S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

05/25/2016 - 23:03

దక్ష ప్రజాపతి, అసిక్నిల కుమార్తె సతీదేవి. దక్షుడు ఈమెను శివునకిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మవేత్తలు తలపెట్టిన యజ్ఞాన్ని చూడబోయిన దక్షుణ్ణి చూసి సభలోనివారంతా లేచి గౌరవాన్ని ప్రకటించారు. శివుడు మాత్రం దేహాభిమానం కల పురుషులకు నమస్కరించడం తగినది కాదని, భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని భావించి లేవలేదు. నమస్కరించలేదు. భరించలేని దక్షుడు శివుని తూలనాడాడు. శివుడు సైరించాడు.

05/24/2016 - 21:54

ఈ భూ ప్రపంచంలో ‘మాతృప్రేమ’ను మించినది ఏదీ లేదు. సకల జీవకోటి మాతృగర్భాన ఉదయించవలసిందే. సకల జనావళిని భరించేవి.. మోసేది భూమాతయే. అమ్మ నవమాసాలు మోసి మనకు జన్మనిస్తుంది. పాలు ఇచ్చి పెద్దవాళ్లను చేస్తుంది. అడుగులు వేయడం నేర్పుతూనే నడక నేర్పుతుంది. ప్రతి ఒక్కరికీ అమ్మే తొలి గురువు. అందుకే అమ్మను మించిన దైవం ఇలలో లేదు. కళ్ళముందు కదలాడే దైవం అమ్మ. బిడ్డ ఎలాంటివాడైనా అమ్మ ప్రేమలో తేడా వుండదు.

05/22/2016 - 21:52

శ్రీమద్రామాయణం ఒక ఇతిహాసం. శ్రీరామ కథ నిజంగా జరిగిందని, శ్రీరాముడు దుష్ట సంహారము శిష్టరక్షణ చేయడానికి అవతరించిన మహాపురుషోత్తముడని హిందువుల దృఢ విశ్వాసం. అందుకే శ్రీరామునిపైన ప్రజలలో విశ్వాసం చెక్కు చెదరటంలేదు. శ్రీరామచండ్రిని దేశ ప్రజలు ఇప్పటికీ ఒక అవతార పురుషునిగా, మర్యాదా పురుషోత్తమునిగా భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

05/22/2016 - 00:24

శత వసంతాల సంపూర్ణ జీవితంలో 87 సంవత్సరాలు తొలి పీఠాధిపతులుగా ఉపస్థితులైన, జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల పరంపరలో ఆశీనులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి జీవితం ఎంతో అపరూపమైనది. శ్రీ స్వామివారి హస్తంలో త్రిదండాలు ఆధ్యాత్మిక శక్తికి, పాండితీ ప్రకర్షకు, మానవత్వానికి ప్రతీకలు.

05/20/2016 - 21:30

మాధవ మాసంగా పేరెన్నిక గన్న వైశాఖ మాసం మానవుల్లో ఆధ్యాత్మికోన్నతిని కలిగించడంలో ఉత్కృష్టమైనదిగా పేరుగాంచింది.

05/19/2016 - 21:15

‘అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః’ అనే శృతి ప్రకారం, పరమాత్మ అంతటా నిండి ఉన్నది. దీనినే నృసింహావతారము బలపరిచింది.నృసింహావతారం, శ్రీ మహావిష్ణువు అవతారములలో నాల్గవది. భగవంతుడు సర్వాంతర్యామి.

05/19/2016 - 04:25

మానవులు ఏదైనా విపత్కర పరిస్థితికి గురి అయినపుడు అశాంతితో, భయ సందేహాలతో శోకమగ్నులై యున్న సందర్భంలో ఒక మహాజ్ఞానియైన పుణ్యపురుషుడు చేసే హితబోధ, నేర్పుతో చేసే ఓదార్పు, ఆ మానలవులకే గాక అనంతర తరాల మానవాళికి మహా సందేశంగా వుంటుంది. అది చిరస్మరణీయంగా సమాజంలో నిలిచి వుంటుంది. అంత నేర్పుగాను, మానవుల హృదయంపై ముద్రవేసేదిగాను ఆ మహాపురుషుని ఓదార్పు వుంటుంది.

05/17/2016 - 21:24

భగవంతుడు మనకు కన్పించని ఓ అదృశ్య అద్భుత శక్తి. మనల్ని నడిపించేది భగవంతుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని నానుడి. మన పూర్వజన్మ కర్మఫలం మానవ జన్మ. ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశుల్లో అతి తెలివైన ప్రాణి మనిషి. కాని కలి ప్రభావమో.. మానవ నైజమో.. మనిషి మనిషిలా జీవించడం లేదన్నది నేటి నిజం. తన ఆధిక్యత కోసం అయినవారిని.. ఇతరులను ఏ మాత్రం చూడకుండా మోసం చేస్తున్నాడు.

05/15/2016 - 22:40

మాట్లాడే వ్యక్తి వక్త, ఆలకించే వ్యక్తి శ్రోత. ఆలకించడం అందరికీ సులభమే కానీ శ్రవణం కొంతమందికే సాధ్యమగుతుంది. సృష్టిలో చెవులున్న ప్రతి పాణి వినగలుగుతుంది. కాని మనసున్నవారికే శ్రవణం సాధ్యమగుతుంది. శ్రవణం కల్పిత భావాలను దూరం చేయాలి. చెముడు లేని ప్రతి వ్యక్తి ఇంతో అంతో వినగలుగుతాడు. వినడమేమో కర్మ, ఇక శ్రవణమేమో కళ.

05/14/2016 - 22:13

ఒకే వయసు పిల్లలు ఒకే విధంగా ఆలోచించరు. ఏ ఇరువురి ఆలోచనలు సైతం ఒకేలా వుండవు. వారి వారి అభిరుచులు, ఆలోచనలు, అలవాట్లు, నలుగురిలో మసలుకునే తీరు వేరుగా వుంటుంది. చేసే పనిలో ఒకరు అంకితభావానికి మారుపేరులా కన్పిస్తే, ఇంకొకరు నిర్లక్ష్యానికి మరొక పేరులా కనిపిస్తారు. ఒకరు భక్తికి పర్యాయపదమన్నట్లు కన్పిస్తే, ఇంకొకరు భక్తిదేనికని ప్రశ్నిస్తున్నట్లు కన్పిస్తుంటారు.

Pages