S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

06/06/2016 - 04:58

పరమేశ్వరుని పాద పద్మములపై మనస్సును లగ్నము చేయుటయే భక్తి అని ఆదిశంకరులవారు సెలవిచ్చారు. భక్తి అను పదము ‘్భజ్’ అను ధాతువునుండి ఉత్పన్నమైనది. దీనికి ‘క్తిన్’ అను ప్రత్యయము చేరగా భక్తి అను పదము ఏర్పడినది. భక్తి అనగా భజించడము లేక సేవించడము అని అర్థము. శ్రీకృష్ణపరమాత్ముడు భగవద్గీతలో భక్తులే నాకు అత్యంత ప్రియమైనవారని సెలవిచ్చియున్నాడు. ‘్భక్తాస్తేతీవమే ప్రియాః’ (్భగ.12వ అధ్యా.

06/05/2016 - 03:12

మనిషి మనుగడ సవ్యంగా సాగాలంటే నీతి నిజాయితీ తప్పకుండా పాటించాలి. లేదంటే మనిషి అధోగతి పాలవుతాడు. ముందుగా మనకు ఈ జన్మనిచ్చిన భగవంతునికి సదా ఋణపడి వుండాలి. మనవంతు బాధ్యతగా ఆ దేవున్ని స్మరణం, కీర్తనం, భజన రూపంలో ప్రతిక్షణం ఆరాధించాలి. అపుడే ఈ జన్మకు ఓ అర్థం పరమార్థం. ఆ తర్వాత మనకు జన్మనిచ్చిన మాతాపితరులయందు.. వారికి జన్మనిచ్చిన వారి మాతా పితరులయందు సేవాభావంతో చూస్తూ వుండాలి.

06/03/2016 - 22:31

మనిషి ఆనందంగా జీవించడానికి కావాల్సిన నైతిక సూత్రాలను, నియమాలను మన మహర్షులు ఏనాడో రూపొందించారు. వాటిని ఆచరించి ధార్మికంగా, తాత్త్వికంగా ముందుకు సాగాలి. ఇందుకు ఉన్నత సంస్కారం, విద్య ఎంతో అవసరం. విద్య కల్పవృక్షం వంటిది. విద్యలో శాస్త్రం ఉంది. ఆధ్యాత్మిక తత్వం ఉంది. విద్య దిక్కులన్నింటా కీర్తి వ్యాపింపజేస్తుంది. ఒక మనిషిని ఇంకో మనిషి విద్యాగంధం చేతనే ఆకర్షించగలరు.

06/02/2016 - 21:50

హిందూ ధర్మం ఎంత సనాతనమైనదో, సదా అంతా నూతనమైనది కూడా. అజ్ఞాన వివశుడై, అహంకారగ్రస్తుడై, అభిమాన మదోన్మత్తుడై, పశుప్రవృత్తితో పతనం కాకుండా, విద్యావినయ సంపత్తితో, వివేకంతో, విచక్షణాజ్ఞానంతో, సహనంతో సమాజ సేవ చేస్తూ, అణువణువున భగవంతుని దర్శిస్తూ, మాధవునికభిముఖంగా జీవితాన్ని కర్తవ్య భావనతో గడపమని, ఋగ్వేదం నుండి నేటి ఉత్తమ సాహిత్యం వరకూ, మానవునికి ప్రబోధం లభిస్తూనే ఉంది.

06/02/2016 - 05:34

మానవజన్మ అన్ని జన్మలకన్నా ఉత్తమమైనది. మానవుడు తన ఉనికిని తెలుసుకొని మసలుకోవాలి. స్వార్థం విడనాడాలి. నేను, నా కుటుంబం, నావాళ్లు అనుకోవడంతోబాటు అందరూ నావాళ్లు అనుకోవడంలో ఎంతో పరమార్థం దాగి వుంది. నా స్వార్థం అని అనుకునేవారిని ఎవ్వరూ తలవరు. నా మనిషి నా సంఘం, నా వాళ్ళు అనుకునేవారికి సమాజం ప్రతినిత్యం స్వాగతం పలుకుతుంది. మనిషి తోటి మనిషికి కాస్త సాయపడాలి. చేతనైన సాయం చేయాలి.

05/31/2016 - 22:26

మహాదేవునిచే సృజింపబడిన ఈ జగత్తునందు మంచి చెడు రెండూ ఇమిడి వుంటాయి. అన్ని అంశములయందు మంచి-చెడు ఉన్నట్లే గుణముల యందు కూడా మంచి చెడు రెండూ వుంటాయి. హంస పాలను గ్రహించి నీటిని ఎలా వదలివేస్తుందో అదేవిధంగా సాధు పుంగవులు సద్గుణ సంపన్నులు అన్నింటా మంచి గ్రహించి చెడు వదలివేస్తాడు. సాధువుయొక్క లక్షణము ఏమంటే ఎదుటివారిలోని చెడు తొలగించుటకు ప్రయత్నిస్తాడు.

05/30/2016 - 07:16

శ్రీమద్రామాయణం సకల వేద సారమైన గాయత్రీ మంత్రాక్షరములతో కూర్చబడిన పవిత్ర కావ్యం. వేద ప్రతిపాదిక ధర్మ నిరూపకం. ఈ మహాకావ్యంలో సీతారాముల తర్వాత వెంటనే చెప్పుకోతగిన విశిష్ట పురుషుడు హనుమంతుడు. శ్రీరామునివలె హనుమంతుడు కూడా ఆదర్శపురుషుడే. సీతాదేవికి కల్గిన రాక్షస పీడను దూరం చేయడంతోపాటు శ్రీరామచంద్రుని వైభవాన్ని ప్రకటించి, రావణుని కీర్తిని చీల్చి చెందాడిన శక్తిసంపన్నుడు, బుద్ధిశాలి.

05/28/2016 - 22:47

వైశాఖమాసము, బహుళపక్షములో దశమితిథిని హనుమజ్జయంతిగా భావిస్తారు. పూర్వాభాద్ర నక్షత్రము, కర్కాటక లగ్నము, మధ్యాహ్న సమయము కౌండిన్య గోత్రములో జన్మించాడు. అయితే ఉగాది పండుగ తరువాత చైత్రశుద్ధ పూర్ణిమనాడు హనుమ లంకలో సీతాదేవికి రామసందేశము వినిపించాడనే విశ్వాసము వ్యాప్తిలో ఉంది. సీతను కనుకొనలేక ప్రాణత్యాగమే శరణ్యమనుకున్నాడు హనుమ.

05/27/2016 - 22:27

మానవుడు సంఘజీవి. సంఘం లేని మానవుని జీవితాన్ని ఊహించలేము. మానవుడు సంఘంలో పలువురితో కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఏవో కొన్ని కారణాల చేత అప్పుడప్పుడు మనఃస్పర్థలు, భేదాభిప్రాయాలు, కోపతాపాలు రావడం సర్వసాధారణం. అలాగే నలుగురితో కలిసి జీవించడంవలన సంతోషము, సుఖము కలగడం కూడా సర్వసాధారణమే.

05/26/2016 - 21:43

మొట్టమొదట శ్రీరాముడు కిష్కింధలో సాధువేషంలో తన వద్దకు వచ్చిన మారుతిని మహాజ్ఞానిగా గుర్తించాడు. శ్రీరాముణ్ణి ప్రధమ దర్శనంలోనే తన వినయ విధేయతలతో, వాక్చాతుర్యంతో, పాండిత్యంతో మెప్పించి ప్రసన్నుని చేసుకున్నాడు. ఇదే విషయం పక్కనున్న లక్ష్మణుడికి తెలియజేశాడు.

Pages