S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

06/17/2016 - 21:50

ప్రపంచంలో తల్లికి ప్రధమ స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని వేదాలు హితవు పలికాయి. తల్లి తాను గర్భం ధరించినప్పటినుంచి పుట్టబోయే శిశువును అతి జాగ్రత్తగా చూసుకుంటుంది. జాగ్రర్తగా తనకుతాను ఆలోచించుకునేస్థాయ వచ్చేవరకు తల్లి పిల్లలకుఅండదండగా ఉంటుంది. ప్రహ్లాదుడు కడుపులో నుండే నారద మహర్షి ఉపదేశాన్ని విన్నాడు. పుట్టినప్పటినుంచి నారాయణ నామంలో తరించి పోయాడు.

06/16/2016 - 21:43

సకల చరాచర సృష్టిలో భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి జీవియందు పరమాత్మ వుంటాడన్నది జగమెరిగిన నిత్యసత్యం. మనకై భగవంతుడు దశావతారాలు దాల్చినా.. ఇంకా ఏదో చేయాలన్న తపనతో ఈ ఇలలో వెలసిన దైవం శ్రీ షిర్డీ సాయిబాబా. మనం పిలిస్తే పలికే కలియుగదైవం బాబా. ఎక్కడ పుట్టాడో ఎలా పెరిగాడో కేవలం మనకై మన మధ్య తిరుగాడిన ఇలవేల్పు బాబా.

06/16/2016 - 05:00

తండ్రి మాట విన్న శ్రీరాముడు కీర్తిపొందాడు. దశరథుడి అంతరంగాన ఉన్న బాధను అర్థం చేసుకుని శ్రీరాముడు కైకేయి చెప్పినట్లు శ్రీరాముడు అరణ్యవాసం చేసి కీర్తిపొందాడు.
తండ్రిమాట విన్న పరశురాముడు తల్లిని చంపి తిరిగి ఆమెను బ్రతికించుకుని తను కీర్తి పొంది శ్రీరాముడిలో ఐక్యం పొందాడు. అంతరంగ రాముడైనాడు.

06/14/2016 - 22:16

‘ప్రతి వ్యక్తీ తాను పుణ్యాత్ముణ్ణి అని అనుకుంటాడు. అలా అనుకోవడంవల్ల అంత ఇబ్బంది లేదు. కానీ ఇతరులు మటుకు పాపాత్ములని అనుకోవడం ఎంతమాత్రం మంచిదికాదు. నిజంగా మహాపాపాలు చేసేవారి యందు కూడా అలాంటి నీచభావన ఉండకూడదు. అయితే ఆ పాపకృత్యాలు కళ్ళారా చూస్తూ అనుకోకుండా ఎలా ఉండగలం అన్న సందేహం కలగడం సహజం. అటువంటి సందేహంతో సతమతం కాకుండా ఉండేందుకో మార్గం ఉంది. అదే ఆధ్యాత్మిక భావన!’ అన్నారు ఆదిశంకరాచార్యులు.

06/12/2016 - 21:32

పోతన కవి మోక్షాన్ని పొందింది , శ్రీనాథుడు సత్కారాలు పొందిందీ, అసలు మానవుల మధ్య గాఢమైన ప్రేమను పుట్టేది మాటలవల్లనే. కాబట్టి సంభాషణ చాతుర్యం పెంపొందించుకోవాలి.

06/11/2016 - 22:01

నేను చేస్తున్న పనేమిటి? దీనివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఎవరైనా ఆనందిస్తున్నారా..? లేక బాధపడుతున్నారా? అంటూ ఆలోచించడమే విచక్షణ తన్ను తాను పరిశీలించుకోవడం. ఒక్కసారి అలా ఆత్మానే్వషణ సాగి నిజంగా తనవల్ల లోకానికంతటికీ మంచే జరగాలని కోరుకుంటూ ఒకరిమీద అనురాగాన్ని చూపడం కానీ, మరొకరివల్ల భయానికి లోనుకావడం కానీ, ఇంకొకరిమీద ద్వేషాన్ని పెంచుకోవడంగానీ ఇవేమీ చేయక నిజాయితీగా జీవితాన్ని గడపడమే.

06/10/2016 - 21:26

ఇద్దరు ప్రేమికులమధ్య అనుబంధాన్ని ప్రేమ అని పిలుస్తాము. ప్రేమ వివాహంతో ముగుస్తుంది. వ్యామోహం అన్నది కోరిక తీర్చుకొనేవరకే. ఒకవేళ వ్యామోహం ప్రేమగా మారి వివాహం అనే పరిణామం చెందవచ్చు. ప్రేమ విషయంలో పుత్రప్రేమకు ప్రాధాన్యత ఉన్నది. దీనికి ప్రబల తార్కాణం దశరథ మహారాజు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనడం ఎవరికైనా అవసరమే! అది ధర్మం కూడాను. దశరథుని విషయంలో అది పుత్ర ప్రేమకు అవరోధం అయింది.

06/09/2016 - 21:31

‘గోవిందుడు’ అనగా ‘శ్రీకృష్ణుడు’ తనను క్షణమైనా విడువలేని ‘గోపిక’లతో కలసి ‘బృందావన’ విహారం చేసేవాడని పూర్వకాలంలో ఇంటింటా చెప్పుకున్న విషయం పరమప్రసిద్ధమైనదే.
అందువల్ల ‘బృందావనం’ ఎంతో ‘పుణ్యప్రదమైనది’గా భావింపబడుతున్నది.
అన్ని చెట్లు పూవులు, పండ్లు ఇచ్చినందువల్ల ప్రత్యేకత నొందితే తులసి ‘ఆకులే తులసిమొక్కకు ప్రత్యేకతను ఆపాదించుతుంది.

06/09/2016 - 04:54

ఒకనాడు మార్కండేయ మహర్షి నారాయణమూర్తినుద్దేశించి ‘‘దేవా నీవు మాయాస్వరూపుడవు. నీ మాయను కళ్ళారా చూచుటకు వేడుక పడుతున్నాను. నన్ను కృతార్థుడను చేయుము’’ అనగా పరమాత్ముడు అట్లేకానిమ్ము అని పలుకుచూ బదరికాశ్రమమునకు తరలివెళ్ళెను. శ్రీ మార్కండేయుడప్పటినుండి భగవంతుని మాయను దర్శించుట ఏనాడో కదా అని వ్యాకుల మనస్కుడాయెను.

06/07/2016 - 22:07

ప్రేమనేభక్తి అంటారు. అపారమైన కృపారాశి యైన భగవంతునిపై నిశ్చలమైన ప్రేమనే భక్తి అంటారు. త్రికాలవేత్త, ఎల్లవేళలా భగవంతుని నామాన్ని విడవక భజించేవాడు అయన నారదుడే భక్తి సూత్రాలను ప్రవచిస్తూ ప్రేమనే భక్తి అని అన్నారు. భగవంతునిపై కలిగిన ప్రేమను వ్యక్తపరచడానికి పలు మార్గాలున్నా వాటిల్లో ప్రముఖమైనవి తొమ్మిది విధాలు.. వాటినే నవవిధ భక్తిమార్గాలన్నారు.

Pages