరొకడు తిన్నందువల్ల వానికి బాగుండదు పైగా అజీర్ణవ్యాధితో బాధపడుతాడు.

08/29/2017 - 22:18

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనేది ప్రాచీనోక్తి. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదుఅనేది పెద్దల మాట. అనుభవజ్ఞులు, అనుకొన్నది సాధించిన వారు కూడా పట్టుదలతోనే మేమీపనిని నెరవేర్చామని అంటారు.

08/27/2017 - 20:43

భక్తి గురించి భగవంతుని గురించి ఒకసారి చెప్పింది మరొకసారి చెప్పకపోవడమైనా, ఒక చోట వినిపించింది మరొక చోట వివరించకపోవడమైనా భావ వైవిధ్యానికి నిదర్శనమవుతుంది తప్ప మరొకటి కాదు.్భగవంతునిపట్ల భక్త్భివం పెంచుకుంటున్న వారైనా అదేపనిగా ఆ ఆలోచనలకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారైనా తోటి వారితో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు భక్తికి, భగవంతునికి సంబంధించిన భావాలను, అనుభవాలను పంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.

08/26/2017 - 20:55

సృష్టి అనగా సమస్త లోకాలు, సమస్త జీవరాసులు. ఇవి అన్నియు విరాట్పురుషునియందే ఇమిడి ఉన్నాయి. భూర్భువస్సువర్లోకములగు సమస్త లోకాలు అతల, వితల, సుతలాది ఏడు అధోలోకాలు అన్నీ కలిసి మొత్తం పదునాలుగు భువనాలున్నాయి. ఈయన శిరస్సునందే సత్యలోకము, నాభియందు అంతరిక్షము, శ్రోతమునందు దిక్కులు, పాదములయందు భూలోకము, నాభియందు భువర్లోకము, మొదలైన సర్వ లోకాలు సృష్టించబడినాయి.

08/24/2017 - 21:45

‘గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే’’ అని పూజించే గణేశుడు ఆది పూజలందుకొనేవాడు. వేదకాలంనుంచి సర్వగణాలకు అధిపతి.. ప్రధమారాధ్యుడు. పార్వతీ పరమేశుల చేత పూజించబడేవాడు. సర్వదేవతలకు, యక్ష, రాక్షస, కినె్నరకింపురుషాదుల చేత కొనియాడబడేవాడు. విఘ్నాలను హరించేవానిగా మానవుల చేత స్తుతులందుకునేవాడు గణపతి.

08/23/2017 - 22:02

పూర్వము దండకారణ్యంలోని మునుల పర్ణశాలలపై ఆధారపడి మూషికాలు జీవనం కొనసాగించేవి. అందు ఒక మహర్షి ఆశ్రమంనందు మూషిక రాజైన అనింద్యుడు తరచుగా ఆశ్రమములోని ఆహారమును, వస్తమ్రులను పాడుచేసి వారిని తీరని మనోవ్యధకు గురిచేసేవాడు. తుదకు సంవత్సరకాలం నిష్ఠతో ఆచరించిన విఘ్నేశ్వర వ్రతము యొక్క ముగింపులో అఖండ నైవేద్యమును సైతం తిని అపవిత్రముగావించినాడు.

08/22/2017 - 21:05

కృష్ణము అంటే నల్లనిది, అశుభ సూచకం అన్న అపోహ పోకార్చడానికే వృష్టి వంశంలో ఆ పరమాత్మ కృష్ణనామంతో దేవకి వసుదేవులకు జన్మించాడు. భయపడకండని భక్తులకు అభయ ప్రదానం చేసాడు. దుష్టులను, దురాచారాలను రూపుమాపడానికే రేపల్లెలో పుట్టి గోకులంలో పెరిగి ద్వారకా నగరంలో కొలువుతీరాడు. భక్తులపాలిట కల్పవృక్షంగా, కామధేనువుగా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మగ్లాని వల్ల లోకానికి జరిగే హానిని హరించాడు.

Pages