S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

09/26/2017 - 20:46

వాక్కు ప్రప్రథమంగా ఓంకార ప్రణవ రూపం లో ఏకపదియై, తర్వా త వ్యాహృథి సావిత్రీ రూపములో ద్విపదియై, అటుపైన ఋగ్యజుస్సామధర్వవేదముల రూపములో చతుష్పదియై, అనంతర శిక్షా వ్యాకరణ ఛందోనిరుక్త కల్ప జ్యోతిష పురాణ ధర్మ శాస్తమ్రుల రూపంలో అష్టపదియై, తదుపరి మీమాంస న్యాయసం ఖ్య యోగ పంచరాత్ర పాశుపతా యుర్వేద ధనుర్వేద గాంధ ర్వ వేదముల రూపంలో నవపదియై తరువాత అనంతములైన వాక్య సందర్భాలచే సహస్రాక్షరయై అప్రమేయ ప్రభావంతో ప్రకాశిస్

09/24/2017 - 21:31

అధర్వణ వేదం ప్రకారం గాయత్రీదేవి సద్బుద్ధిని, దీర్ఘాయుష్షుని సత్సాంతానాన్ని, గోసంపదను, కీర్తిప్రతిష్ఠలను, బ్రహ్మవర్చస్సును అంతే కాదు మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవతగా ప్రఖ్యాతి పొందింది. గాయత్రికి మించిన మం త్రంగాని, ఆ తల్లికి మిం చిన దైవంగాని లేరు. గాయత్రీమాత కాంతి స్వరూపం, తేజోమయి. కాంతుల్లోని దివ్య కాంతి. స్వప్రకాశం కలిగిన అఖండ మైన వెలుగు.

09/23/2017 - 18:42

‘‘జ్ఞాన, కర్మ, భక్తి...’’ భావములలో ఉత్తమమైనది ‘‘్భక్తిమార్గము...’’ అది నిత్యము, సత్యము... భగవంతునిగాంచుటకు ‘్భక్తి’యే మేలైనది! అందు లోను అమ్మవారి పూజించడం కొలవడమనేది ఆచారంగా వచ్చి నా సంప్రదాయంగా ఆచరించినా అమ్మవారి కృపకు అంతరా యం కలుగదు.

09/22/2017 - 18:17

పూజించే సమయంలో ‘రూపం’లోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, తత్త్వవిచారం చేసేటప్పుడు సర్వత్రా గోచరిస్తుంది. బ్రహ్మముఖాన సరస్వతిగా, విష్ణువక్షాన లక్ష్మిగా, శంభుని దేహాన పార్వతిగా, విశ్వశరీరునిలో ఆకాశరూపంలో ఉన్న ఆదిపరాశక్తిని శరత్కాలంలో అమ్మను విశేషంగా పూజిస్తారు.

09/21/2017 - 18:49

శరన్నవరాత్రులలో ఆరాధించే శక్తిస్వరూపిణినే తెలంగాణలో బతుకమ్మగా భావించి పూలతో అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ ప్రారంభం బొడ్డెమ్మను అలంకరించడంతో మొదలై ఆశ్వీజమాసం తొమ్మిదినాళ్లు సాగుతుంది. బొడ్డమ్మ బొడ్డమ్మ ఉయ్యాలో నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో అంటూ స్ర్తిలందరూ పాటఅందుకోవడమే బతుకమ్మను ఆహ్వానించడం- అలా పూజించడం ప్రారంభమవుతుంది.

09/20/2017 - 18:13

భారతీయ సనాతన సంప్రదాయంలో శక్తి ఉపాసన ద్వారా మానవులు తమలోవున్న అశక్తతను విడనాడి జీవితాలను కొనసాగించాలని తెలియజేసే మహా పర్వదినాలే శరన్నవరాత్రులు. కాల చక్రంలో అశ్వయుజ కార్తీక మాసములు శరదృతువులు. వర్షాకాలం ముగిసి వర్షాలు తగ్గి ప్రకృతి కాంత కొంగొత్త కాంతులను సంతరించుకుంటుంది. ఈ శరదృతువులో సూర్యభగవానుడు దక్షిణాభిముఖుడై వుంటాడు. సూర్యుడు శక్తి కేంద్రంగా, చంద్రుడు మనఃకారకునిగా వుంటారు.

09/19/2017 - 18:41

మన సనాతన వాఙ్మయం అత్యంత మహిమాన్వితమైనది, సుందరమైనది. మానవులకు యుగయుగాలుగా సత్యయుతమైన అనుసరణ పథం ఏర్పచినది. ప్రారబ్థ, సంచిత, ఆగామిల ద్వారా వారి వారి కర్మలననుసరించి అనేక జన్మలను పొందుట తప్పదు.

09/17/2017 - 21:26

ఓసారి కలిపురుషుడు బ్రహ్మదేవునితో ఎవరిని సేవిస్తే అధిక ఫలితం వస్తుందని అడిగాడు. దానికి బ్రహ్మ గురువును సేవిస్తే చాలు త్రిమూర్తులకన్నా అధిక సంపన్నుడు గురువు అని చెప్పాడు. గురువు స్వయంగా శిష్యుని పాపాన్ని కడిగివేసి అతనిని శాశ్వతంగా దుఃఖ సముద్రం నుండి గట్టు చేర్చగల శక్తి సంపన్నుడు కేవలం గురువు అని బ్రహ్మ కలిపురుషునకు చెప్పాడు.

09/16/2017 - 18:31

మానవత్వంతో మనిషిగా జీవించిన వారిని మహాత్ములుగా భావించవచ్చు. మానవత్వం తో మసలలేని మనుషులను పశువులుగా గుర్తించడం మనేది సహజం. జననం మరణం మన చేతిలో లేదు. మనిషికి ఏది శాశ్వతం కాదు. జగత్తే అశాశ్వితం. జగన్నాథుడు మాత్రమే నిత్యుడు, సత్యుడు. మనుష్యులు సంఘజీవులు. వారి ఒకరి తోడు లేకుండా మరొకరు జీవించలేరు. ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పర పూరకాలుగా, పోషకాలుగా ఉంటారు.

09/15/2017 - 18:06

పాలలో నీటిని కలిపిన ఎడల అవి రెండూ కలసి పాలుగా మారుతాయి. ఆ పాలనుండి నీటిని ఎట్టి పరిస్థితులల్లోను వేరు చేయలేము. అదేవిధంగా ఆత్మశ్రేయస్సుకై పాటు బడే సాధకుడు అందరితో స్నేహము చేయుల వలన తన లక్ష్యాన్ని కోల్పోయి తనలో నున్న శ్రద్ధ్భాక్తులను ఉత్సాహాన్ని కూడా పోగొట్టుకొనుట సహజం. తనకు తెలియకుండానే అవి చల్లగా మెల్లగా సమసిపోతాయి.

Pages