S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

12/15/2016 - 06:24

భూషలు కావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలుగావు, పూరుషుని భూషితు జేయు బలిత్రవాణి, వా
గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్ని

12/13/2016 - 21:23

వనజ భవుండు కోపమున వాహనమైన మరాళ భర్తకునే
వనజ వనీవిహార కలనంబు దొలగగ జేయుగాని గుం
భనమున దుగ్ధజీవన విధాన నిరూఢ నైపుణీ
జనిత మహాయశో భవసారము హంసకు మాన్పజాలునే.

12/11/2016 - 21:36

మకర ముఖాంతరస్థమగు మానికమున్ బెకలింపవచ్చు, బా
యక చల దూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు, మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు, మ
చ్చిక ఘటియించి మూర్ఖ జన చిత్తము దెల్ప నసాధ్య మేరికిన్

12/11/2016 - 04:44

చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినగాని దాని హర్షింపరు గా
గొప్పలు చెప్పిన నదియును
తప్పేయని చిత్తమందు దలపు కుమారీ!

12/09/2016 - 21:24

వడిదనిపించు కొనుటకు
గడియైనను బట్టకుండు గాంతలలోనె
క్కుడు గుణవతి యనిపించెడి
నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!

12/08/2016 - 21:31

బహు కష్టములం బొందక
మహిలో సమకూడబోదు మానవ జన్మం
బహహ! ఈ జన్మంబున
నిహపరముల గొనెడు జాడ లెఱుగు కుమారీ!

12/08/2016 - 08:23

కం మఱవవలె గీడు నెన్నడు
మఱువంగరాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనముల
దరి ప్రేమ మెలంగవలయు దరుణి కుమారీ!
భావము: ఓ కుమారీ! ఒకరు చేసిన అపకారమును మరచిపోవలెను. ఎప్పుడైనను ఒకరు చేసి ఉపకారమును మరచిపోకూడదు. లోకమునందుండెడి నడవడికలయందు వాడుక పడవలెను. సమస్త జనులయందు ప్రీతితో నడచుకొనవలెను. లోక మర్యాదలను విడిచిపెట్టకుండా జనులందరిపట్లా ప్రేమతో వుండాలని కవి భావము.

12/06/2016 - 21:18

కం ఎన్నాళ్ళు బ్రతుకబోదురు
కొన్నాళ్ళకు మరణదశల గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్ని హితము సతము మంచి కీర్తి కుమారీ!

12/04/2016 - 21:25

కం మాత్సర్యమోదవు సత్యము
హృత్సరసీ జమున లేమి నెల్లప్పుడు దా
సత్సేవయందు దిరిగిన
మాత్సర్యమణంగు దెలిసి మనుము కుమారీ!

12/03/2016 - 20:53

కం శ్రమయెంత సంభవించిన
క్షమ మరువగ రాదు ధరణి చందంబున స
త్యమున బ్రవర్తించిన యా
రమణియె లోకమునందు రమణి కుమారీ!

Pages