S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2017 - 08:37

సూళ్లూరుపేట, జనవరి 18: ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రికార్డు ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహం చేస్తోంది. ఇంత వరకు అగ్రరాజ్యాలు చేయని ప్రయత్నాన్ని మన శాస్తవ్రేత్తలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటి రెండు కాదు ఒకేసారి 103 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

01/19/2017 - 08:36

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని సిఎం తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ముస్లిం-మైనారిటీల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానమిస్తూ రాష్ట్రంలోని ముస్లిం పాఠశాలలకు కేంద్రం 75 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు.

01/19/2017 - 08:36

శ్రీ కాళహస్తి, జనవరి 18: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గాలిగోపురం పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ గోపుర ప్రారంభ సూచికగా గురువారం నుంచి విశ్వకల్యాణ శాంతి మహాయజ్ఞం జరుగనుంది. 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అతిరుద్రయాగం నిర్వహించడానికి నవయుగ నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసింది. సుమారు రూ.50 కోట్ల రూపాయల వ్యయంతో నవయుగ నిర్మాణ సంస్థ ఈ గాలిగోపురాన్ని నిర్మించింది.

01/19/2017 - 08:40

హైదరాబాద్, జనవరి 18: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం వెల్లివిరుస్తోందని, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు వచ్చి మరింత దోహదం చేస్తే అవినీతిని, పేదరికాన్ని నిర్మూలించాలనే ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పేర్కొన్నారు. నగదురహిత లావాదేవీలు పెద్ద ఎత్తున చేపట్టే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించే ఆలోచన కేంద్రానికి ఉందని చెప్పారు.

01/19/2017 - 08:27

వాషింగ్టన్, జనవరి 18: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి వాషింగ్టన్‌లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది ఆయన అభిమానులు వాషింగ్టన్‌కు చేరుకుంటున్నారు. దీంతో అమెరికా మొత్తం ట్రంప్ మానియాలో తేలియాడుతోంది. ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే.

01/19/2017 - 08:26

చెన్నై, జనవరి 18: జల్లికట్టు నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాట ఉద్యమాలు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జల్లికట్టు తమిళుల ఆత్మగౌరవమని వేలాది సంవత్సరాలుగా తమిళ సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వచ్చిందని మెరీనా బీచ్‌కు వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు నినదించారు. బుధవారం మెరీనా బీచ్ అంతాకూడా నినాదాలతో మారుమోగడంతో పాటు వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలన్న డిమాండ్లు మిన్నంటాయి.

01/19/2017 - 08:28

న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలో లభించే అన్ని రకాల ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాల పోషకాహార విలువలను తెలియజేసే యాప్ సిద్ధమవుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) రూపొందించిన ఇండియన్ ఫుడ్ కాంపోజీషన్ టేబుల్స్ (్భరత ఆహార పట్టికల కూర్పు) పుస్తకాన్ని నడ్డా బుధవారం ఐఎంఆర్ సమావేశంలో ఆవిష్కరించారు.

01/19/2017 - 08:25

న్యూఢిల్లీ, జనవరి 18: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్‌లో అస్సాం తీర్పు పునరావృతమవుతుందా? అస్సాంలో ఎన్నికలకు ముందు బిజెపి అనుసరించిన వ్యూహానే్న ఉత్తరాఖండ్‌లోనూ ఆ పార్టీ అమలు చేస్తోంది. అస్సాంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ ఆయువుపట్టుగా నిలిచిన సీనియర్ నేతలు హిమంత బిశ్వ శర్మతో సహా పలువురు కమలం వైపు దూకడం ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది.

01/19/2017 - 08:24

న్యూఢిల్లీ, జనవరి 18: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ అనివార్యం కావటంతో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లకు ఊపిరాడటం లేదు. నలభై సీట్లున్న గోవా శాసనసభకు ఫిబ్రవరి నాలుగో తేదీన పోలింగ్ జరుగుతుంది. బిజెపి, కాంగ్రెస్, మహారాష్టవ్రాదీ గోమంతక్ పార్టీ, గోవా సురక్షా సమితి కూటమితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగటంతో అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

01/19/2017 - 07:56

న్యూఢిల్లీ, జనవరి 18: అనాధ పిల్లలకు చదువుకునే, వైద్య సేవల్ని పొందే హక్కును కల్పించడంలో భాగంగా వారికి ఆధార్ కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అనాధ పిల్లల పునరావాసం, హక్కుల కల్పనకు ఉద్దేశించిన ఈ పథకాన్ని త్వరలోనే మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఆరోగ్య బీమా, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరమైన వెసులుబాటును కూడా వీరికి కల్పించాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు.

Pages