S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

09/14/2017 - 20:46

సేవక శబ్దం వినగానే లక్ష్మణ ఆంజనేయులే మనసులో మెదులుతారు. లక్ష్మణుడు రామానుజుడు. అతనికి అన్నపై అపారమైన గౌరవం ఉంది. తోబుట్టువు కనుక ఆ ప్రేమ భాత్రు ప్రేమగా మనం చెప్పుకోవచ్చు. అసలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలు నలుగురికీ ఒకరంటే మరొకరికి అభిమానం ఉంది. అందులో రామలక్ష్మణులు ఒక శ్వాసగా పెరిగారు. వారిద్దరూ శరీరాలు వేరైనా ఆత్మఒక్కటే నన్నట్లుగా అన్ని పరిస్థితుల్లో ఉన్నారు.

09/13/2017 - 20:25

నాయకత్వం బాధ్యత కలిగినదై వుండాలి. అనుభవంలోంచి ఆలోచన స్వీకరించేంత ఎదగాలి. స్వతహాగా ఒక ప్రణాళిక వుండాలి. ఎందుకంటే చెప్పిన బుద్ధి దిద్దిన అద్దం ఎంతోకాలం నిలువవు అన్న సామెతలా వుంటుంది. ప్రతి సమాజం తనను భరోసాతో బతకనిచ్చే నాయకత్వం కోరుకుంటుందని చరిత్రకారుడి మాటలు.

09/12/2017 - 21:43

ప్రేమ రెండు అక్షరాలే. కాని అప్పుడే పుట్టిన శిశువుల నుంచి చనిపోబోతున్న వారి దాకా కావాలనుకొనే బలవర్థకమైన పానీయం అది. కళ్లకు కనిపించదు. చేతులకు అందదు. మనసుకు మాత్రమే కనబడుతుంది. మనిషినే కట్టిపడేస్తుంది. అటువంటి ప్రేమ ఒక భావన అనుకొందాం.
ఈ భావన కలిగిన వారిలోను, కలిగించినవారిలోను కలిగే స్పందనలు అనేక రోగాలను సైతం దూరం చేస్తాయని శాస్ర్తియంగా చెబుతున్నారు.

09/10/2017 - 21:54

భగవద్గీత శ్రీకృష్ణుని హృదయమందిరం. మానవ జీవిత మార్గదర్శి. ఆనంద సాగరం. అమూల్య జ్ఞాన రత్నభాండాగారం. సకల ధర్మాల సమన్వయ సారం. చైతన్యానికి ఊతమిచ్చే చేవగల గ్రంథరాజం. వ్యక్తిత్వ వికాసానికి కరదీపిక. ఇహపరాలకు ముక్తిప్రదాత. తత్త్వజ్ఞాన నిధి. ఉపనిషద్వేద సార సంగ్రహ గని. సకల శాస్త్ర సమ్మోహితావని. అజ్ఞానాంధకారాలను తొలగించే విద్యుత్‌మణి. భగవద్గీతకు సాటియైన గ్రంథం విశ్వసాహిత్యంలో మరొకటి కానరాదు.

09/09/2017 - 21:46

భారతదేశంలో గురువుస్థానం ఎంతో ఉన్నతమైనది, పవిత్రమైనది. గురువు అనగా బృహస్పతి, ఉపాధ్యాయుడు, తండ్రి, తాత, అన్న, రాజు, కులపెద్ద, కాపాడువాడు, గొప్పది, అనంతమైనది అనే అర్ధాలున్నాయి. వీరందరు మనకు రక్షకులు, మార్గదర్శకులు. ‘గు’ అనగా అజ్ఞానము, ‘రు’ అనగా కాంతి, ప్రకాశము. అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించి ప్రకాశాన్ని అందచేసే గురువుయొక్క స్థానము ఎంతో ఎంతో గొప్పది.

09/08/2017 - 22:29

అన్ని కాలాల్లోను, అన్ని అవస్థల్లోను, అందరికీ రామనామము కల్పవృక్షము. రామ అన్న నామమే ధర్మార్థ కామ మోక్షములనిచ్చునది, శంకరుని వంటి దైవమే రామనామానే్న పరమార్థ సారముగా చెబు తున్నారు. కాశీ నగరంలోని కాశీ విశే్వశ్వరుడుకాశీలో చనిపోతున్న వారి చెవిన రామనామాన్ని వూదుతాడట. సంసార సాగరాన్ని దాటలేనివారు, కష్టాల కడలిని ఈదలేనివారు రామనామాన్ని జపిస్తే చాలు వారు ఏ మాత్రం కష్టం లేకుండా గట్టు చేరుతారు.

09/07/2017 - 22:25

మనిషి రోజూ చేసే పనులకు అలవాట్లు అని చెప్పుకుంటారు. అదే విడవలేని అలవాట్లు అయితే తప్పనిసరిగా చేస్తున్నదానికి మరో పేరే వ్యసనం అంటారు. మనిషి మానలేని అలవాటునే వ్యసనం అని కూడా చెప్పవచ్చు. మనిషి నిత్యపనులు (కర్మలు) నైమిత్తక పనులు అంటూ వేరువేరుగా వుంటాయి. రోజు చేసే పనులకు కూడా ‘అలవాటు’ మనసు చంచలమై విపరీతంగా బాధపడడం జరుగుతుంది.

09/06/2017 - 22:38

మనిషి స్వతహాగా స్వతంత్రునిగానే జన్మించాడు. కానీ ఆ స్వాతంత్య్రాన్ని నిలుపుకుందామని అనుకోడు. ఒక మహా ధనవంతుడు, గొప్ప అధికారం కలవాడు కనిపిస్తే అతని పంచన చేరాలని చూస్తాడు. అతని ఉద్దేశ్యమేమిటో ముందుగా తానే గ్రహించి, దాన్ని ఆచరించి అతనికి సంతోషం కలిగించాలని చూస్తాడు.

09/05/2017 - 21:58

రామాయణంలోని ముఖ్యపాత్రలలో సుగ్రీవ, విభీషణులను ప్రముఖంగా పేర్కొనవలసి ఉంటుంది. శరణాగత తత్వానికి ఇరువురూ ప్రతీకలే. వీరిరువురు అగ్రజుల దౌష్ట్యానికి గురి అయినవారే. ఎటొచ్చీ రావణుడే కొంత నయం. సుగ్రీవుని భార్య రుమను బలాత్కారంగా వశం చేసుకొన్నటువంటి దుర్మార్గానికి రావణుడు ఒడిగట్టలేదు.

09/03/2017 - 21:16

కామక్రోధాది అరిషడ్వర్గాలలో క్రోధమనేది పరమ దుర్మార్గమైన గుణం. కామ లోభ మోహాదులు ఒక మనిషిని ఆవహిస్తే కాలక్రమేణా అవి తమ ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ కోపం అలా కాదు. తక్షణమే మనిషిని లోబరుచుకుని సద్య ప్రతిస్పందన జరిగేట్టు చేస్తుంది. కోపానికి ప్రతిస్పందన ఎప్పుడూ సకారాత్మకంగా వుండదు. హాని, కలహము, యుక్తా యుక్త విచక్షణ కోల్పోవడం వెంటనే జరుగుతాయి.

Pages