S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

11/20/2016 - 21:19

మ తను వెందాక ధరిత్రినుండు నను నందాక న్మహా రోగ దీ
పన దుఃఖాదుల పొందకుండ ననుకంపా దృష్టి వీక్షించి యా
వెనుకన్ నీ పద పద్మముల్ దలచుచున్ విశ్వ ప్రపంచంబు బా
సిన చిత్తంబున నుండ జేయగదవే శ్రీకాళహస్తీశ్వరా!

11/20/2016 - 06:15

శా లేవో కానల గందమూల ఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱుల బల్లవాస్తరణముల్ లేవో సదా యాత్మలో
లేవో నీవు విరక్తులన్ మనుప జాలిం బొంది భూపాలురన్
సేవల్ సేయగబోదురేలొకొజనుల్ శ్రీకాళహస్తీశ్వరా!

11/18/2016 - 21:22

మ మును నీచే నపవర్గ రాజ్య పదవీ మూర్థ్భాషేకంబు గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్క సరియా చింతించి చూడంగ నె
ట్లనినం గీట ఫణీంద్ర పోతమదవేదండో గ్రహింసా విచార
రివి గాగా నిను గాన నేను మదిలో శ్రీకాళహస్తీశ్వరా!

11/17/2016 - 05:01

ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబుంచున్ మహాబంధనం
బేలా నా మెడ గట్టినాడ విన్ నినే్న వేళ జింతింతు ని
ర్మూలంబైన మనంబులోన గడు దుర్మోహాబ్దిలో గ్రుంకి రుూ
సీలా మాలపు జింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!

11/15/2016 - 21:06

నీతో యుద్ధము చేయనోప కవితా నిర్మాణ శక్తిన్ నినుం
బ్రీతుం జేయగలేను నీ కొఱకు దండ్రిం జంపగా జాల నా
చేతం రోకట నిన్ను మొత్తవెఱతుం జీకాకు నా భక్తి యే
రీతిన్ నాకిన్ నిన్ను జూడ గలుగున్ శ్రీకాళహస్తీశ్వరా!

11/13/2016 - 21:10

శా॥ అంతామిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెఱింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్ధముందనువునిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదాశ్రీకాళహస్తీశ్వరా!

11/12/2016 - 22:01

మ రమణీయ క్షితి పాలుడింద్రుని చతుర్మాస క్రమాయుష్యుడా
యమరేంద్రుండజునాడి కాద్వయము వాడా బ్రహ్మయుష్మన్నిమే
షము వాడంచును వీరి నెల్లనగు నీ సాలోక్య సామీప్య స
త్తమ రాజ్యస్థితి పట్ట్భద్రుడగు సద్భక్తుండు సర్వేశ్వరా!

11/12/2016 - 07:27

మ కరుణన్ చేకొని రేని రౌరవ పదగ్రస్తాత్ము దేవేంద్రుగా
బరగం జేయుదుఃరాత్మలో నలిగిరే బర్జన్యునా రౌర లో
త్కర పంక ప్రవిలీన కీటకముగా గల్పింతు రన్నట్టిచో
హర నీ భక్తుల శక్తి యెట్లు గుఱిసేయన్వచ్చు? సర్వేశ్వరా!

11/11/2016 - 00:03

భవదభ్యర్చన వేళలన్ భవుల సంప్రద్భాంతులన్ దీన మా
నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము
ఖ్య విహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో
భువి నీ భక్తుల కాత్మలో విరసముల్పుటిటంచు సర్వేశ్వరా!

11/10/2016 - 07:44

మ సికతాధామము నీకు జేసి మదిలో జెన్నొంది క్రీడించు బా
లకు లింద్రాధికులన్న, నీ గుడులతి శ్లాఘ్యేష్ట కాష్ఠాదులన్
సుకుమారంబుగ నెత్తి భూతలములలో శోభిల్లు వంశప్రదీ
పకు సౌభాగ్యము మానమెవ్వరికి చెప్పవచ్చు? సర్వేశ్వరా!

Pages